7, ఆగస్టు 2023, సోమవారం

వేంకటేశ్వరస్వామికి ఘోర అపచారం ?!





తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడం వివాదాస్పదం అవుతోంది. హిందుమతానికి చెందని వ్యక్తికి TTD ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని వేంకటేశ్వర స్వామి భక్తులు ప్రశ్నిస్తున్నారు. హిందూ ధార్మిక సంఘాలు ఈ విషయమై అభ్యంతరం తెలుపుతున్నాయి. భూమన తన ఎన్నికల అఫిడెబిట్ లో తాను క్రైస్తవుడు అని పేర్కొనడం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే  కరుణాకర్ రెడ్డి కుమార్తె పెళ్లి కూడా క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిందని చెపుతున్నారు. ఆ ఫోటో కూడా వైరల్ అవుతోంది. పైగా కరుణాకర్ రెడ్డి నాస్తికుడని, దేవుడు అంటే నమ్మకం లేదంటున్నారు. గతంలో స్వామికి ఏడుకొండలు ఎందుకు అయిదు సరిపోతాయని వ్యాఖ్యలు చేశారని చెపుతున్నారు. గతం వెంకటేశ్వరస్వామిని దూషించిన వ్యక్తిని ఉన్నతపదవిలో మరో సారి నియమించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది హిందువుల మనోభావాలను బెబ్బతీయడమేనని అంటున్నారు.

 ప్రపంచంలో ఎక్కడైనా ఓ మతానికి సంబంధించిన ఆలయ బాధ్యతలు మరో మతానికి చెందిన వ్యక్తికి అప్పగిస్తారా..? అసలు ఏమతమైనా ఇలాంటి విపరీత పోకడలను అంగీకరిస్తుందా..? కచ్చితంగా అంగీకరించదు. కానీ ఏపీలో మాత్రం ఇలాంటి విపరీత పోకడలే చోటు చేసుకుంటున్నాయి. హిందూ మత విశ్వాసాలకు విఘాతం కలిగించే చర్యలకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఒడిగట్టింది. ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షునిగా క్రైస్తవ మత విశ్వాసి అయిన వ్యక్తిని నియమించటం కలకలం రేపుతోంది.


 తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి రెండోసారి ఎంపిక అయ్యారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియటంతో ఆయన స్థానంలో భూమనకు రెండోసారి టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఎంపిక పై అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసం..? అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంతే కాదు.. గతంలో  ర్యాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్ యూ) వ్యవస్థాపక సభ్యుల్లో  ఒకడిగా ఉన్న భూమనకు పరమ పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టడం మరింత విస్మయ పరుస్తోంది. 

 ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికి గతంలో కూడా టీటీడీ ఛైర్మన్ గా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూమన 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా పని చేశారు. అప్పుడు కూడా భూమన నియామకంపై అభ్యంతరాలు వచ్చినప్పటికీ.. రాజశేఖర రెడ్డి పట్టించుకోలేదు. తాజాగా ఆయన తనయుడు జగన్ రెడ్డి సైతం హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా భూమనను నియమించటం అత్యంత వివాదాస్పదం అవుతోంది.

విద్యార్ధి నాయకుడిగా ఉన్న సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుల్లో భూమన కరుణాకర్ రెడ్డి  ఒకరు. నక్సలిజంలో ఫ్రంట్ లైన్ గా భావించే ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో భూమన కీలకపాత్ర పోషించారు. నక్సలిజం భావాజాలాలను పుణికి పుచ్చుకున్న ఆయన.. ఆర్ఎస్ యూ క్రమంగా బలహీనపడడం చూసి వైఎస్ కుటుంబానికి ఆయన క్రమంగా దగ్గరయ్యారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ తోనూ సత్ససంబంధాలు కొనసాగించిన భూమన రెండోసారి టీటీడీ చైర్మన్ పదవిపై కన్నేశారు. అయితే  భూమన కరుణాకర్ రెడ్డి సుదీర్ఘ కాలంగా క్రైస్తవ విశ్వాసిగా గుర్తింపు పొందారు. క్రైస్తవ మతాన్ని అనుసరించే ఆయన.. కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకే హిందువుగా చెలామణీ అవుతారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ హోదాలో కూర్చో బెట్టటాన్ని హిందువులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ పరిణామాన్ని  నిజంగా.. ఆ దేవ దేవుని సన్నిధిలో జరిగిన ఘోర అపచారంగా భక్తులు అభివర్ణిస్తున్నారు. 

 ఇక గతంలో భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని సైతం క్రైస్తవ సంప్రదాయం ప్రకారమే నిర్వహించారు. ఆనాటి వివాహానికి ప్రస్తుత సీఎం జగన్ రెడ్డి సైతం హాజరయ్యారు. వాస్తవానికి ఏనాటి నుంచో భూమన కుటుంబం క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ కావటంతో.. వారు క్రైస్తవ సంప్రదాయాలనే పాటిస్తూ వస్తున్నారు. క్రైస్తవ పండుగలనే జరుపుకొంటున్నారని చెబుతున్నారు. తన ఇంట్లో శుభకార్యాలను సైతం క్రిస్టియన్ పద్దతిలో చేసిన వ్యక్తి  ఇవాళ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల దేవస్థానంలో చైర్మన్ గా  విధులు నిర్వహించటం దారుణాతి దారుణమని హైందవ సంఘాలు మండిపడుతున్నాయి. చర్చిల్లో పాస్టర్లుగా పనిచేసుకోవాల్సిన వ్యక్తులు  హిందూ దేవాలయాల్లో కీలక పదవులు అధిరోహించటం ఏంటని బీజేపీ, వీహెచ్‌పి, భజరంగ్ దళ్ వంటి హైందవ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

 ఇదిలా ఉండగా... గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో భూమన తిరుమలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఎందుకని ప్రశ్నించి అభాసుపాలయ్యారు. అంతేకాదు ఒక సందర్భంలో తిరుమల గర్భగుడిలో ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ''నల్లరాయితో పోల్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ధూషణలకు దిగారు. అసలు తిరుమల చరిత్ర, విశిష్టత తెలియని ఒక వ్యక్తిని తిరిగి  టీటీడీ చైర్మన్ గా అందలం ఎక్కించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు.

ఈ విషయం పై  హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద.. హిందూ ధర్మాన్ని నమ్మని ఒక క్రైస్తవ విశ్వాసికి టీటీడీ చైర్మన్ లాంటి ప్రతిష్టాత్మక పదవులు పొందే అర్హత ఏ మాత్రం లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా తాను చేసిన తప్పును సీఎం జగన్ మోహన్ రెడ్డి సరి దిద్దుకుని.. టీటీడీ ఛైర్మన్ పదవిని హిందువులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అలా మార్పు చేయని పక్షంలో ఆందోళనలకు కూడా సమాయత్తం అవుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *