29, సెప్టెంబర్ 2025, సోమవారం

జిల్లాలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు

జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు 

పడకేస్తున్న పల్లెలు, పట్టణాలు

ఆస్పత్రులకు క్యూ కడుతున్న ప్రజలు

జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమవుతున్న జ్వరాలు 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

 వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఎండలు వేసవికాలం వలే విజృంభిస్తున్నాయి. సాయంకాలం తర్వాత వాతావరణం చల్లగా మారిపోతుంది. అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. జిల్లాలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఈ నెలలో ఎండ తీవ్రత అంతగా ఉండకూడదు. అయితే, ఎండలు ఒకవైపు విజృంభిస్తూ మరోవైపు రాత్రి అయితే, చలివేస్తుంది ఈ విచిత్ర వాతావరణ పరిస్థితుల కారణంగా చిత్తూరు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు జ్వరాలతో మంచం పడుతున్నారు. చాలా చోట్ల విష జ్వరాలతో పాటు టైఫాయిడ్ ప్రజలను భయపెడుతోంది.

 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పక్షం రోజుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు జనం వస్తున్నారు. గత నెలతో పోలిస్తే వైరల్‌ ఫీవర్‌ కేసులు ఈనెల అధికంగా వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా ప్రతి రోజూ 3వేల మందికి పైగా ఓపీకి రోగులు వస్తున్నారు. గ్రామాల్లో రెండు మూడు రోజులకు ఓసారి కూడా వైద్యసిబ్బంది చికిత్సలు అందించేందుకు వెళ్లడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని పీహెచ్‌సీల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వైద్యులు ఇంటి ముఖం పడుతున్నారు.  చిన్నపెద్దా అనే తేడా లేకుండా వాతావరణ మార్పులతో వైరల్‌ ఫీవర్స్‌తో ప్రతి ఒక్కరూ బాధపడుతు న్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులకు, గొంతునొప్పి లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. గత నెలతో పోలిస్తే వైరల్‌ ఫీవర్‌ కేసులు ఈనెల అధికంగా వస్తున్నాయి. ఇంట్లో ఒకరు తర్వాత మరొకరు విషజ్వరా లతో అల్లాడిపోతున్నారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడంతో నీరసించి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు మాత్రమే తగ్గడం లేదని రోగులు మళ్లీ మళ్లీ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.  జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలు ప్రైవేటు ఆసుపత్రులు, రోగులతో కిటకిటలాడుతున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. రోజురోజుకూ రాష్ట్రంలో వైరల్‌ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. 104 డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం కనిపిస్తున్నారు. ఈసారి శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ విపరీతమైన నీరసం బాధితులను ఇబ్బంది పెడుతోంది.  రోజురోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. గత రెండు వారాల నుంచి ఒక్కసారిగా జ్వర పీడితులు పెరుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లోని ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. పిల్లల్లో ఎడినో, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ జ్వరాలను వైద్యులు ఎక్కువగా గుర్తిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలూ కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి తోడు పారిశుద్ధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. నీరు, గాలి కాలుష్యంతోడై జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి.జిల్లాలో  ఆసుపత్రుల్లో మంచాలు జ్వర బాధితులతో నిండుతున్నాయి.  పీహెచ్​సీలు సైతం  జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. వైద్యులు ముందస్తు జాగ్రత్తగా ఔషదాలు అందుబాటులో ఉంచుతున్నారు. జ్వరం తీవ్రత అధికంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మలేరియా జ్వరం వచ్చినప్పటి నుంచి వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి, కండరాలు కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. కూర్చుంటే లేవటానికే కష్టమవుతుంది.  ఊరిలో ఉన్న డాక్టర్లకు చూపించినా తగ్గలేదు. కావున పట్టణాలకు  వస్తున్నారు.  సాధారణ జలుబు లక్షణాలు, ఫ్లూజ్వర లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. దీంతో వచ్చింది జలుబా? ఫ్లూ జ్వరమా? అన్నది తేలడం లేదు. జలుబు కారణంగా తీవ్రమైన జ్వరం అరుదుగా వస్తుంది. ఫ్లూ లక్షణాలు కాస్త తీవ్రంగా ఉంటాయి. పొడి దగ్గు, గొంతు నొప్పితోపాటు జ్వరం 101 డిగ్రీలకంటే ఎక్కువగా ఉంటుంది. వీటికితోడు ఒళ్లనొప్పులు, తలనొప్పి, బడలిక వంటివీ ఎక్కువగా ఉంటున్నాయి. లేవటానికే కష్టమవుతుంది. ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి అంటున్నారు. అనర్హుల వద్ద వైద్యం ప్రాణాంతకం. వారు ఎక్కువగా యాంటీబయాటిక్స్‌ ఇస్తూ రోగులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తారు. అర్హులైన వైద్యులు రోగి శరీర బరువు, ఇతర లక్షణాలనుబట్టి చికిత్సనందిస్తారు. కావున అర్హులైన డాక్టర్ల వద్దనే చికిత్స పొందాలని కోరుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా అప్రమత్తంగా ఉండాలని చెపుతున్నారు.

పో రై గంగ 1 విష జ్వరాలు 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *