మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు....
ఉమ్మడి జిల్లాలో భాధితుల మీదనే కేసులు
తెదేపా నాయకులతో నిండిపోతున్న జైళ్ళు
పలువురు తెదేపా నాయకులు అదృశ్యం
జిల్లాలో బిక్కుబిక్కు మంటున్న తెదేపా కుటుంబాలు
మూడు నియోజకవర్గాల్లో తెదేపా నాయకులు ఖాలీ
CM దిష్టి బొమ్మ దహననికి 32 మంది మీద కేసులు
మునుపు ఒక అమ్మడు మొగుడిని ఇంట్లో చితక్కొట్టి, ఇంటి వెలుపలికి వచ్చి నా మొగుడు నన్ను కొట్టేశాడు, చంపేశాడు అని ఊరు, వాడ రచ్చ రచ్చ చేసిందట. నిజమే అనుకోని ఊరి ప్రజలు మరోసారి మొగుడిని చితక్కోట్టారట. ఉమ్మడి జిల్లాలో తెదేపా నాయకులు, కార్యకర్తల పరిస్థితి అలా ఉంది. కొట్టి రోడ్డుకెక్కిన వాళ్లేమో వైసిపి కార్యకర్తలు. మళ్లీ మొగుడిని చితక్కొట్టిన వాళ్లేమో పోలీసులు.దెబ్బలు తిన్న వాళ్ళు, మల్లి కేసులు పెట్టిమ్చుకున్న వాళ్ళు TDP వాళ్ళు. అక్షరాల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇదే అమలు జరుగుతోంది. పోలీసులు వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. టిడిపి నాయకులు ఫిర్యాదు చేసిన కేసులు నమోదు కావడం లేదు. ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీదనే అత్యాయత్నం, మోసపూరిత కుట్ర కేసులను నమోదు చేసి తమ ఘనతను, స్వామి భక్తిని చాటుకున్నారు. ఏకపక్ష వైఖరి కారణంగా తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనే వాళ్ళు అజ్ఞాతం లేకి వెళ్లిపోయారు. కొట్టినా, వైసిపి నాయకులు కార్యకర్తలు మీద ఎంతవరకు కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. పైగా CM దిష్టి బొమ్మను దహనం చేసారని పుతలపట్టులో 17 మంది TDP నాయకులు, కార్యకర్తల మీద, యదమరిలో 15 మంది మీద గురువారం పోలీసులు కేసులను నమోదు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాగునీటి పారుదల ప్రాజెక్టుల సందర్భంలో భాగంగా శుక్రవారం తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాలలో పర్యటించారు. చంద్రబాబు పర్యటన గురించి ముందుగానే అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న నేతకు రక్షణ విషయాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అంగళ్లలో పల్లెలో, పుంగనూరులో YCP నాయకులకు అనుకూలంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి, నిరసనలు తెలియజేయడానికి వైసీపీ నేతలకు అనుమతి కూడా అక్కరలేదు. పోలీసులు వారిని చూసి చూడనట్లు వ్యవహరిస్తారు. అవసరమైతే వారికి తగు రక్షణ కూడా కల్పిస్తారు.
సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తున్నారంటే రెండు రోజుల నుంచి ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తారు. నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి కానీ, నిరసన తెలియజేయడం గాని అనుమతించరు. అదే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తే పట్టించుకునే నాధుడు కూడా ఉండడు. ఏదో మొక్కుబడిగా పోలీసు బందోబస్తు ఉంటుంది. వైసీపీ నాయకులు యదేచ్చగా నిరసనలు తెలియజేయవచ్చు. అధికార పక్షం వాళ్ళు వినతి పత్రాలు ఇస్తామని వచ్చి ఫ్లెక్సీలు, బ్యానర్లు, స్వాగత తోరణాలు చించివేయవచ్చు. ఏకంగా పార్టీ నేత మీదనే రాళ్లు రావచ్చు. నాయకులను చితక్కొట్టి, వారి వాహనాలను ధ్వంసం చేయవచ్చును. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయవచ్చు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నాయకులను రెచ్చగొట్టవచ్చు. వీటికి పోలీస్ సహకారం ఉంటుంది. ఏం చేసినా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయరు. దాడులు చేస్తున్నా, చూస్తూ మిన్న కొంటారు. అడ్డుకునే ప్రయత్నం కూడా జరగదు. చివరకు వైసిపి కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులను తీసుకొని తెలుగుదేశం పార్టీ అధినేత, నాయకులు, కార్యకర్తలు వందల మంది మీద కేసులు నమోదు అవుతాయి. దెబ్బలు తిన్న తెలుగుదేశం పార్టీ వాళ్లు ఫిర్యాదు చేసిన దానిమీద మాత్రం ఎలాంటి స్పందన ఉండదు. మల్లి CM దిష్టి బొమ్మను దహనం చేసినా, కేసులు పెడుతారు. బాధితులకు రక్తం కారుతున్న, పట్టదు.
చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా అంగళ్లకు వచ్చేముందు అక్కడ వేచి ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద YCP వాళ్ళు దాడి చేసి గాయపరచారు. రక్తం కారడం కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. తర్వాత చంద్రబాబు నాయుడు మీద కూడా రాళ్ళు వేచారు. చంద్రబాబు రక్షణ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ పరికరాలను చంద్రబాబుకు అడ్డంగా పెట్టి రాళ్లు పడకుండా, అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా ఏర్పాటుచేసిన బ్యానర్లు, స్వాగత తోరణాలను చింపి వేశారు. చంద్రబాబు నాయుడు వెళ్లిన తర్వాత మరోసారి వైసిపి వాళ్ళు మరో మరు రెచ్చిపోయి, తెలుగుదేశం పార్టీ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరగడం గమనార్హం. అయినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చివరకు వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మరికొందరు నాయకుల మీద అత్యాయత్నం కేసులను, నేరపూరిత కుట్ర కేసులను నమోదు చేశారు. మొత్తం సంఘటనను టీవీలలో యావత్ తెలుగు ప్రజలు వీక్షించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులది తప్పు లేకున్నా వారి మీదనే కేసులు బనాయించారు. వారే ముందస్తు దాడికి వ్యూహరచన చేశారని, తుపాకులు, కర్రలు, రాడ్లు, ఇటుకలు, చెప్పులు తీసుకొని దాడి చేశారని కేసుల్లో పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు మీద కేసులు నమోదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం లేపింది. గొడవల కారణంగా ప్రత్యక్షంగా బాధితుడైన చంద్రబాబు మీద కేసును నమోదు చేసి పోలీసులు తన స్వామి భక్తిని చాటుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అంగళ్ళకు చంద్రబాబు నాయుడు వస్తున్నారని సమాచారం ఉన్నపుడు, అక్కడికి YCP నాయకులు కార్యకర్తలు రాకుండా అడ్డుకొని ఉంటే, ఈ పరిణామాలు జరిగేవి కాదు కదా? YCP వారిని నియంత్రించలేని పోలీసులు ఇందులో నిందితులు కారా? బాబు మీద దాడికి ఉసి కొల్పిన నాయకులు, ప్రణాళిక రచించిన వారు నేరస్తులు కారా? బాబు తన వాహనంలో మారణ ఆయుధాలను తీసుకువచ్చారా? ఇంకా నయం భద్రత సిబ్బంది వద్ద ఉన్న తుపాకులను విస్మరించినట్లు ఉన్నారు. వారి మీద కేసులు నమోదు చేయలేదు.