4, ఆగస్టు 2023, శుక్రవారం

రక్తసిక్తం అయిన పుంగనూరు

పుంగనూరులో గాల్లో పోలీసు కాల్పులు

పోలీసుల లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్

పోలీసు వాహనానికి నిప్పు

పోలీసులకు, టీడీపీ శ్రేణులకు గాయాలు

వాహనాలు, లారీలు అడ్డం పెట్టిన పోలీసులు



తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు రక్తసిక్తం అయ్యింది. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు తిరగబడ్డారు. పోలీసుల మీద రాళ్ళు రువ్వారు. దీనితో పోలీసులు అక్కడి నుండి పలుగులు తీశారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాలిలో కాల్పులు జరిపారు. దాడిలో టీడీపీ కార్యకర్తలు, పోలీసులు కూడా గాయపడ్డారు.


పోలీసుల, వైసీపీ నాయకులు, కార్యకర్తల కారణంగా  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇలాఖాలో  మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు  పర్యటన రక్తసిసిక్తంగా మారింది. పెద్దిరెడ్డి కోటలో వైసీపీ, టీడీపీ బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. పోలీసు జీపు, మరోక వాహనం తగుల పెట్టారు. 20 కార్లను  ధ్వంసం చేశారు. టిడిపి కార్యకర్తలు, పోలీసులకు తలలు పగిలి రక్తం చిందింది.  వైసిపి కార్యకర్తలు అరాచకం సృష్టించారని, తనపైనే రాళ్ళు వేశారని చంద్రబాబు ఆరోపించారు.


టిడిపి కార్యక్తలు కావాలనే కవ్వింపు చర్యలకు దిగారని  పోలీసు అధికారులు, వైసిపి కార్యకర్తలు ప్రత్యారోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన రాయలసీమ జిల్లాల పర్యటన నాలుగవ రోజు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది.  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం అయిన పుంగనూరులో  ఇరువర్గాలు మోహరించారు. పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. పుంగనూరు రోడ్డు భీమగాని పల్లి వద్ద రహదారికి అడ్డంగా లారీలు, ఇతర వాహనాలు అడ్డు పెట్టారు. చంద్రబాబు రాకుండా అడ్డుకున్నారు. లారీ అడ్డు తొలగించాలని ఆందోళనకు దిగిన తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపినట్టు సమాచారం. పోలీసులు లాఠీ ఛార్జిలో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. 


  మరో వైపు అంగళ్లు నుంచి చంద్రబాబు కాన్వాయ్‌ వెంట వెళ్తున్న తెదేపా నేతల వాహనాలపై వైకాపా శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు 20కి పైగా కార్ల అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అంతకు ముందు అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం అంగళ్లులో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో తెదేపా శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను వైకాపా కార్యకర్తలు చించేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడి చేశాయి. వైకాపా రాళ్ల దాడిలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించేందుకు ప్రయత్నించారు. 


రాళ్లదాడి చేస్తున్న వైకాపా కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని తెదేపా శ్రేణులు ఆరోపించారు. గాయపడిన కార్యకర్తలకు వెంటనే చికిత్స చేయించాలి పార్టీ నాయకులను చంద్రబాబు ఆదేశించారు.
తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. డీఎస్పీ తన యూనిఫామ్‌ తీసేయాలి. జిల్లా ఎస్పీ కారణంగానే ఈ సంఘటనలు జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. దోషుల మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


పుంగనూరు నీ జాగీరా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు ప్రశ్నించారు. నేను పుంగనూరుకు రాకూదదా అని నిలదీశారు. నేను ఈ జిల్లాలోనే పుట్టనన్నారు. అధికారం శాశ్వతం కాదు. అధికారులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. నేను మళ్ళీ పుంగనూరుకు వస్తా. పెద్దిరెడ్డి అంతు చూస్తానన్నారు. చల్లా బాబు మీద దెబ్బ పడితే తన మీద పడినట్లే అన్నారు. గాయపడిన కార్యకర్తలకు అండగా ఉండనని, అన్ని రకాలుగా అడుకుంటారని హామీ ఇచ్చారు.


 రాబోయే రోజుల్లో వైకాపాను తరిమికొట్టే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారు. ప్రజలు భూస్థాపితం చేస్తారనే భయంతోనే ఇలా చేస్తున్నారు'' అని చంద్రబాబు మండిపడ్డారు. ఇదిలా ఉండగా ప్రతి చోటా చంద్రబాబు రాకను వ్యతిరేకిస్తూ నల్ల జెండాలను ఎగురవేశారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.
పరిస్థితి చేయి దాటిపోతోండటంతో పోలీసులు లాఠీఛార్జీకి దిగారు. రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. అయినప్పటికీ- వారు లెక్క చేయలేదు. మరింత రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. మరొక పోలీసు వాహనానికి వైసీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గుండారాజ్యం నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడాలను ఇక ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. అకారణంగా తమ పార్టీ వారిపై దాడులు చేశారని, పోలీసులు చూస్తూ ఉన్నారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలను వైఎస్ఆర్సీపీ నాయకులు తిప్పికొట్టారు. పెద్దిరెడ్డిని అసభ్య పదజాలంలో చంద్రబాబు దూషించారంటూ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్లు రువ్వారంటూ ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెడ్డపేరు తీసుకుని రావాలని, తద్వారా ఆయనను ఓడించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు వైసీపీ నాయకులపై దాడికి దిగారంటూ మండిపడ్డారు.

జిల్లా ఎస్పీ వివరణ 
పుంగనూరు పరిసరాల్లో అమాననీయ ఘటన జరిగింది - పోలీసులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేశారు - పోలీసులపై మద్యం సీసాలు, కర్రలతో దాడులు చేశారు - చంద్రబాబు బందోబస్తుకు వచ్చిన పోలీసులపై దాడులు - అకారణంగా గంటన్నరపాటు పోలీసులపై రాళ్ల దాడి - దాడుల వేళ పోలీసులు సంయమనం పాటించారు - దాడులు నిరోధించేందుకు పోలీసుల యత్నించారు - పోలీసులు బాష్పవాయువు కూడా ప్రయోగించారు - పోలీసు వాహనాలను అల్లరి మూక తగులబెట్టింది - దాడిలో 13 మంది పోలీసులకు గాయాలయ్యాయి - రాళ్ల దాడిలో సుమారు 50 మందికి గాయాలయ్యాయి - గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం - ఘటనకు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం - విధుల్లో ఉన్న పోలీసులపై దాడులు గర్హనీయం 
 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *