3, ఆగస్టు 2023, గురువారం

బాబు పర్యటన నేపథ్యంలో పుంగనూరులో ఉద్రిక్తత

చంద్రబాబు పుంగనూరు రోడ్డు షోకు అనుమతి నిరాకరణ

రోడ్డు షో నిర్వహిస్తామంటున్న టీడీపీ

అడ్డుకుంటామంటున్న వైసీపీ

భారీగా మోహరించిన ఇరు పార్టీలు

బాబు రాకుండా బ్యారికెట్ల ఏర్పాటు

తంబల్లపల్లిలో  బాబుకు నల్ల జెండాలతో నిరసన

అంగళ్లలో టీడీపీ బ్యానర్ల చించివేత

వైసీపీ నాయకులు రాళ్లతో  దాడి



        తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పుంగనూరును పోలీసులు దిగ్బంధం చేశారు. ఎవ్వరిని పట్టణంలోకి అనుమథించడం లేదు.
రోడ్డు షో అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు నల్ల జెండాలతో నిరసనకు దిగారు. బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు పుంగనూరులోకి రాకుండా పోలీసులు బైపాస్ రోడ్డు వద్ద మోహరించారు. అన్ని రకాల వాహనాలను దారి మల్లించారు. RTC బస్సులను కూడా పట్టణంలోకి అనుమథించడం లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను రానివ్వలేదు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అడుగడుగునా పోలీసులు మోహరించారు. చంద్రబాబు పుంగనూరుకు రాకుండా  బైపాస్ మీదుగా వెళ్లాలని పోలీసులు అంటున్నారు. అలాగే తంబల్లపల్లిలో కూడా వైసీపీ నేతలు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. కురబలకోట మండలం అంగళ్లలో కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ బ్యానర్ల చించివేసి, రాళ్లతో దాడి చేశారు.


          చంద్రబాబు రోడ్డు షో కు పుంగనూరులో పోలీసులు అనుమతి నిరాకరించడంతో   ఆరునూరు అయినా రోడ్డు షో   ఉంటుందని తెదేపా నాయకులు పట్టుదలతో ఉన్నారు. పుంగనూరులో రోడ్డు షో నిర్వహించి, తమ సత్తా చాటలన్న టీడీపీ నాయకుల ఆటలు సాగకూడదని వైసీపీ నాయకులు కూడా అంతే పట్టుదలతో ఉన్నారు. ఒక వైపు టీడీపీ శ్రేణులు, మరో వైపు వైసీపీ శ్రేణులు భారీగా మోహరించారు. ఇరు వర్గాలకు చంద్రబాబు పర్యటన ప్రతిష్టాత్మకంగా మారింది. రెండు రోజుల కిందట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు, జిల్లా పరిషత్తు మాజీ వైస్ చైర్మన్, ఇతర వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పుంగనూరు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో పుంగనూరు చంద్రబాబు పర్యటన ఉద్రిక్తంగా మారింది. 


              రోడ్డు షో కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రికి సొంత జిల్లాలో తిరిగే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఎలాగైనా రోడ్డు షో నిర్వహిస్తామని పట్టుదలతో ఉన్నారు. రోడ్డు షో, బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. అయితే పోలీసులు అడ్డు చెప్పడంతో బహిరంగ సభ కూడా ఉంటుందో లేదో తెలియడం లేదు. బాబు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు సమాయత్తం అవుతున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించారు. టీడీపీ వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. ఎం జరుగుతుందో అని పోలీసులు అప్రమత్తమయ్యారు. పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.


         పులివెందులలో పులిలా గర్జించిన చంద్రబాబు  పుంగనూరులో  అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. పుంగనూరులోకి బాబును అనుమతించకూడదని వైసీపీ నేతలు పోలీసులను కోరుతున్నారు. అనుమతిస్తే ఎం జరిగినా తమకు సంబంధం లేదంటున్నారు. బుధవారం పులివెందుల బహిరంగ సభలో మాట్లాడుతూ తాను ఎప్పుడూ కొదమ సింహాన్ని  అంటూ రెచ్చిపోయిన పలికిన చంద్రబాబు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద  తొడ కోడుతారని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం రోడ్డు షో లకు అనుమతి ఇవ్వలేదని ప్రాజెక్టుల సందర్శనకు పరిమితం అయ్యారు. ముందుగా అనుకున్న ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ప్రాజెక్టుల సందర్శన తరువాత రోడ్ షో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం చిత్తూరులో ముఖమైన నేతల సమావేశం, పూతలపట్టులో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. అయితే రోడ్ షోలకు అనుమతి లేనందున ప్రాజెక్టు సందర్శన, చిత్తూరు సమావేశం, పూతలపట్టు బహిరంగ సభలకు పరిమితం అయ్యారు.


         14 యేళ్ళు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు స్వంత జిల్లాలో రోడ్ షో కు అనుమతి ఇవ్వక పోవడం ఏమిటని సాధారణ ప్రజలు అడుగుతున్నారు. అనుమతి ఇవ్వక పోయినా రోడ్ షో నిర్వహిస్తామని బాబు ప్రకటించి ఉంటే అధికారులు దారికి వచ్చి ఉంటారని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు పెద్దిరెడ్డికి భయపడి ఆ సాహసం చేయలేదని అంటున్నారు.
పుంగనూరులో చంద్రబాబును అడ్డుకుంటామని వైసిపి నేతలు ప్రకటించారు. పుంగనూరు నియోజక వర్గం ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి తగిన జన సమీకరణ చేయలేరని బాబు భావించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో  వైసిపి కార్యకర్తలు వేల సంఖ్యలో వచ్చి అడ్డుకుంటే అభాసుపాలు కాక తప్పదని చంద్రబాబు అనుమానించి ఉంటారని అంటున్నారు. దీంతో వెనక్కుతగ్గారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రి పెద్దిరెడ్డికి  వ్యతిరేకంగా ఒక నాయకుడు కూడా మాట్లాడక పోవటం విమర్శలకు తావిస్తోంది. మొత్తం మీద చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి భయపడి తోక ముడిచారని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. 

       ఇదిలా ఉండగా ముందు అనుకున్న ప్రకారం రాత్రి బస పూతలపట్టులో చేయకుండా రేణిగుంటకు మార్చడం కూడా విమర్శలకు తావిస్తున్నది. ఇక్కడ భద్రత కరువన్న భయం వల్ల రేణిగుంటకు మార్చడం జరిగిందని భావిస్తున్నారు. పూతలపట్టులో బస చేసి, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గ ఇంఛార్జిల  పనితీరు సమీక్షించి, దశ దిశా నిర్ధేశం చేస్తారని భావించారు. అలాగే చిత్తూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విషయంలో కూడా ఒక నిర్ణయం ఉంటుందని అనుకున్నారు. పుంగనూరులో , పూతలపట్టులో  చంద్రబాబు రోడ్డు షో లు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో బాబు ఏలా వ్యవహరిస్తారో అని టీడీపీ నేతలు గుబులుగా ఉంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *