2, ఆగస్టు 2023, బుధవారం

బాబు వస్తున్నారు... చందాలు ఇవ్వండి...!?

   


 
                 పూతలపట్టు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చందాలతో విసిగిపోతున్నారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా, చందాలు వాసులు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ కోసం పని చేయాలా? లేక చందాలు వాసులు చేయాలా అని కార్యకర్తలు అడుగుతున్నారు. గతంలో అయితే నాలుగు సంవత్సరాలుగా నియోజక వర్గానికి ఇన్ ఛార్జ్ లేరు. కావున కార్యకర్తలు, నాయకులు చందాలు వేసుకొని, కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇటివల నియిజకవర్గ ఇన్ ఛార్జ్ ని నియమించారు. చందాలు వసూలు చేసే పని తప్పుతుందని కార్యకర్తలు ఆనందపడ్డారు. 


                అయితే పూతలపట్టు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులలో ఆ ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. ఇన్ ఛార్జ్ వచ్చిన తర్వాత చందాల వసూళ్ళు మళ్ళి ప్రారంభం అయ్యాయి. ఇటివల జరిగిన బస్సు యాత్రకు చందాలు వాసులు చేశారు. నారా లోకేష్ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసినపుడు తవనంపల్లిలో సంఘిభావ యాత్ర జరిగింది. దానికి కూడా చందాలు వాసులు చేశారు. నాలుగో తేదిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పూతలపట్టు పోగ్రాం ఉంది, బహిరంగ సభ, ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంది. ఇందుకు 30 లక్షల ర్యుపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఇందుకు నియిజక వర్గ స్థాయి త్రి మెంబర్స్ కమిటి, మండలాల స్థాయి కూడా త్రి మెంబర్స్ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. దీని మీద నియోజక వర్గ Whatsaap గ్రూపుల్లో ఒక massage చక్కర్లు కొడుతోంది. ఆ massage చిత్తూరు న్యూస్ పాటకులకు యథాతధంగా...


పూతలపట్టు తెలుగుదేశానికి అర్జెంటుగా హుండీ కావాలి!

 గతంలో పూతలపట్టు నియోజకవర్గంకు  ఇన్చార్జి లేకపోవడంతో ఎ కార్యక్రమమైనా మండల పార్టీ నాయకులు, నియోజకవర్గం నాయకులు, సమావేశమై అందరూ కొద్దిగా చందాలు వేసుకుని కలిసికట్టుగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేవారు. అందులో మండల పార్టీ అధ్యక్షులతో, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, అనుబంధ సంస్థల నాయకులతో ,పాటు పార్టీ అంటే అభిమానం ఉన్నటువంటి ఇతర పారిశ్రామిక వర్గాలు, బెంగళూరులో స్థిరపడినటువంటి వ్యాపార వర్గాలు, కూడా సహాయం చేస్తూ ఉండేది. ప్రతి సమావేశానికి ఈ విధంగా చందాలు వసూలు చేయటం కాస్త ఇబ్బందికరంగా ఉందని కార్యకర్తలు వాపోతూ ఉండేవారు. కానీ కొత్తగా  నియోజకవర్గంకు ఇన్చార్జి నియమించడం ఎంతో, కార్యకర్తలు ఇక మనకి కష్టాలు తీరిపోయింది అని సంబరపడుతున్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు  పర్యటన ఆగస్ట్, నాలుగో తేదీ ఉండటంతో చిత్తూరులో ఒక హోటల్లో జరిగిన పూతలపట్టు నియోజకవర్గం సమావేశంలో మళ్లీ చందాలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేయడంతో కార్యకర్తలు తల గోక్కుంటున్నారు! ఇదేమి చోద్యం రా! బాబు అని గుసగుసలాడుకుంటున్నారు! నియోజకవర్గానికి ఇన్చార్జి వచ్చారు కాస్త వెనకబడినటువంటి మండలాలకి తన వంతు సహాయం చేస్తారని ఆశపడిన కార్యకర్తలకి నియోజకవర్గ ఇన్చార్జ్ జలక్ ఇచ్చారు. అందరూ కూడా మీ మీ మండలాల్లో ఖర్చులు పెట్టుకొని సభను జయప్రదం చేయాలని చెప్పడంతో కార్యకర్తలకు మైండ్ బ్లాక్ అయింది. మనకు చందాలు వసూలు చేసే కష్టాలు మొదలైందని గుసగుసలాడుకుంటున్నారు.! పైగా చందాలు వసూలు చేయడానికి ముగ్గురు సభ్యులతో నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ కూడా వేస్తున్నట్టు చెప్పడంతో కార్యకర్తలకి దిమ్మతిరిగింది. అలాగే మండల స్థాయిలో కూడా డబ్బులు వసూలు చేయడానికి  ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తున్నట్టు చెప్పడంతో అందరూ ఈ కమిటీకి సి.సి.సి క్యాష్ కలెక్షన్ కమిటీ అని పేరు పెట్టారు!  పూతలపట్టుకు ఒక హుండీ కావాలని కార్యకర్తలు గుస గుసలడుకుంటున్నరు. కొందరు కార్యకర్తలు అయితే  చంద్రబాబునాయుడు అధినేత వచ్చేటువంటి కార్యక్రమానికి సాధారణంగా చందాలు వసూలు చేయడంతో పాటు, ఇన్చార్జి కూడా తనవంతు కర్చులు చేసేవారు. ఆర్ధిక సహాయం అందించి, ఆర్థిక భారాన్ని పంచుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారకపోవడంతో కార్యకర్తలు ఇంకా మన పరిస్థితి ఎప్పటికీ మారదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!  ఇప్పుడే ఈ విధంగా చందాల వసూలు చేస్తుంటే! రేపు ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు పంచవలసి వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంది? అని కార్యకర్తలు చెవులు కోరుకుంటున్నరు. కాబట్టి పూతలపట్టు నియోజకవర్గానికి తక్షణం ఒక హుండీ కావాలని కార్యకర్తలు చెవులు కొనుక్కోవడం కనిపించింది.

 ఇట్లు

 గుంపులో గోవిందయ్య


                      నియోజక వర్గానికి కొత్త ఇన్ ఛార్జ్ వచ్చిన తరువాత నియోజకవర్గ, మండల స్థాయి కార్యకర్తల సమావేశం ఒక్కటి కూడా జరగలేదు. నియోజకవర్గ, మండల తెదేపా కార్యాలయాలు లేవు. ఇటేవల చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ మీద నియోజకవర్గ స్థాయి బూతు కమిటిల సమావేశం జరిగింది. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 వరకు శిక్షణా తరగతులు జరిగాయి. సూళ్ళురుపేటకు చెందిన నియోజక  పరిశీలకుడు బొమ్మన శ్రీధర్ హాజరయ్యారు. 2 గంటల వరకు కార్యక్రమం ఉన్నా, భోజనాలు పెట్టకపోవడంతో కార్యకర్తలు ఉసురోమంటూ  ఇళ్ళకు వెళ్లారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికలలో పరిస్థితి ఏంటని గుంపులో గోవిందయ్య అడగటంతో.. ఇన్ ఛార్జ్, నియోజకవర్గ నాయకులు ఎం సమాధానం చెపుతారో చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *