50 వసంతాలు పూర్తి చేసుకున్న బొమ్మసముద్రం జూనియర్ కళాశాల
హాజరు కానున్న చిత్తూరు ఎంపి, ఎం ఎల్ ఏ, జడ్ పి చైర్మన్
నటి స్వాతంత్య సమరయోధుని కృషి ఫలితం
పాటశాలగా ప్రారంభమై, నేడు కళాశాలగా
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
గుడిపాల మండలం బొమ్మసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఘనంగా సర్వోత్సవాలను జరుపుకుంటుంది. ఈ సర్వోత్సవాలకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. స్వాతంత్ర సమరయోధుడు కొండా మునిరెడ్డి 1947లో ప్రారంభించిన పాఠశాల జిల్లా బోర్డు హైస్కూల్ గా ,తదుపరి జిల్లా పరిషత్ హై స్కూల్ గా మారి ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల\గా కొనసాగుతుంది. ఈ కళాశాలలో పలువురు ప్రముఖ వ్యక్తులు విద్యను అభ్యసించారు. పుట్టిన గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో కేయం రెడ్డి ప్రారంభించిన ఒక పాఠశాల నేడు జూనియర్ కళాశాలగా వెలుగొందుతూ పలువురికి విద్యాదానం చేస్తోంది. నాటి స్వాతంత్ర సమరయోధుడు కేఎం రెడ్డి నేడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం బొమ్మసముద్రం గ్రామంలో కొండాముని రెడ్డి అనే కేఎం రెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యను బొమ్మసముద్రంలో పూర్తిచేసుకుని ఉన్నత పాఠశాల చదువుల కోసం వేలూరులోని ఊరిస్ కళాశాలలో చేరి విద్యను అభ్యసిస్తున్న కాలంలో వారి టీచర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పారు. దీంతో ప్రభావితుడై, కే ఎం రెడ్డి కాట్పాడి నుండి కలకత్తా వెళ్లి శాంతినికేతన్ లో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ని కలిశారు. వారి పాఠశాలలో చేరి విద్యను అభ్యసించారు, వివిధ భాషలను నేర్చుకున్నారు. సంగీతం, డ్రామా మొదలైన వాటిని నేర్చుకుని అనేక డ్రామాలను పాటలు రచించారు. తర్వాత కాలంలో విద్య పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా పర్యటించి ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ జాతీయ పత్రికలో సబ్ ఎడిటర్ గా కొంతకాలం పనిచేశారు. కొంతకాలం కమ్యూనిస్టు ఉద్యమాల్లోపాల్గొని తదుపరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత బొమ్మసముద్రం గ్రామానికి విచ్చేసి విద్యను పేద బలహీన బడుగు వర్గాలకు అందజేయాలని సమన్నత లక్ష్యంతో 1947లో బొమ్మసముద్రంలోని వెంకటముని రెడ్డి, కొంతమంది రైతుల నుండి మామిడి తోపుగా ఉన్నా స్థలాన్ని తీసుకుని పాఠశాలగా తీర్చిదిద్దారు. సొంతంగా వివిధ రైతుల నుండి భూమిని సేకరించి విద్యాలయాన్ని ప్రారంభించారు. తానే స్వయంగా గణిత శాస్త్రం బోధించి చదువు చెప్పారు.1947 లో ప్రారంభమైన పాఠశాల 1949 నాటికి ప్రభుత్వం తీసుకుని జిల్లా బోర్డు హై స్కూల్ మార్పు చేసింది. తదుపరి జిల్లా పరిషత్ స్కూల్ గా, ప్రభుత్వం ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందుతూ, 1974 సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గా ఏర్పడింది. ఎందరో విద్యార్థులకు విద్యను అందించి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దింది. ఈ కళాశాల ఏర్పాటు కోసం అనాటి శాసనసభ్యులు పెరియంబాడిచిన్నమరెడ్డి ఆనాటి ప్రభుత్వం తో పోరాడి చిత్తూరుతో పాటుగా బొమ్మసముద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు తీసుకొచ్చారు. అలాగే 1974 లో నాటి ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు కూడా ఈ విద్యాలయం ఏర్పాటు చేసి తీరాలని పట్టుబట్టి, పాటశాల ప్రారంభించడానికి తన వంతు సహకరించారు. తదుపరి ఎందరో వేలాదిమంది విద్యార్థులు ఇక్కడ చదివి ఉన్నత దశలోకి చేరుకున్నారు. ఈ కళాశాల చక్కటి వాతావరణంలో ఉన్నతమైన, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ విద్యా సేవలను అందిస్తుంది. నేటికి 1974- 2024 మద్య 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ వేడుకలను సగౌరవంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాలుగు కోర్సులు ఎంపీసీ, సీఈసీ, ఎం అండ్ ఏపీ, సిరికల్చర్ కోర్సులు ఉన్నాయి. ఇందులో 132 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ఐదు సంవత్సరాలుగా నూటికి నూరు శాతం ఫలితాలు సాధిస్తున్నారు. అనేకమంది విద్యార్థులను ఇంజనీర్లుగా చదవడానికి ఇంజనీరింగ్ సెట్ కూడా బోధిస్తున్నారు.
నేడు కళాశాల స్వర్ణోత్సవం
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం బొమ్మసముద్రం గ్రామంలో 1974 ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడి 2024 సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు బొమ్మసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవం కార్యక్రమం జరుగుతుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ బండారు శరత్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సయ్యద్ మౌలా ముఖ్య అతిథులుగా హాజరవుతారని వివరించారు. ఈ కార్యక్రమానికి మండల, జిల్లా రాష్ట్రస్థాయి వివిధ పార్టీల సంఘాల నాయకులు, పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు అధ్యాపకుల మధ్య గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై స్వర్ణోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కళాశాల ప్రిన్సిపల్ శరశ్చంద్ర శేఖర్, స్వర్ణోత్సవ కమిటీ అధ్యాపకులు రెడ్డపురెడ్డి, హర్ష, జ్యోతిర్మయి, ఓబులేష్, బత్తయ్య, విద్యార్థులు కోరారు.
పో రై గంగ 1 బొమ్మసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల
పో రై గంగ 2 కళాశాల ప్రిన్సిపల్ శరశ్చంద్ర శేఖర్