21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

చిత్తూరు జిల్లాను వణికిస్తున్న దగ్గు, జలుబు, జ్వరం

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు బాధితుల క్యూ

ఓపీలో 60శాతం మంది జ్వర పీడితులే

చిన్నారుల్లో నిమోనియా లక్షణాలు

కొత్తవైరస్‌ నేపథ్యంలో జనంలో కంగారు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరు జిల్లాను దగ్గు, జలుబు, జ్వరం బాధిస్తున్నాయి. మూడు, నాలుగు రోజులకు తగ్గాల్సిన జలుబు, దగ్గు పది రోజులు గడిచినా తగ్గక పోవడంతో పిల్లలు, పెద్దలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పిల్లల్లో నిమోనియా లక్షణాలు బయటపడుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి చోటా ఓపీ పెరిగింది. వాతావరణంలో చోటు చేసుకుంటు న్న మార్పుల(పగలు ఎండ, రాత్రి చలి) వల్లే విషజ్వరాలు ప్రబలుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరాలు ఎంతకూ తగ్గకపోవడంతో కొత్తగా ఏదైనా వైరస్‌ ఏమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ, మాస్కు ధరించడం వల్ల ఇలాంటి కొత్త రకం ఫ్లూలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 


జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం అంటూ అవస్థలు పడుతున్నారు. దాదాపు నెలరోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి రోజూ వందల మంది చికిత్స కోసం వస్తున్నారు. అధికారిక లెక్కల మేరకు సరాసరిగా రోజు 1500 మంది అన్ని విభాగాల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 60శాతం జ్వర బాధితులే ఉంటున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రి జ్వర బాధితులతో కిటకిటలాడు తోంది. ఉదయం ఓపీ ప్రారంభం నుంచి మధ్యాహ్నం ముగిసే వరకు జ్వర బాధితులు క్యూకడుతున్నారు. జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న పలువురు బాధితులను డాక్టర్లు అడ్మిషన చేసుకుంటున్నారు. చిన్నపిల్లల విభాగంలో ప్రతి రోజు 30 నుంచి 40 మంది అడ్మిషన అవుతున్నారని ఇందులో 8 నుంచి 10 మంది వరకు జలుబు, దగ్గు, ఆయాసంతో బాధప డుతున్న వారిలో నిమోనియా లక్షణాలు ఉంటున్నాయని చిన్నపిల్లల వైద్యు లు చెబుతున్నారు. పెద్దల ఓపీ విభాగంలోనూ పురుష, మహిళ విభాగా లకు 300 నుంచి 400 మంది వరకు జ్వరం, దగ్గు, జలుబు బాధితులే వస్తున్నారని ఆ విభాగాల వైద్యులు అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఈ పరిస్థితి ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలను వైరల్‌ జ్వరాలు దగ్గు, జలుబుతో బాధితుల గొంతు కూడా మారుతోంది. ఎన్నడూ లేనివిధంగా కీళ్ల నొప్పులు విపరీతంగా వేధిస్తున్నాయి.  ఏడాది తరచూ వర్షాలు కురవడం వల్ల దోమల వృద్ధి విపరీతంగా పెరుగుతోంది. వాటి వల్ల బాధితులు పెరుగుతున్నారే తప్ప, తగ్గడం లేదని వైద్యులు అంటున్నారు. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కొంతమందికి రెండు, మూడు రోజులకు జ్వరం తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. రెండు, మూడు వారాలకు పైగా కీళ్ల నొప్పులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు నెల రోజులకు మించి బాధపడుతున్నారు. ఈ లక్షణాలు గన్యా తరహా కేసులను గుర్తు చేస్తున్నాయి. నొప్పుల వల్ల మహిళలు, వయసు పైబడిన వాళ్లు నిటారుగా నిల్చోలేక అవస్థలు పడుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారైతే అడుగు తీసి అడుగు వేయాలంటే నొప్పులతో సతమతమవుతున్నారు. ఒకరికి ఫీవర్‌ వస్తే ఇంట్లో ఉన్న అందరికీ అంటుకుంటోంది. ఈ సమస్యను భరించలేక కరోనా సమయంలో ధరించినట్లు ఇంట్లోనూ మాస్కులు పెట్టుకుంటున్నారు. విడివిడిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వైద్యుల్లోనూ బాధితులు కనిపిస్తున్నారు. జిల్లాలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ల్లునొప్పులు వంటి లక్షణాలతో అధిక శాతం మంది బాధపడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్లు నొప్పులతో బాధపడేవారూ ఎక్కువగా ఉంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం డెంగీ, మలేరియా కంటే విష జ్వరాలు వేధిస్తున్నాయి. ఇంట్లో ఒకరు తర్వాత మరొకరు విషజ్వరాలతో అల్లాడుతున్నారు. ప్లేట్‌ లెట్స్‌ తగ్గిపోవడంతో నీరసించి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ల్లునొప్పులు వంటి లక్షణాలతో అధిక శాతం మంది బాధపడుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులు మాత్రం త్వరగా తగ్గట్లేదు. జ్వరం వచ్చిన రెండు రోజుల్లోనే బాధితులు నీరసిస్తున్నారు. డెంగీ, మలేరియా లక్షణాలతో మరికొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం డెంగీ, మలేరియా కంటే విష జ్వరాలు వేధిస్తున్నాయి. జిల్లాలో వివిధ ఆసుపత్రులను పరిశీలించగా జ్వరం పీడితులే ఎక్కువ కనిపిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా జలుబు, దగ్గు, జ్వరంతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి రక్త పరీక్షలు చేస్తున్నారు. రోజుకు 250 మంది రోగులు వస్తున్నారు. ఈ సంవత్సరం జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. సీహెచ్‌సీలకు వస్తున్న రోగుల్లో అత్యధిక మంది తీవ్ర ఒళ్లు నొప్పులతో వస్తున్నారు. వీరికి మలేరియా, టైఫాయిడ్, డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ఒకరికి రూ.15 వేలు నంచి 20 వేలు అవుతోందని బాధితులు వాపోతున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *