చిత్తూరు జిల్లా రైల్వే ప్రయాణికులకు శుభవార్త
అమృత్ పధకం కింద చిత్తూరు జిల్లాలో మూడు రైల్వే స్టేషన్ ల ఎంపిక
ఒక్కక్క స్టేషన్ లో రూ. కోటితో అభివృద్ధి పనులు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
కేంద్ర బడ్జెట్ లో చిత్తూరు జిల్లా రైల్వే శాఖకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీపి కబురు అందించారు. చిత్తూరు జిల్లాలోని మూడు రైల్వేస్టేషన్లో అమృత్ పథకంలో చేర్చారు. చిత్తూరు, కుప్పం, పీలేరు రైల్వే స్టేషన్లను అమృత పథకం కింద అభివృద్ధి చేస్తారు. ఒక్కొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధికి కోటి రూపాయలకు పైగా విధులను హెచ్చిస్తారు. ఇప్పటికే చిత్తూరులో అమృత పథకం కింద అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం లిప్టు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. చిత్తూరు తరహాలో కుప్పం, పీలేరు రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి చెందనున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే 8 స్టేషనులను అమృత్ పధకం కింద అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు.
భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోని స్టేషన్‌ల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రైల్వే మంత్రిత్వ శాఖ 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్'ని ప్రవేశపెట్టింది. స్టేషన్ సౌకర్యాల నిరంతర మెరుగుదలపై దృష్టి సారించి, ఈ చొరవ దీర్ఘకాలిక దృక్పథాన్ని అవలంబిస్తుంది. స్టేషన్‌లలో యాక్సెస్‌ను మెరుగుపరచడం, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్‌లు, అవసరమైన విధంగా లిఫ్ట్‌లు/ఎస్కలేటర్‌లను ఏర్పాటు చేయడం వంటి వివిధ సౌకర్యాలను మెరుగుపరచడానికి దశలవారీగా మాస్టర్ ప్లాన్‌లను రూపొందించడం మరియు అమలు చేయడం ఈ పథకంలో భాగంగా ఉంటుంది. ఇది పరిశుభ్రత, ఉచిత వై ఫైవ్ సదుపాయం, 'ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి' వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ఉత్పత్తులను ప్రమోట్ చేయడం, ప్రయాణీకుల సమాచార వ్యవస్థలను మెరుగుపరచడం, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లను ఏర్పాటు చేయడం, వ్యాపార సమావేశాల కోసం నియమించబడిన స్థలాలు, ప్రతి స్టేషన్ అవసరాలకు అనుగుణంగా ల్యాండ్‌స్కేపింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. అదనంగా, ఈ పథకం స్టేషన్ భవనాల పెంపుదల, చుట్టుపక్కల పట్టణ ప్రాంతాలతో స్టేషన్‌లను సమగ్రపరచడం, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్‌ను ప్రోత్సహించడం, 'దివ్యాంగుల' కోసం సౌకర్యాలను అందించడం, స్థిరమైన, పర్యావరణ అనుకూల పరిష్కారాలను అమలు చేయడం, బ్యాలస్ట్‌లెస్ ట్రాక్‌లను పరిచయం చేయడం, రూఫ్ ప్లాజాలను రూపొందించడం వంటి వాటిని నొక్కి చెబుతుంది. 'అవసరమైన చోట. ఈ పథకం దశలవారీగా, సాధ్యాసాధ్యాలను మరియు స్టేషన్‌లలో నగర కేంద్రాల దీర్ఘకాల స్థాపనను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ స్టేషన్లలో చాలా వరకు, ప్రయాణీకుల సౌకర్యార్థం స్టేషన్ లోకి రావడానికి ఒక దారి, వెళ్ళడానికి మరో దారిని ఏర్పాటు చేస్తారు. కొన్ని మౌలిక సదుపాయాలను చూసినట్లయితే ప్రతి స్టేషన్లలో అవసరమైన భవనాల నిర్మాణం, అధునాతన శైలిలో ఫ్లోరింగ్ చేయనున్నారు. ప్రస్తుతం 600 మీటర్ల పొడుగుతున్న ప్లాట్ ఫామ్ లను 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు అవసరం మేరకు పెంచనున్నారు. ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉండే స్టేషన్లలో ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. రైల్వే స్టేషన్లలో ట్రాకులు, వాటి శుభ్రత కోసం సులభమైన నిర్వహణ కోసం అధునాతన ఏర్పాట్లను చేయనున్నారు. వెయిటింగ్ హాల్స్ నిర్మాణం వాటికి అనుబంధంగా కెఫెటేరియాల నిర్మాణం చేపట్టనున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు, వారికి ప్రత్యేకమైన ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్ కు రెండు వైపులా అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ ఏరియా, పాదచారులకు ప్రత్యేక దారి వసతులను కల్పించనున్నారు. స్థానిక ఉత్పత్తుల విక్రయాలకు కనీసం రెండు స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని, ప్రతి స్టేషన్ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్ ప్లాజా ను ఏర్పాటు చేయాలని, సమావేశ మందిరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక ల్యాండ్ స్కేపింగ్ తో పాటుగా ఆధునిక లైటింగ్ వసతులను, స్టేషన్లో ప్రయాణికులకు వేగవంతమైన వైఫై సేవలు అందించటానికి 5 జీ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని అధునాతన హంగులతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే క్రమంలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు, కుప్పం, పీలేరు రైల్వే స్టేషన్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాకాల, మదనపల్లి రోడ్డు, రేణిగుంట, తిరుపతి, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లు ఎని కొత్తదనాన్ని సంతరించుకోనున్నాయి.
పో రై గంగ 2 చిత్తూరు రైల్వే స్టేషన్