మామిడి రైతులను నిరాశ పరచిన కేంద్ర బడ్జెట్
ఉసేలేని మామిడి బోర్డు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పసుపు బోర్డును ప్రకటించిన విధంగా చిత్తూరుకు మామిడి పకటిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు మామిడి రైతులకు ఎన్నో వాగ్దానాలు చేశారు. అందులో మామిడి బోర్డు కూడా ఉంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రభుత్వం ఈ విషయమై ప్రస్తావించలేదు. అయితే మామిడి రైతులకు కొత్తగా బీమా సౌకర్యాన్ని తీసుకుని వచ్చింది. ఈ బీమా పథకం రైతులకు నచ్చకపోవడంతో 99 శాతం మంది రైతులు మామిడి బీమాకు దూరంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మామిడి బోర్డ్ ను ప్రకటిస్తే తమ కష్టాలు తీరుతాయని చిత్తూరు జిల్లా రైతులు భావించారు.
మామిడి తోటల విస్తీర్ణంలో, మామిడి దిగుబడిలో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉంది. చిత్తూరు జిల్లాలో 1.5 లక్షల ఎకరాలలో మామిడి తోటలో ఉన్నాయి ఈ తోటల విస్తీర్ణం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పండిన పంటంతా పుత్తూరు, దామలచెరువు, బంగారుపాళ్యం, పుత్తూరు, తిరుపతి కేంద్రంగా కలకత్తా, ఢిల్లీ వంటి కేంద్రాలకు ఎగుమతి అవుతోంది. మామిడి పంట ఆధారంగా చిత్తూరు జిల్లాలో 30 వరకు మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు స్థాపితమయ్యాయి. ఇవి ప్రతి సంవత్సరం రైతుల నుంచి మామిడికాయలను కొని పల్ప్ చేసి, ఇతర ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. ఈ పరిశ్రమ మీద 90 వేల మంది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అలాగే మామిడి పంట ఆధారంగా వర్తకులు, చిల్లర వర్తకులు, ఫాక్టరీ కూలీలు సుమారు పదివేల మందికి పైగా ఆధారపడి జిల్లాలో జీవనం కొనసాగిస్తున్నారు. మామిడి రైతుల సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. జిల్లాస్థాయిలో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీల యజమానుల అసోసియేషన్ కూడా సొంత భవనం నిర్మించుకుని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సగటున జిల్లాలో సంవత్సరానికి 5 లక్షల టన్నుల మామిడి దిగిబడి రావల్చి ఉండగా, అయితే వ్యతిరేక వాతావరణం కారణంగా గత సంవత్సరం 10 శాతం పంట వచ్చింది. అకాల వర్షం, ఎదురు గాలుల కారణంగా, పంట చాలా వరకు వేలరాలింది. 20 శాతం కూడా దిగిబడి లేదు. దీంతో మామిడికి మంచి గిట్టుబాటు ధర వస్తుందని రైతులు భావించారు. రైతుల ఆశించిన విధంగానే మామిడి టన్ను 30 రూపాయలతో ప్రారంభమైంది. జిల్లాలోని మామిడి ఫ్యాక్టరీలు కూడా 28 రూపాయలతో కొనుగోలు చేయడం ప్రారంభించారు. మామిడి ఫ్యాక్టరీ యజమానులు క్రమంగా మామిడి ధరలను తగ్గిస్తూ వచ్చారు. చివరకు టన్ను ధర 23 వేల రూపాయలు చేరుకుంది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదివారం ఉద్యానవన శాఖ అధికారులతో, మార్కెట్ కమిటీ అధికారులతో మాట్లాడి మామిడి ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తోతాపురి మామిడికి టన్నుకు ముప్పై వేల రూపాయలు తగ్గకూడదని పేర్కొన్నారు. ఎవరైనా 30 వేల రూపాయలు కంటే తక్కువ కొనుగోలు చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా, ఫాక్టరీలు ఖాతరు చేయలేదు. చివరకు 18 రూపాయలతో మామిడి సేజన్ ముగిసింది. కొన్ని ఫ్యాక్టరీలు ఇంకా రైతులకు మామిడి డబ్బులు ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగా చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మామిడి బీమా పథకం పూర్తిగా విఫలమయ్యింది. మామిడి పంటకు బీమా చేయడానికి రైతులు ముందుకు రాలేదు. రైతులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను రూపొందించడంలో విఫలమయ్యింది. ప్రభుత్వం రూపొందించిన మామిడి బీమా పథకంలో మామిడి దిగుబడి తగ్గినా, మామిడి ధర తగ్గిన ఏటువంటి నష్టపరిహారం లేదు. మామిడి పంటను ఆశించే చీడపీడలు, ఇతర రోగాలకు సంబంధించి ఎలాంటి బీమా సౌకర్యం లేదు. వాతావరణంలో ఏదైనా పెను మార్పులు జరిగితే మాత్రమే బీమా సౌకర్యం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇతర పంటలతో పోల్చుకుంటే మామిడి పంటకు బీమా ప్రీమియం కూడా చాలా ఎక్కువ. దీంతో మామిడి బీమాలో భాగస్వామ్యం కావడానికి జిల్లాలోని రైతాంగం ముందుకు రాలేదు. ఏదో ముక్కుబడిగా కొంతమంది రైతులు మాత్రమే మామిడి పంటల బీమా ప్రీమియం చెల్లించారు. గత సంవత్సరం జిల్లాలో మామిడి పూత చాలా తగ్గువ వచ్చింది. వచ్చిన పూత కూడా నిలువలేదు. వచ్చిన పూత కూడా మూడు, నాలుగు దఫాలుగా వచ్చింది. వాతావరణం అనుకూలించక మామిడి పూతంతా మాడిపోయింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వాతావరణ పరిస్థితుల ప్రతికూలంగా ఉన్న కారణంగా జిల్లాలో మామిడి చెట్లకు పూత కనిపించడం లేదు. మామిడి పూత డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. జనవరికి పూర్తిస్థాయిలో పూత వచ్చి మామిడి చెట్లు కళకళలాడుతూ ఉంటాయి. జనవరి నెల పూర్తి అవుతున్న ఇప్పటివరకు జిల్లాలో మామిడి తోటలలో పూత కనిపించడం లేదు. అక్కడక్కడ కొంత పూత కనిపించినా, పిందెలు రాకుండా మగ్గిపోతున్నాయి. దీనికి తోడు చీడపీడలు కూడా మామిడి చెట్లను అవరిస్తున్నాయి. దీంతో జిల్లాలోని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరం ఎలాగో పంట దెబ్బతింది. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని రైతులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో మామిడి పూత నెలన్నర ఆలస్యంగా వస్తుండడంతో రైతులు దిగులు పడుతున్నారు. మామిడి రైతులు ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. దీంతో కొంతమంది రైతులు మామిడి చెట్లను నరికి ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా ముగ్గు చూపుతున్నారు. ఈ దశలో మామిడి బోర్డును ఏర్పాటు చేస్తే, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, కష్టాలు గట్టెక్కుతాయని ఉహించరు. ప్రైవేటు వ్యాపారస్తులు, దళారీలు, మామిడి జ్యూస్ ఫ్యాక్టరీల దోపిడీ నుంచి ఉపశమనం కలుగుతుందని జిల్లాలోని మామిడి రైతులు భావించారు. అయితే మామిడి రైతుల ఆశ నిరాశ అయింది. మామిడి బోర్డు విషయం విషయం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపక పోవడంతో చిత్తూరు జిల్లా మామిడి రైతాంగానికి మళ్లీ కష్టాల, నష్టాల సాగు తప్పేటట్లు లేదు.
పో రై. గంగ 2 మామిడి