12, ఫిబ్రవరి 2025, బుధవారం

గాలి జగదీష్ వైసిపిలో చేరికకు తాత్కాలికంగా బ్రేక్

అయన చేరికను అడ్డుకున్న మాజీ మంత్రి రోజా 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు, ప్రస్తుత నగిరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ వైసీపీలో చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టు సమాచారం. అన్ని సవ్యంగా జరిగి ఉంటే గాలి జగదీష్ బుధవారం వైసీపీలో చేరేవారని తెలుస్తోంది. అయితే ఆయన చేరికను మాజీ మంత్రి రోజా వ్యతిరేకించడంతో జగదీశ్ చేరిక వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. జగదీష్ వైసీపీలో చేరితే భవిష్యత్తులో రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందని రోజా జగదీష్ చేరికను అడ్డుకున్నట్లు సమాచారం. 


 నగరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా గత ఎన్నికలలో ఒక దశలో  గాలి జగదీష్ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. ఆయన, కుటుంబం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టచ్ లో ఉన్నట్లు సమాచారం. గాలి జగదీష్ అభ్యర్థిత్వం పట్ల పెద్దిరెడ్డి వర్గీయులు కూడా అప్పట్లో సానుకూలంగా స్పందించారని సమాచారం. అయితే ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా పట్టుబట్టి మళ్ళి నగిరి టిక్కెట్లన  దక్కించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీచిన టిడిపి గాలిలో మాజీ మంత్రి రోజా కూడా ఓడిపోయారు. దీంతో వైసీపీలో చేరికకు గాలి జగదీష్ తన ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్ హన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరే విషయం  చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం పార్టీలో చేరడానికి ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే గాలి జగదీష్ చేరికను మాజీ మంత్రి రోజా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గాలి జగదీష్ వైసీపీలో చేరిక తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు సమాచారం.  2018లో గాలి ముద్దుకృష్ణమనాయుడు అకాల మృత్యువు చెందిన తరువాత కుటుంబ సభ్యుల మధ్య వారసత్వ పోరు మొదలయ్యింది. ఆయన శ్రీమతి సరస్వతమ్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. 2019 ఎన్నికల్లో ఆమె తన చిన్న కుమారుడు జగదీష్ కు నగరి టిక్కెట్టు ఇవ్వాలని ఆమె పట్టుపట్టారు. అయినా చంద్రబాబు ఆమె పెద్దకుమారుడు గాలి భాను ప్రకాష్ కు అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో తల్లి, తమ్ముడు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. దీనితో ఆయన 2708 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్నారు. 2024 ఎన్నికలలో  జగదీశ్ కు టిక్కెట్టు ఇవ్వాలని ఆమె తల్లి, కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు పట్టు పట్టారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నయుడు మరో పర్యాయం కూడా భాను ప్రకాష్ పట్ల మొగ్గు చూపారు. దీంతో ఆయన గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో శాసన సభ్యుడగా ఎన్నికయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీలో తనకు భవిష్యత్తు లేదని భావించిన గాలి జగదీష్ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన ప్రయత్నాన్ని రోజా వమ్ము చేయడంతో తిరిగి ఆయన వైసీపీలో చేరుతారా లేదా అనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది.

గంగ 1 గాలి జగదీష్ 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *