9, ఫిబ్రవరి 2025, ఆదివారం

మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం




మండల స్థాయిలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కారాలను పర్యవేక్షించడానికి మండలానికి  ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారి గానేమిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వీరు ప్రతి 15 రోజులలో రెండు రోజులపాటు ఆయా మండలాల్లో పర్యటించాలని నిర్దేశించారు. మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలు. హాస్టళ్ళు, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి నివేదికలను ఉన్నతాధికారులకు  సమర్పించాలని కోరారు. గంగాధర నెల్లూరు మండలానికి డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ను, రామకుప్పం మండలానికి ద్వామ ప్రాజెక్టు డైరెక్టర్ ను, పూతలపట్టు మండలానికి సాంఘిక సంక్షేమ శాఖ జెడిని, ఎస్ఆర్ పురం మండలానికి పంచాయతీరాజ్ సుపరిండెంట్ ఇంజనీర్ ను, వి.కోటకు హౌసింగ్ డిప్యూటీ డైరెక్టర్ ను, పెనుమూరుకు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిని, యాదమరికి ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను, వెదురుకుప్పంకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ను, ఐరాలకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. గంగవరం మండలానికి చిత్తూరు డిఎల్డిఓ ను, నిండ్ర మండలానికి నగిరి డిఎల్డిఓ ను, పెద్దపంజానికి పలమనేరు డి ఎల్ డి వో ను, చిత్తూరు అర్బన్ కు జిల్లా విద్యాశాఖ అధికారిని, కార్వేటి నగరానికి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని, పాలసముద్రం మండలానికి ఎస్ఎఎస్ ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ను, విజయపురం మండలానికి నగిరి ఆర్డీవోను, గుడిపల్లి మండలానికి కుప్పం ఆర్డీవోను, పుంగనూరు మండలానికి పలమనేరు ఆర్డీవోను, సదుం మండలానికి చిత్తూరు ఆర్డీవోను, బంగారుపాళ్యం మండలానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని నియమించారు. చౌడేపల్లికి గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను, సోమల మండలానికి టూరిజం ఆఫీసర్ ను, బైరెడ్డిపల్లికి జిల్లా పరిషత్ సిఇఓను, గుడిపాల మండలానికి ఆర్ అండ్ బి సూపర్డెంట్ ఇంజనీర్ను, పులిచెర్ల మండలానికి ఎండోమెంట్ అసిస్టెంట్  కమిషనర్ ను, రొంపిచర్ల మండలానికి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను, తవణంపల్లి మండలానికి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని, నగిరి మండలానికి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిని, పలమనేరు మండలానికి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ను, కుప్పం మండలానికి కడ ప్రాజెక్టు డైరెక్టర్ ను, శాంతిపురం మండలానికి పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ ను, చిత్తూరు రూరల్ మండలానికి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో పర్యటించినప్పుడు మండల స్థాయి అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని, వారి సలహాలు సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ తమ ఆదేశాలలో పేర్కొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *