4, ఆగస్టు 2023, శుక్రవారం

రణరంగంగా మారిన అంగళ్ళు

చంద్రబాబు మీద రాళ్లతో దాడి

టీడీపీ బ్యారర్ల చించివేత

రాళ్లు కర్రలతో మరో మారు దాడి

ఆరు మందికి గాయాలు

20 వాహనాలు ద్యంసం

పోలీసుల ప్రేక్షక పాత్ర



అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్ళు శుక్రవారం రణరంగంగా మారింది. రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద రాళ్ళ దాడికి పాల్పడ్డారు. SPG సిబ్బంది బాబుకు రక్షణగా నిలబడ్డారు. వైసీపీ మూకల దాడిలో అయిదారు మంది దేశం కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ బ్యానర్లను వైసీపీ వాళ్ళు చించి వేశారు. దీంతో ఇరు వర్గాల బాహాబాహికి దిగారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించగా, ఆరు మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. చంద్రబాబు అంగళ్ల నుండి వెళ్లిపోయిన తరువాత మళ్ళీ వైసీపీ మూకలు మరోసారి దాడులకు తెగబడ్డారు. 20 వాహనాల అద్దాలను థ్యంసం చేశారు.పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా  గురువారం నుండి ఉమ్మడి జిల్లాలో ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ నాయకులు ప్రకటించారు. పుంగనూరులో అడుగు పెట్టకూడదన్నారు. పోలీసులు చంద్రబాబు రోడ్డు షోకు అనుమతి నిరాకరించారు. గురువారం నుండి ఇరు వర్గాలు మొకలిల్లాయి. అడ్డుకోవడానికి వైసీపీ,  బాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు పట్టుపట్టాయి. వైసీపీ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.


చంద్రబాబుకు వ్యతిరేకంగా తంబల్లపల్లిలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అంగళ్లలో టీడీపీ వారు ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ వాళ్ళు చించి వేశారు. దీంతో ఇరు వర్గాలు తలపడ్డాయి. పోలీసుల ప్రేక్షక పాత్ర కారణంగా ఆరు మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ సంఘటన విన్న చంద్రబాబు చలించిపోయారు. ఆవేశంతో ఊగిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద నిప్పులు చెరిగారు. పెద్దిరెడ్డి పతనం ఈ రోజు అంగళ్ళు నుండి ప్రారంభం అయ్యిందన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. దీంతో మరో సారి రాళ్ళ దాడి జరిగింది. రక్షణ సిబ్బంది బాబుకు రక్షణగా నిలపడ్డారు. దీంతో బాబు ఆవేశం కట్టలు తెంసుకుంది.

అంగళ్లలో ఉద్రిక్తత మంత్రి రామచంద్రారెడ్డి, పోలీసుల పనిగా చంద్రబాబు వర్ణించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలియుగ రావణాసురుడిగా అభివర్ణించారు. ఇలాంటి వారిని భూస్థాపితం  చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పుంగనూరుకు వెళ్తున్న ఆ పుడింగి సంగతి తేలుస్తానని సవాల్ చేశారు. అంబులకే భయపడలేదని నాలుగు రాళ్లు వేస్తే భయపడతానా అంటూ ఎదురు దాడి చేశారు. పులివెందుల వెళ్లాను, చిత్తూరులో పర్యటించడానికి అడ్డంకి ఎందుకు అని ప్రశ్నించారు. ఈ జిల్లాలోనే పుట్టాను ఇలాంటి రాజకీయాలు చాలా చూశానని పేర్కొన్నారు. టిడిపి ఎవరిమీద దౌర్జన్యం చేయదని టిడిపి మీద దౌర్జన్యం చేస్తే వదిలేది లేదన్నారు. డి.ఎస్.పి అసమర్థత కారణంగానే దౌర్జన్యం జరిగిందని, యూనిఫారం విప్పేయలని సూచించారు. వైసీపీ నాయకులు పోలీసుల అండదండలతో దౌర్జన్యాలు చేస్తున్నారని పోలీసులు లేకుండా ధైర్యం ఉంటే ముందుకు రావాలని సవాల్ చేశారు.


చంద్రబాబు ఆంగల్ నుండి వెళ్లిపోయిన తర్వాత మరో మారు  వైసీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. రాళ్లతో కర్రలతో తెలుగుదేశం నాయకులు మీద, వారి వాహనాలు మీద దాడి చేశారు. ఈ దాడిలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. 20 వాహనాలు  ధ్యంసమయ్యాయి. ఈ విషయమై చంద్రబాబు స్పందిస్తూ అంగళ్లు, పుంగనూరు సంఘటన తన జీవితంలో మర్చిపోను అన్నారు. ఇది ఒక బ్లాక్ డే గా వర్ణించారు. ఇంతకు ఇంతా తీర్చుకుంటానని అన్నారు.  తప్పకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు. గాయపడిన కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *