2, సెప్టెంబర్ 2025, మంగళవారం

జిల్లాలో ఏడు ఏఎంసీలకు పాలకవర్గాల నియామకం

రెండు ఏఎంసీల పాలకవర్గాలు పెండింగ్

చిత్తూరు, నవంబరు 2 (ఆంధ్రప్రభ బ్యూరో) : కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చిత్తూరు జిల్లాలో ఏడు వ్యవసాయం మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మరో రెండు వ్యవసాయ మర్కెట్ కమిటీలకు  పాలకవర్గాలను నియమించాల్సి ఉంది.  సంబంధిత శాసనసభ్యుల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత వాటిని నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు చిత్తూరు, నగరి, శ్రీరంగరాజపురం, బంగారుపాలెం, సోమల, కుప్పం, పెనుమరు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇంకా రొంపిచర్ల, పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకమండలను నియమించాల్సి ఉంది. అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధిత శాసనసభ్యులు గౌరవ చైర్మన్ గా వ్యవహరిస్తారు.


చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా వి ఝాన్సీ రాణి, వైస్ చైర్మన్ గా టీ అనురాధ నియమితులయ్యారు. సభ్యులుగా రామ్మూర్తి, గంగి నాయుడు, రాణి, నందిని, నాగరాజు, సయ్యద్ ఫిరోజ్, హేమచంద్ర, అంజలి, మీనాక్షి, గౌరీ, గోవిందస్వామి నాయుడు, మోహన్ నాయుడు నియమితులయ్యారు. నగరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా డి రాజమ్మ, వైస్  చైర్మన్ గా కె కృష్ణమూర్తి నియమితులయ్యారు. సభ్యులుగా ఏ దీప, ఆదిమూలం శకుంతలమ్మ, టి వెంకటేశలు, డి నరసింహులు, ఎం జగన్నాథం,  నాగభూషణం, పి హేమావతి, డి రవి, ఎస్ అశోక్, జి లక్ష్మి, గీర్వాణి,  కన్నివేలు నియమితులయ్యారు. శ్రీరంగరాజపురం మార్కెట్ కమిటీ చైర్మన్ గా జి జయంతి, వైస్ చైర్మన్ గా ఆర్ దేవరాజు నాయుడు నియమితులయ్యారు. సభ్యులుగా వరప్రసాద్, శమీం, చిన్నపాప, జ్యోతి రెడ్డి, ఈశ్వరి, చిన్నప్ప రాజు, జ్ఞానేశ్వరి, జ్యోతి, ధర్మారెడ్డి, శోభన్ బాబు, లక్ష్మి, బాలాజీ, వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ గా కె భాస్కర్ నాయుడు, వైస్ చైర్మన్ గా ఎం సుధాకర్ నియతులయ్యారు. సభ్యులుగా సృజన, చిరంజీవి, చిట్టెమ్మ, జగదీష్, హరిప్రసాద్, నీలిమ, రవికుమారి, జ్యోతి, రామానుజం, గురుస్వామి, గిరిజ, భాస్కర్ నాయుడు, గౌరీ నియమితులయ్యారు. సోమల మార్కెట్ కమిటీ చైర్మన్ గా కరణం శ్రీనివాస్ నాయుడు, వైస్ చైర్మన్ గా జి కుమార్ నియమితులయ్యారు. సభ్యులుగా శ్రీదేవి, సుబ్బరాజు, విశ్వనాథం, కృష్ణప్ప, యువరాణి, ఉమారాణి, కళావతి, ముని రెడ్డి, లక్ష్మీదేవి, శ్యామల, కృష్ణవేణి, మురళి, రవి నాయుడు నియతులయ్యారు. కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ గా జై మునిరాజు, వైస్ చైర్మన్ గా  ప్రియా శరవణ నియమితులయ్యారు. సభ్యులుగా మునీంద్ర నాయక్, గోపి, కళావతి, చంద్రకళ, సుకన్య, అనిత, భానుమూర్తి, పవన్ కుమార్, వడివేలు, తులసి బాబు, అస్మా జోహార, శ్యామలమణి నియమితులయ్యారు.  పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఈ కృష్ణమ్మ నాయుడు, వైస్ చైర్మన్ గా టి అరుణ్ నాదన్ నిమితులయ్యారు. సభ్యులుగా లోకమ్మ, దేవరాజు, కోదండ రెడ్డి, గ్రీష్మ, అరుణ, రేణుక, జ్యోతి, శ్యామల, భార్గవి, దుర్గాప్రసాద్, చారుమతి, సుబ్రహ్మణ్యం నాయుడు నియమితులయ్యారు.




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *