13, ఫిబ్రవరి 2025, గురువారం

రేపు అన్ని కార్యాలయాలలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

ఆంధ్రప్రభ బ్యూరోతో  జిల్లా పంచాయతీ అధికారి


స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం  అన్ని కార్యాలయాలలో మూలం - వనరు పేరుతో జరుపుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ తెలిపారు. అన్ని కార్యాలయాలలో లోపల, బయట చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకోవాలన్నారు.  బల్లలు, తలుపులు, కిటికీలు, పైకప్పు, రికార్డు గది, టాయిలెట్లు మొత్తం శుభ్ర పరచాలని,  ఆఫీస్  గోడల పైన, పైకప్పు మీద  పెరిగిన మొక్కలను తొలగించాలన్నారు.  టాయిలెట్లు ను శుభ్రం చేసుకోవడమే కాకుండా,  అవసరమైతే మరమత్తులు చేయించి, వినియోగించుటకు ఇబ్బంది లేకుండా చూడాలని వివరించారు. నీటి సౌకర్యం ఉండేలా చూడాలన్నారు.  ఆఫీసు లోపల ఇండోర్ మొక్కలు, ఆఫీసు బయట అవుట్‌డోర్ మొక్కలు ఏర్పాటు చేసి, సంరక్షించాలన్నారు.  ప్రత్యేక పారిశుద్ధ్య కార్యకలాపాలు  శ్రమదానం ద్వారా చెత్త దిబ్బలను శుభ్రపరచి, తిరిగి ఆ ప్రదేశంలో చెత్త వేయకుండా ఉండుటకు మొక్కలు నాటేటి కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.  గ్రీన్ అంబాసిడర్లకు అవసరమైన భద్రతా కిట్లు, ఉపకరణాలు అందజేయాలనీ, గ్రీన్ అంబాసిడర్లకు చెత్తను వేరు చేయడం, సేకరణ పై అవగాహన కల్పించాలని కోరారు. తడి చెత్తకు - పచ్చని డస్ట్‌బిన్, పొడి చెత్తకు - రెడ్ డస్ట్‌బిన్, హానికరమైన చెత్తకు బ్లూ డస్ట్‌బిన్ వినియోగించాలని వివరించారు.  ఇల్లు,షాప్స్,సంస్థలు, పాటశాలలు  మొదలైన ప్రదేశాలలో ఏర్పడే చెత్తను 3 రకాలుగా వేరు చేసేలా అవగాహన కల్పించి అలవాటు చేయాలని తెలిపారు.   ఈ విషయాలు అర్థమయ్యేలా ప్రదర్శన పద్ధతిలో బహిరంగ ప్రదేశాలలో చేసి చూపిస్తూ, అవగాహన కల్పించాలన్నారు.  ర్యాలీలు, మైక్ ద్వారా ప్రకటిస్తూ, దండోరాలు, ఆడియో, వీడియో ద్వారా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.  విద్యార్థులకు స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమము పై పోటీలు నిర్వహించాలనీ,  అన్ని స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమములో చురుకుగా పాల్గొని ప్రజలనుచైతన్యవంతులు  చెయ్యాలని చెప్పారు. చేసిన  అన్ని కార్యక్రమాలను ఫోటోలు వీడియోలు తీయించిస్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర గ్రూప్ లో పంచుకోవలన్నారు.  ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర  యాప్ లో ఏ ఏ కార్యకలాపాలు చేశారు, ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగానమోదు  చెయ్యాలనీ. అదే విధంగా  ఎక్సెల్ ఫార్మాట్ కూడా సమర్పించాలని వివరించారు.  ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, సంస్థలకు,  అధికారులకు,  మీడియా కు ముందుగానే సమాచారం అందించి,  ఈ పనులన్నీ వారి జీవన విధానంలో భాగం అయ్యేలా చైతన్యవంతులు  చేసి, ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంను నిర్వహించి,  విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ తెలిపారు. అన్ని గ్రామ పంచాయితీలు కూడా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *