జిల్లాలో భారీగా తగ్గిన చికెన్, గుడ్డు ధరలు
చిత్తూరులో మూతపడిన పలు చికెన్ షాపులు
రూ. 230 నుండి రూ. 160కి తగ్గిన చికెన్ ధర
రూ. 7.50 నుండి రూ. 5.23 కు పడిపోయిన గుడ్డు
ఇతర రాష్ట్రాలకు కోళ్ళు, గుడ్లు బంద్
ఆందోళనలో కోళ్ళ రైతులు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. చిత్తూరు పట్టణంలోని చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. చికెన్ కొనడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. దీంతో పట్టణంలో చాలా వరకు చికెన్ షాపులు మూతపడ్డాయి. అలాగే కోడిగుడ్లు తినాలన్నా కూడా వెనకడుగు వేస్తున్నారు. దీంతో జిల్లాలో చికెన్, కోడిగుడ్డు ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గతంలో 230 రూపాయలు పలిసిన చికెన్ నేడు 160 రూపాయలకు పడిపోయింది. అలాగే 7.50 పలికిన కోటి గుడ్డు నేడు 5.23 రూపాయలకు తగ్గిపోయింది. చిత్తూరు నుంచి ఇతర రాష్ట్రాలకు కోళ్లు, కోడిగుడ్ల ఎగుమతి చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కనిపించక పోయినా, ఉభయగోదావరి జిల్లాల ఎఫెక్ట్ చిత్తూరు జిల్లా మీద భారీగానే పడింది. వ్యాపారం పడిపోవడంతో కోళ్ల ఫారం యజమానులు ఆందోళనచెందుతున్నారు.
నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ తినడాన్ని ఇష్టపడుతారు. ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా. బందువులు, మిత్రులు వచ్చినా, సరదాగా ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకోవాలన్నా, ఆదివారం నాడు మాంసాహారం తినాలన్నా, ఇంట్లో కోడి కూర ఉడకాల్చిందే. బర్డ్ ఫ్లూ భయంతో సామాన్యులను చికెన్ దూరం అవుతోంది. చికెన్ తింటే, ఎం అవుతుందో అన్న భయం వ్యక్తం అవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రారంభమైన బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా పౌల్ట్రీ ఫారాల వద్ద చనిపోయిన కోళ్లు గుట్టలు గుట్టలుగా ఉంటున్నాయి. ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు క్షణాల్లో చనిపోతుంన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయంటే పరిస్థితి ఓ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. పౌల్ట్రీ ఫారాల్లో రోజుకు 0.05 శాతం కోళ్లు అనారోగ్య కారణాల వల్ల సాధారణంగా చనిపోతుంటాయి. కానీ ఇంత భారీ స్థాయిలో కోళ్లు చనిపోతుండడంతో రైతులను, ప్రజలను గందరగోళానికి గురవుతున్నారు. అత్యధిక సంఖ్యలో కోళ్లు చనిపోతుండడంతో కోడిగుడ్ల ఎగుమతులు భారీగా పడిపోతుండడంతో పౌల్ట్రీ రైతుల ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ఇతర రాష్ట్రాలకు 40కి పైగా లారీల్లో కోడిగుడ్లు ఎగుమతి అవుతుండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 25కే పడిపోయింది. దీంతో రానున్న రోజుల్లో ఆ సంఖ్య మరింత పడిపోతుందని భయాందోళనలు రైతులను వెంటాడుతున్నాయి. ఇదిలా ఉండగా.. అంతుచిక్కని వైరస్ సోకి కోళ్లు చనిపోతున్నాయనే వార్తలు జనానికి తెలియడంతో చాలా మంది చికెన్ తినడం మానేశారు. ఈ క్రమంలోనే చికెన్ ధరలు భారీగా తగ్గాయి. వైరస్ కారణంగా కోళ్ల మరణాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. వైరస్ ను గుర్తించి వెంటనే నిరోధక చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇదే తరహాలో వైరస్ వ్యాపించి 2012, 2020లో కూడా లక్షలాది కోళ్లు మరణించాయి. తూర్పు, పశ్చిమ, గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ సృష్టిస్తున్న విలయంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవ్వరు కూడా చికెన్ తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో కోళ్ల గిరాకీ భారీగా తగ్గింది. బర్డ్ ఫ్లూ భయంతోజిల్లాలో చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
*భారీగా తగ్గిన చికెన్, గుడ్లు ధరలు*
బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవ్వరు కూడా చికెన్ తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో కోళ్ల గిరాకీ భారీగా తగ్గింది. ఏపీలో ఇప్పటికే వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ భయంతోజిల్లాలో చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇది వరకు కిలో చికెన్ ధర రూ.230 వరకు ఉండగా, ప్రస్తుతం భారీగా తగ్గింది. ప్రస్తుతం రూ.160 వరకు విక్రయిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ భయంతో ప్రజలు కోడి గుడ్డు తునడానికి కూడా వెనుకడుగు వేస్తున్నారు. గతంలో కోడిగుడ్డు ధర 7 రూపాయల నుండి 7.50 రూపాయలు పలికిన కోడి గుడ్డు నేడు 5.23 రూపాయలకు పడిపోయింది.
*జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదు: డా.ఎం. ప్రభాకర్*
బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాదిని కోళ్ళలో గోదావరి జిల్లాలలో మాత్రమే ఉంది. చిత్తూరు జిల్లాలో పశువుల వైద్యాధికారులచే తనిఖీ చేయగా, ప్రస్తుతం జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని, జిల్లాలో కోళ్ళలో ఎటువంటి అసాధారణ మరణాలు నమోదు కాలేదని నిర్ధారణ అయ్యింది. వ్యాధి నిరోధక చర్యలలో భాగంగా జిల్లాలోని కోళ్ళ రైతులను తగు నివారణ చర్యలను చేపట్టి వ్యాదిని వ్యాపించకుండా జాగ్రత్తలు తిసుకొంటున్నాం. ఇందులో భాగంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి కోళ్ళ రవాణా విషయంగా స్థానిక చెక్ పోస్టు సిబ్బందిని అప్రమత్తం చేశాం. అపోహలకు పోకుండా కోడి మాంసం, గుడ్లు వినియోగించేవారు ఎప్పటిలాగే వినియోగించుకోవచ్చు. కోడి గుడ్లు, మాంసంను బాగా ఉడికించి తినడం వల్లా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. బర్డ్ ప్లూ వ్యాధి గురించి ఎటువంటి అపోహలు, ఆందోళనలను నివృత్తి చేయడానికి పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.
డాక్టర్ ఎం ప్రభాకర్, జాయింట్ డైరెక్టర్, జిల్లా పశుసంవర్థక శాఖ.

