20, సెప్టెంబర్ 2025, శనివారం

చిత్తూరు జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు

ఉదృతంగా ప్రవహిస్తున్న నీవా, గార్గేయ నదులు

పలుచోట్ల కొట్టుకుపోయిన కల్వర్టులు 

రోడ్డుమీద ప్రవహిస్తున్న వరద నీరు 

పలు గ్రామాలకు రాకపోకల బంద్ 

చిత్తూరు, సెప్టెంబర్ 20 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు జిల్లాలో కురుస్తున్న  వర్షాల కారణంగా వాగులు, వంకలు భారీగా పొంగిపొర్లుతున్నాయి. సోమల మండలంలో గార్గేయ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.  మూడు చోట్ల కల్వర్టులు కొట్టుకుపోయాయి. ఈ కారణంగా ఏడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నీవా నది పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు తాగు నీటికి ఉద్దేశించిన ఎన్టీఆర్ జలాశయం పూర్తిగా నిండి నిండుకుండను తలపిస్తోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు ఒక గేటును ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. సోమల మండలంలో  గార్గేయ నది, చిన్న కమ్మపల్లె, పుట్రపల్లె, రెడ్డివారిపల్లె ప్రాంతాల్లో కల్వర్టులు కొట్టుకుపోయాయి. గంగాధరనెల్లూరు మండలంలో నీవా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎన్ఆర్ పేటకు వెళ్లే రహదారి పూర్తిగా నీటితో కొట్టుకుపోయింది. దాంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. ఇతర ప్రాంతాల్లోనూ ముంపు ప్రాంతాలు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొంగిపొర్లుతున్న వాగుల వల్ల మార్గాలు మూసివేసారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  జలాశయాలు నిండడంతో అత్యవసరంగా గేట్లను తెరచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి పరిస్థితుల ప్రభావంతో, రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. గ్రామాలు వేరుచేయటం వంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఇంకా భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల జలాశయాలు, వాగులు పూర్తిగా నిండిపోతున్నాయి. పలుచోట్ల పోలీస్ బందోబస్తు, తాడు ఏర్పాట్లు చేపట్టారు.  సురక్షితంగా ఉండేందుకు అధికారుల సూచనలు అమలు చేయాలి. చిత్తూరు జిల్లాలో వానలు ఇంకా కొనసాగుతూ వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గంగ 3 చిత్తూరు పెనుమూరు రహదారిలో ఎన్టీఆర్ జలాశయం వద్ద రోడ్డుపైన ప్రవహిస్తున్న నీరు


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *