జె డి రాజశేఖర్ కు జనసేన వల
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే చర్యలు జనసేన ప్రారంభించింది. తెదేపా, వైసీపీలలో అసమ్మతి నాయకులను తమవైపు ఆకర్షించేందుకు ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. ఇప్పటికే జనసేన ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బుధవారం సత్యవేడు నియోజకవర్గ తెదేపా నేత, గతంలో MLAగా పోటీ చేసిన జేడీ రాజశేఖర్ ను కలిశారు. జిల్లాలో మరిన్ని భేటీలు జరగనున్నట్లు తెలుస్తుంది.
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం జెడి ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు జెడి రాజశేఖర్ తో మంగళవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఆమంచి సోములు సత్యవేడు హెడ్ క్వార్టర్స్ లో భేటీ అయ్యారు. లాంఛనంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను రాజశేఖర్ అంగీకరించినట్లు ధ్రువపడలేదు. తెదేపా టిక్కెట్టు విషయంలో వేచి చూసే ధోరణితో ఉన్నట్లు తెలిసింది. తెదేపా టిక్కెట్టు నిరాకరిస్తే జనసేనలోకి వస్తాను అన్నట్లు సమాచారం. జేడీ రాజశేఖర్ పార్టీలోకి వస్తే నాలుగైదు నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం అవుతుందని అన్నట్లు తెలిసింది. రహస్య సమావేశాన్ని నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన పలువురు జె డీ రాజశేఖర్ అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ సత్య వేడు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన జె.డి రాజశేఖర్ సుమారు మూడున్నర సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని, కార్యకర్తలను కార్యకర్తలతో సన్నిహితంగా ఉంటూ, పార్టీని బలోపేతం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ సత్యవేడు నియోజకవర్గ ముందంజలో ఉంది. నిరంతరం గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండే వ్యక్తిగా రాజశేఖర్ పేరు తెచ్చుకున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జెడి రాజశేఖర్ అనుచర గణం బడుగు బలహీన వర్గాల, మద్దతు అధికంగా ఉంది. జె డీ రాజశేఖర్ ను జనసేన పార్టీలో చేర్చుకుంటే, జనసేన పార్టీబలోపేతం అవుతుందన్న ఉద్దేశంతో ఈ సమావేశం జరగడానికి కారణం అని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొదట మాజీ ఎమ్మెల్యే హేమలతను సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి గా నియమించారు. వారం రోజులకే ఆమె కుమార్తె డాక్టర్ హెలెన్ హేమలతను నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించారు. ఇందుకు సుమారు 2.5 కోట్ల రూపాయలు చేతులు మారాయని పార్టీ అధినేతకే ఫిర్యాదు అందింది. ఈ విషయం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా చర్చకు వచ్చింది. అయితే తాము డబ్బును అప్పుగా తీసుకున్నట్లు అధినేతకు సంజాయిషీలు ఇచ్చినట్లు సమాచారం.
సత్యవేడు నియోజకవర్గ లో మంచి పట్టు ఉన్న జె డి ఆర్ ఫౌండేషన్ అధినేత, ఈ ఫౌండేషన్ ద్వారా బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. జేడీ రాజశేఖర్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిన చీరాలకు చెందిన పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఆమంచి సోములు బుధవారం రాజశేఖర్ ను కలిశారు. జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తే ఆర్థికంగా తాము చూసుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది.
జెడి రాజశేఖర్ అనుచరులు తాము తుది వరకు తేదేపా పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తామని, సత్యవేడు నియోజకవర్గంలో ఓటమి చెందిన అభ్యర్థులు రెండవసారి గెలుపొందడం ఆనవాయితీగా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులకు తెలిపారు. పార్టీ నేతలు మళ్ళీ ఆలోచించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జెడి రాజశేఖర్ ను ప్రకటించవచ్చన్నారు. అలా జరగకుంటే తాము జనసేన పార్టీలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని ఆయన అనుచరులు అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సమావేశం అత్యంత గోప్యంగా జరిగింది.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, మంచి నాయకులుగా గుర్తింపు పొందిన జేడీ రాజశేఖర్ తెలుగుదేశం పార్టీనీ వీడితే, సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తప్పదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
NOTE
👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న Contact information for Chittoor News ద్వారా తెలియచేయగలరు.
👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.
👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.
👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.
👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.

