వేసవిలో తీవ్రం కానున్న పశుగ్రాసం కొరత
కరవు కారణంగా దెబ్బతిన్న ఖరిఫ్ పంటలు
ఫలితంగా జిల్లాలో భారీగా పశుగ్రాసం కొరత
జిల్లాలో పాల దిగుబడి తగ్గే ప్రమాదం
పశుసంవర్ధక శాఖ రూ.10 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళిక
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
కరవు జిల్లాలో రానున్న వేసవి కాలంలో పశుగ్రాసానికి గడ్డుకాలం ఏర్పడే అవకాశం ఉంది. గత సంవత్సరం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరిఫ్ సేజన్ లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో వర్షపాతం తగ్గడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు పడటం లేదు. ఎండలు క్రమంగా ప్రారంభం అవుతున్నాయి. దీంతో పచ్చి మేత కనిపించడం లేదు. జిల్లాలో చాలావరకు చెరువులు, కుంటలు కూడా ఎండిపోయాయి. ఫలితంగా జిల్లాలో ఇప్పటినుంచి పశుగ్రాసం కొరత ప్రారంభమైంది. దీని ప్రభావం జిల్లాలోని డైరీ పరిశ్రమ మీద పడే ప్రమాదం ఉంది. పాల దిగుబడి ఘనంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న వేసవిలో పశుగ్రాసం కొరతను నివారించడానికి, మూగజీవాలను ఆదుకోవడానికి పశుసంవర్ధక శాఖ అధికారులు 10 కోట్ల రూపాయలు ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించారు. ప్రణాళిక ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.
ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షలకు పైగా పశుసంపద ఉంది. గేదెలు, ఆవులతో పాటు ఎద్దులు, మేకలు, గొర్రెలు, తదితర జీవాలకు పశుగ్రాసం అవసరం. వేసవికాలంలో 16 మండలాల్లో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంటుందని, మరో 16 మండలాల్లో పశుగ్రాసం కొరత మద్యస్థంగా ఉంటుందని పశుసంవర్ధక శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో కొరతను భర్తీ చేయడానికి పది కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించారు. ఇందులో రైతుల వాటాగా 5.56 కోట్ల రూపాయలు, ప్రభుత్వం సబ్సిడీగా 4.36 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. రైతులకు 75 శాతం సబ్సిడీతో పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేయడానికి 33.75 లక్షల రూపాయలు, మొక్కజొన్నను 75 శాతంతో సబ్సిడీతో సరఫరా చేయడానికి 10.20 లక్షల రూపాయలు, సాంద్రీకృత పశువుల మేతను సబ్సిడీ మీద అందజేయడానికి 4.44 కోట్ల రూపాయలు, మిశ్రమ దానాలు 60 శాతం సబ్సిడీతో సరఫరా చేయడానికి 3.16 కోట్ల రూపాయలు, రైతులకు 40 శాతం సబ్సిడీతో చఫ్ఫ్ కట్టర్స్ సప్లై చేయడానికి 1 36 కోట్ల రూపాయలు, పశువులకు మందులను సరఫరా చేయడానికి 50 రెలక్షల రూపాయలను జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికలో ప్రతిపాదించారు. రైతులకు 50 టన్నుల పశుగ్రాసం విత్తనాలను, 2050 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న విత్తనాలను, 2000 మెట్రిక్ టన్నుల కాసాంద్రీకృత పశువుల మేతను, మరో 2వేల మెట్రిక్ టన్నుల ఫీడ్ మిశ్రమాన్ని, 400 చఫ్ఫ్ కట్టర్స్ అందజేయాలని ప్రణాళికలో పొందుపరిచారు. రైతులు పూర్తిగా ట్రాక్టర్లతో వ్యవసాయం చేస్తుండటంతో పశుగ్రాసంపై దృష్టి సారించడం లేదు. అవసరం అనుకుంటే కొంత గడ్డిని కొనుగోలు చేస్తే సరిపోతుందని, ప్రత్యేకంగా పశుగ్రాసం పెంపకానికి భూమి, నీరు కేటాయించాల్సి వస్తుందన్న భావంతో రైతులు పట్టించుకోకపోవడంతో గ్రాసం సమస్య తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో పాడి రైతులకు పశుగ్రాసం వి త్తనాలు సరఫరా చేసి ఆ తరువాత ఇతర పశువుల అవసరా లకోసం గడ్డినిసేకరించే ప్రయత్నాలు అధికారులు చేపట్టనున్నారు. జిల్లాలో పశుగ్రాసం కొరత కారణంగా మూగ జీవాలు అర్ధాకలితో అలమటించే ప్రమాదం ఉంది. రైతులు యాంత్రీకరణపై దృష్టి సారిం చి పశువులను కొనుగోలు చేయలేక గడ్డి తెచ్చి మేపలేక పాడిని దూరం పెడుతున్నారు. ఇక పాడి ఆవులు రైతులు పశుగ్రాసం కారణంగా ఇతర జిల్లాల నుంచి గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్ గడ్డికి రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ధర ఉంది. వరి పంట నూర్పిడి సమయంలో హార్వేస్టర్లతో కోతలు సాగిస్తుండటంతో ఆ గడ్డి పనికి రాకుండాపోతోంది. కొందరు రైతులు వరి కోతల సమయంలో గడ్డి కట్టలను యంత్రాల ద్వారా చుట్టి ఉంచి విక్రయిస్తున్నారు. పెరిగిన ధరల కారణంగా పాల ఉత్పత్తులపై ఆధారపడే రైతులకు గడ్డి కొనుగోలు భారంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో వాణిజ్య పంటలతో పాటు జొన్న, వేరుశనగ, అనప, పెసర, అలసంద పంటలు సాగు చేసేవారు. దీంతో వాటి సొప్ప పచ్చి మేతగా పాడి పశువులకు ఉపయోగపడేది. కానీ, కరవు కారణంగా ఈ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పశు పోషణ పాడి రైతులకు భారంగా మారింది. దీనితోనే రైతులు పశుసంపదను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున పాల ఉత్పత్తి మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఆరు లక్షల వరకు పాడి ఆవులు, 5,500 వరకు పాడి ఎనుములు ఉన్నట్లు అంచనా. ఇవి రోజుకు 20 లక్షల లీటర్ల కొరకు పాలను ఇస్తున్నాయి. ఇందులో ఇంటి అవసరాలు, పాల వ్యాపారస్తులు అమ్మడం మినహాయించి జిల్లాలోని డైయిరీలకు 11 లక్షల లీటర్ల పాలు రోజుకు చేరుతుంది. పాల సేకరణకు చిత్తూరు జిల్లాలో బిఎంసి లతో కలిపి 21 డైయిరీలు పనిచేస్తున్నాయి. వేసవిలో పాలదిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. పచ్చిమేత, దాణా ధరలు కూడా పెరిగుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే పశుగ్రాసం విత్తనాలకు సబ్సిడీ ఇచ్చి పశుసంపదను పెంచేలా ప్రణాళిక అమలుచేస్తోంది. వేసవిలో జిల్లాలో పశుగ్రాసం కొరత నివారించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించనుంది. పశుగ్రాసం విత్తనాలను పశుసంపద కలిగిన రైతులకు సబ్సిడీపై ఇవ్వనున్న విత్తనాలు ఒకసారి వేస్తే పలుమార్లు సార్లు కటింగ్ చేస్తూ గ్రాసాన్ని ఉపయోగించుకోవచ్చు. పచ్చిమేత ద్వారా పాలదిగుబడులు సైతం పెరుగే అవకాశాలు ఉన్నాయి.
పో రై గంగ 1 పశువులు
గంగ 2 పశుగ్రాసం కొరత