27, ఫిబ్రవరి 2025, గురువారం

నేటి ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్భందీగా ఏర్పాట్లు

హై సెన్సిటివ్ పరీక్షా కేంద్రాల వద్ద  సీసీ కెమెరాలు ఏర్పాటు
అన్ని పరీక్షా కేంద్రలవడ్డ 144 సెక్షన్ అమలు
పరీక్షా కేంద్రాలలో ఫస్ట్ ఏయిడ్ కిట్లు, ఒ ఆర్ ఎస్ ఎస్ ప్యాకెట్లు 
ఆంధ్రప్రభ బ్యురోతో  జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి సయ్యద్ మౌలా

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

శనివారం  నుండి 20 వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ థీయరీ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు  జిల్లా యంత్రాంగం అవసరమైన అన్నీ చర్యలు తీసుకున్నామని జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి సయ్యద్ మౌలా వెల్లడించారు. శుక్రవారం అయన 'ఆంధ్రప్రభ చిత్తూరు బ్యూరో' తో మాట్లతుతూ  జిల్లా లో 50 సెంటర్లలో ఇంటర్మీడియట్ పబ్లిక్ మొదటి రెండవ సంవత్సర పరీక్షలు జరుగుతున్నారు. ఈ సెంటర్లకు చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ లను నియమించడం జరిగిందని చెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డ్ ఇచ్చిన సూచనల ప్రకారం పరీక్షా కేంద్ర చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఇంటర్మీడియట్ పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీచేశానని పేర్కొన్నారు. విద్యార్థులకు వారి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు  ఎనిమిదిన్నర గంటలకు  చేరుకునే విధంగా సూచనలు ఇచ్చామన్నారు. పరీక్షలను 9 నుండి 12 గంటల మధ్య ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాటు చేసుశామన్నారు.  పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన బల్లలు, తాగునీటి వసతి, మెడికల్ స్టాఫ్, మందులు  సీసీ కెమెరాలు మొదలైన వాటిని ముందుగానే ఏర్పాటుచేశామని వివరించారు.  విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
 పరీక్షలకు ముందు పరీక్షలు తర్వాత కూడా పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలను తగు భద్రత నడుమ తీసుకురావడం జరుగుతుందన్నారు.  పరీక్ష తరువాత జవాబు పత్రాలను తగు భద్రతతో పోస్ట్ ఆఫీస్ లకు చేరవేయడం లోనూ తగు జాగ్రత్తలు తీసుకొని, పరీక్షల బోర్డు ఇచ్చిన సూచనల మేరకు నిర్వహింహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ పరిక్షలకు మొత్తం 30,652 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతరన్నారు.  ఇందులో మొదటి సంవత్సరానికి సంబందించి 15,482 మంది (జనరల్ 13574, ఒకేషనల్ 01908),  ద్వితీయ సంవత్సరానికి సంబందించి 15,170 మంది (జనరల్13136, ఒకేషనల్ 02034) విద్యార్థులు ఉన్నారని వివరించారు. పరీక్ష ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.  హై సెన్సిటివ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ నందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబందించి జిల్లాలో స్ట్రాంగ్ రూముల వద్ద, పరీక్షల కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రలవడ్డ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాలలో ఫస్ట్ ఏయిడ్ కిట్లు, ఒ ఆర్ ఎస్ ఎస్ ప్యాకెట్లు ఉన్నాయని, వైద్య సిబ్బంది కూడా  అందుబాటులో ఉంటారన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల్లో భాగంగా తగినంత లైటింగ్, మంచినీరు సౌకర్యం, నీటి వసతితో కూడిన మరుగుదొడ్ల సౌకర్యం ఉందన్నారు. దూర ప్రాంత విద్యార్థులు పరీక్షలకు సకాలంలో చేరుకొనేలా బస్సులు నడిపేలా ఆర్ టి సి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా ఉంటే విధంగా చర్యలు తీసుకున్నామని, పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని కోరామన్నారు. ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాల తరలింపుకు సంబందించి పతిష్ట బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు జరిగిందన్నారు. విద్యార్థులు భయాందోళనలు లేకుండా పరీక్షలు రాసి, ఉత్తీర్ణులు కావాలని  సయ్యద్ మౌలా ఆకాంక్షించారు.  పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందినీ, ప్రశాంత వాతావరణంలో జిల్లాలో పరీక్షల నిర్వహణకు అని ఏర్పాట్లు చేశామన్నారు.  

పో రై గంగ 4 జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి సయ్యద్ మౌలా

 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *