7, ఆగస్టు 2023, సోమవారం

జిల్లాలో 7 మంది YCP MLAలు ఔట్

 


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకోవడానికి జగన్ వ్యూహం రూపొందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి 13 స్థానాల్లో  విజయం సాధించింది. టిడిపి కేవలం కుప్పంలో చంద్రబాబు గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి మిగిలిన స్థానాలలో తిరిగి గెలుపు సాధించడంతో పాటు కుప్పంలో చంద్రబాబును ఓదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే సర్వేలలో వైకాపాకు ఆరు నుంచి ఎనిమిది సీట్ల కంటే రావని తేలినట్టు తెలిసింది. దీనితో పనితనం సరిగాలేని ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారిని పెట్టాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. కొన్ని చోట్ల కుల సమీకరణాల కోసం మార్పు తప్పదంటున్నారు. 


ఈ నేపథ్యంలో తిరుపతిలో ఈ సారి యాదవ సామాజిక వర్గానికి చెందిన మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ ను బరిలో దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మంచి పట్టు ఉన్నప్పటికీ, టిడిపి సాంప్రదాయ ఓటర్లు అయిన బలిజ, యాదవులు అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి సుగుణమ్మపై  కరుణాకర్ రెడ్డి కేవలం 708 ఓట్ల స్వల్ప మెజారిటీ సాధించారు. ఈ సారి యాదవ సామాజిక వర్గం వ్యక్తికి టిక్కెట్టు ఇస్తే టిడిపి ఓట్లు చీలి పోవడం వల్ల వైసిపి సులభంగా గెలుస్తుందని భావిస్తున్నారు. అందుకే కరుణాకర్ రెడ్డికి టిటిడి ఛైర్మన్ పదవి ఇచ్చారని అంటున్నారు. అలాగే డిప్యూటీ మేయర్ గా  ఉన్న కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కొన్నాళ్ళు ఇంచార్జి మేయర్ గా కొనసాగించి తరువాత ఎన్నికల్లో మేయర్ గా పోటీ చేయించవచ్చని అనుకుంటున్నారని తెలిసింది. 


ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామికి నియోజక వర్గంలో వర్గపోరు తప్పడం లేదు. ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి ఆయనకు  టిక్కెట్టు రాకుండా అడ్డు పడే ప్రయత్నం చేస్తున్నారు. స్వామికి టిక్కెట్టు ఇస్తే ఓడిస్తామని  పెనుమూరు నేతలు కొందరు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి స్వామిని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇటీవల నారాయణస్వామిని CM జగన్ హుటాహుటినా రమ్మన్నారు. నియోజక వర్గంలో రెడ్డి సామజిక వర్గం అనుకూలంగా లేదని చెప్పారు. స్వామి కూడా తరచుగా రెడ్డి సామజిక వర్గం మీద విమర్శలు చేయడాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మరోసారి అవకాశం ఇస్తే గెలవడం కష్టమని వివరించినట్లు సమాచారం. MLC గా  అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలిసింది.. అయితే నారాయణ స్వామి తన కుమార్తె కృపాలక్ష్మి కి అవకాశం ఇమ్మని కోరినట్లు సమాచారం.. కృపాలక్ష్మి కూడా ఇటీవల  రాజకీయంగా చురుగ్గా పాల్గొంటున్నారు.  మాజీ మంత్రి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ బంధువు రాజేష్ టిక్కెట్టు రేసులో ఉన్నారు. 


చిత్తూరు అభ్యర్థిగా ఆర్టీసీ ఉపాధ్యక్షుడు వి ఎం విజయానంద రెడ్డి పోటీ ఖాయమని ప్రచారం జరుగుతోంది.. జిల్లాలో ఒకటి, రెండు సీట్లు బలిజ సామాజిక వర్గానికి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ సారి పలమనేరు టిక్కెట్టు బలిజ సామాజిక వర్గానికి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాసులు మరొక పదవి ఇస్తారని అంటున్నారు. శ్రీనివాసులు మీద సొంత సామాజిక వర్గం వారే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.అందుకు తోడు భూ ఆక్రమణ ఆరోపణలు కూడా వచ్చాయి. స్వర్గీయ DK ఆదికేశవులు కుమారుడు DA శ్రీనివాసులును చిత్తూరు నుండి పోటీ చేపించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభ్యర్థి మార్చు ఉండవచ్చనే సంకేతాలు వస్తున్నాయి.


 పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడకు ప్రజల్లో పలుకుబడి తగ్గిందని YCP సర్వే లో తెలినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. అక్కడ మాజీ ఎంపీ డి కె ఆదికేశవులు నాయుడు కూతురు తేజశ్వరిని పోటీలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. యడమరి ZPTC, ZP వైస్ ఛైర్మన్ గా ఉన్న భూమిరెడ్డి ధనంజయ రెడ్డి పేరు కూడా పేరు కూడా పరిశీలలో ఉన్నట్లు తెలుస్తుంది.  ఇందుకు అనుగుణంగా అభ్యర్థుల అన్వేషణ జరుగుతోంది.


 కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్సీ భరత్ ను పోటీ పెడతామని జగన్ ప్రకటించారు. అయితే ఆఖరు నిమిషంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ధ్వారకనాద రెడ్డి లేదా మరొక తమ్ముడు భాస్కర్ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని బరిలో దింపుతారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. 


పీలేరులో చింతల రామచంద్రా రెడ్డిని స్థానంలో మాజీ ఎమ్మెల్యే జి వి శ్రీనాధ రెడ్డికి అవకాశం కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీనాధ రెడ్డిని ఇతేవలే పార్టీలో చేర్చుకున్నారు. అక్కడ ఎవరు కిశోర్ కుమార్ రెడ్డిని ఓడించగలనే విషయం మీద మల్లగుల్లాలు పడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి  తమ్ముడు భాస్కర్ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని బరిలో దింపుతారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.   


 పూతలపట్టు నియిజకవర్గం MLA MS బాబు మీద కూడా నియోజకవర్గంలో అసంతృప్తి ఉంది. అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఐరాల ZPTC సభ్యురాలు సుచిత్రను ZP వైస్ ఛైర్మన్ చేస్తానని 5.5 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం CM వరకు వెళ్లింది. జిల్లా మంత్రి జోక్యం చేసుకొని సర్దుబాటు చేసినట్లు సమాచారం. ఐరాల మండలం ఐలవారిపల్లి పల్లిలో YCP నాయకులు సమావేశం పెట్టి MLAకు వ్యతిరేకంగా గళం ఎత్తారు. పూతలపట్టులో అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతోంది.  కాణిపాకం EOగా పనిచేసిన కేశవులు, తవణంపల్లి మాజీ MPP పుణ్యసముద్రం రవికుమార్ పేర్లు .పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది.   


నగరిలో  మంత్రి రోజాకు వ్యతిరేకత ఉన్నప్పటికీ టిక్కెట్టుకు డోకా లేదంటున్నారు. అయితే రోజా భర్త సెల్వమణి పేరు కూడా పరిశీనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ. రోజాకు 4 మండలాల్లో బలమైన వ్యతిరేక వర్గం ఉంది. సెల్వమణి మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ సామాజిక ఓట్లు నియోజక వర్గంలో ఎక్కువ. 


సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి అదిమూలంపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందని అంటున్నారు. ఇక్కడ టిక్కెట్టు కోసం తిరుపతి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అజయ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సారి తన కుమారుడు మోహిత్ రెడ్డిని పోటీ చేయిస్తానని ప్రకటించారు. మదనపల్లి, తంబళ్లపల్లె నియోజక వర్గాల్లో మార్పులు ఉండక పోవచ్చునని తెలిసింది. టిడిపి జనసేన పొత్తు ఉంటే జిల్లాలో బలిజ సామాజిక వర్గం వారికి ఉమ్మడి జిల్లాలో రెండు సీట్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎక్కడో ఒక చోట మార్పు తప్పక పోవచ్చు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *