10, ఆగస్టు 2023, గురువారం

చంద్రబాబుకు అచ్చిరాని సొంత జిల్లా

 




సొంత జిల్లా చంద్రబాబుకు కలిసిరావడం లేదు. సొంత జిల్లాలోనే అయన ఎదురీదుతున్నారు. సొంత జిల్లాలో ఆయనకు దన్నుగా నిలచే నాయకులు తగ్గుతున్నారు. పార్టీ క్రమంగా బలహినపడుతోంది. తెదేపాలో రాజకీయ అరగ్రేటం చేసిన నాయకులు ఇతర పార్టీలల్లో చేరి చక్రం తిప్పుతున్నారు. జిల్లాలో క్రమంగా, తెదేపా బలహీన పడగా, YCP బలం పుంజుకుంటుంది. ఇందుకు గత ఎన్నికలే ఉదాహరణ. YCP 13 స్థానాలు గెలుచుకోగా, తెదేపాలో చంద్రబాబు ఒక్కరే గెలుపొందారు. మునిసిపల్ స్థానిక జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో కూడా తెదేపా డిలా పడింది. సొంత నియోజక వర్గంలో కూడా చతికిలబడటం గమనార్హం. గతంలో చంద్రబాబుమీద అలిపిరిలో బాంబు దాడి జరిగింది. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయడపడ్డారు. మల్లి ఇప్పుడు అంగళ్ళ రోడ్డు షో విషయంలో చంద్రబాబు మిద హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసులు నమోదు అయ్యారు. పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడానికి సిద్దం అవుతున్నారు.


  ఆయన పుట్టి పెరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయనకు రాజకీయాలు అచ్చి రావడం లేదు. 1995 లో చంద్రబాబు ముఖ్య మంత్రి అయిన తరువాత జిల్లాలో క్రమంగా పార్టీ క్షీణిస్తోంది 1983, 1994 ఎన్నికల్లో ఇక్కడ ఉన్న 15 అసెంబ్లీ స్థానాలలో 14 చోట్ల టిడిపి అభ్యర్ధులు గెలిచారు. చంద్రబాబు నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో టిడిపికి కేవలం ఆరు స్థానాలు వచ్చాయి. తరువాత జరిగిన ఎన్నికల్లోనూ ఆరుకు మించలేదు. 2009 లో నియోజక వర్గాల పునర్విభజన తరువాత జిల్లాలో 14 నియోజక వర్గాలు మిగిలాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అయితే జిల్లాలో మాత్రం ఆరు స్థానాలు దాటలేదు. 2019 ఎన్నికల్లో కేవలం చంద్రబాబు ఒక్కరి విజయంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. 2009 నుంచి టిడిపి  ఆరు నియోజక వర్గాలలో హ్యాట్రిక్ అపజయాలు నమోదు చేసుకున్నది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా ఓడిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సవాలు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా ఈ నెల నాలుగవ తేదీ ప్రాజెక్టుల పరిశీలన కోసం అంగల్లు, పుంగనూరులో పర్యటించిన చంద్రబాబు నేరపూరిత కుట్ర, హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నారు. ఆయనను అరెస్టు చేసి రిమాండుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. ఈ నేపాథ్యాన్ని పరిశీలిస్తే చంద్రబాబు ఇంట గెలవలేక పోతున్నారని స్పష్టం అవుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు స్వయంకృతాపరాదాలే అన్నింటికీ మూలం అంటున్నారు. ఆయన అవకాశవాద రాజకీయాలు శాపంగా మారాయని అంటున్నారు. ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్కరికి టిక్కెట్టు ఇవ్వడం, ఎప్పటికప్పుడు డబ్బున్న వారికి అవకాశం కల్పించడం వల్ల స్థానిక నాయకులకు నమ్మకం తగ్గిపోతున్నది. అలాగే ఆయన కులాల లెక్కలు కట్టి బలహీనులు టిక్కెట్లు ఇవ్వడం కూడా ఒక కారణమని చెపుతున్నారు. తన స్వంత సామాజిక వర్గంలో ఉన్న కోవర్టు నేతలను నమ్మి నిజాయితీ కలిగిన నాయకులను దూరంగా పెడుతున్నారన్నారని కొందరు చెపుతున్నారు. 


చంద్రబాబుపై ఇంత తీవ్రమైన కేసు పెట్టినా జిల్లాలో స్పందించే నేతలు కరువంటున్నారు. కేసులు లేని నియోజక వర్గాల ఇంచార్జిలు కూడా జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, నారాయణ స్వామి, రోజా లను విమర్శించడానికి భయపడుతున్నారు. ఇది వరకు తెదేపాలో ఉండిన జంగాలపల్లి శ్రీనివాసులు, చింతల రామచంద్రా రెడ్డి, GV శ్రీనాథ రెడ్డిలు YCPలో చేరి MLAలు అయ్యారు. రాజ్యసభ సభ్యుడు CM రమేష్ BJPలో చేరి చక్రం తిప్పుతున్నారు. గత ఎన్నికల్లో TDP తరపున పోటిచేసిన అభ్యర్థులు, పని చేసిన నాయకులు కొందరు ఎన్నికల తరువాత పార్టీకి దూరం అయ్యారు. చంద్రబాబు ఒక సామజిక వర్గం నేతల అభిప్రాయానికే ప్రాధాన్యత ఇస్తున్నారని TDPలో  పలువురు నాయకులు ఆవేదన చెందుతున్నారు. SC నియోజక వర్గాలలో ఇన్ ఛార్జ్ ల నియామకం అసమ్మతి కుంపటి  రాజేస్తోంది. మరి కొంత మంది SC నాయకులు పార్టీకి దూరం అవ్వడానికి సిద్దం అవుతున్నారు. అధికార ప్రతినిధులు కొందరు అస్త్ర సన్యాసం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును అరెస్టు చేసినా పెద్దగా స్పందన లేక పోవచ్చని అంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిస్తే మంచిదంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *