7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

జిల్లాలో బిందు, తుంపర్ల సేద్యానికి అధిక ప్రాధాన్యత

ఈ ఆర్థిక సంవత్సరంలో 21,500 హెక్టర్ల లక్ష్యం 

 ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తిగా ఉచితం

చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ

'ఆంధ్రప్రభ బ్యురో'తో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ 

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు జిల్లాలో బిందు, తుంపర్ల చేద్దానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ ఏ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం చిత్తూరులో "ఆంధ్రప్రభ బ్యూరో"తో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 21,500 హెక్టార్లలో బిందు తుంపర్ల సేధ్యం అమలులోకి  తేవాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. బిందు సేద్యంపై ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తిగా ఉచితంగా అంటే 100 శాతం రాయితీపై డ్రిప్‌ పరికరాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఐదు ఎకరముల లోపల ఉన్న సన్న, చిన్న కారు రైతులకు 90 శాతంతో ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.2.18 లక్షల రాయితీ ఇస్తుందని తెలిపారు. 5 ఎకరముల నుండి 10 ఎకరములు కలిగిన రైతులకు 70 శాతంతో ఒక్కో రైతుకు గరిష్ఠంగా రూ.3.46 లక్షల రాయితీ లభిస్తుందని వివరించారు. స్ప్రింక్లర్లు (తుంపర్లు) సేధ్యంపై సన్న , చిన్నకారు రైతులకు స్ప్రింక్లర్ పరికరములపై 55 శాతం, 5 ఎకరముల నుండి 10 వికరములు కలగిన రైతులకు 45 శాతం సబ్సిడి వస్తుందన్నారు.

జిల్లాలో ప్రధాన పంటలైన  మామిడిలతో పాటు టమోటో, జామ, బత్తాయి, మిరప, దానిమ్మ, ఆయిల్‌పామ్‌, కూరగాయల పంటలు, పూలసాగుకు డ్రిప్‌ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 21,500 హెక్టర్లలో బిందుసేద్యాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం  లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 29,299 మధ్య రైతులు 28,821 హెక్టర్లలోభూమికి  బిందు తుంపర్ల సేధ్యం నిమిత్తం రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఇందులో 7,765 మంది రైతులకు 6,786 యాక్టర్లకు విందు తుంపర్ల సేద్యం అనుమతుల మంజూరు చేసామన్నారు ఇప్పటివరకు 30200 హెక్టర్లలో బిందు తుంపర్ల సేద్యానికి సంబంధించిన అనుమతి మంజూరు చేశామన్నారు. 58 51 మంది రైతులకు పరికరాలను సరఫరా చేసామని తెలిపారు.ఇప్పటి వరకు 2,411 మంది రైతులు గాడి తవ్వి 1,993 హెక్టర్లలో బిందు సేద్యం పరికరాలు  అమర్చడం జరిగిందన్నారు. మరో 1,230 హెక్టర్లలో పరిశీలన జరుగుతోందని తెలిపారు. ఈ రెండు నెలల కాలంలో మరో 6000 హెక్టార్లలో అదనంగా బిందు సేద్యం కి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని పేర్కొన్నారు. జిల్లాలో 18 ఏజెన్సీలు బిందు సేధ్యానికి అవసరమైన పరికరాలను రైతులకు అందజేస్తున్నాయని తెలిపారు. కరవు జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో బిందు సేధ్యం ద్వారా వ్యవసాయం చేస్తే నీటిని ఆధా చేయవచ్చని, తద్వారా పంట దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని రైతులు ముందుకు వస్తే పరిమితి లేకుండా బిందు సేద్యానికి  సంబంధించిన పరికరాలను అమర్చడానికి సిద్ధంగా ఉన్నావని వివరించారు. బిందు తుంపర్ల సేద్యం అవసరమైన రైతులు మండల స్థాయిలోని డ్రిప్ ఇరిగేషన్ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి చిత్తూరు జిల్లాలో ఏడు మంది మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్లు, మరో ముగ్గురు మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్లు పనిచేస్తున్నారని తెలిపారు. వీరు దరఖాస్తు చేసుకున్న రైతు పొలం వద్దకు వెళ్లి అంచనాలను తయారుచేసి, రైతు చెల్లించిన 10 శాతం వాటాను తెలియజేస్తారన్నారు. రైతులు లబ్ధిదారుల వాటా చెల్లించగానే ఆయా కంపెనీలు రైతులకు బిందు, తుంపర్ల చేద్దానికి సంబంధించిన పరికరాలు సరఫరా చేస్తాయన్నారు. రైతులు కూలీలు లేక జెసిబిల ద్వారా గాడులను తీసి  పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు 90 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్న కారణంగా దీనిని వినియోగించుకోని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *