21, సెప్టెంబర్ 2025, ఆదివారం

ఉచిత కుట్టుమిషన్ల కోసం మహిళల ఎదురుచూపులు

మహిళలకు 90 రోజులు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం 

శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం, ఉచితంగా కుట్టు మిషన్ హామీ 

శిక్షణ పూర్తయి మూడు నెలల గడుస్తున్న అందని కుట్టుమిషన్లు 

గ్రామ సచివాలయాలు ఎంపీడీవో కార్యాలయం చుట్టూ మహిళల ప్రదర్శన


ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. 


రాష్ట్ర ప్రభుత్వం వర దుస్తులు కొట్టడంలో శిక్షణ తీసుకున్న మహిళలు సంబంధిత ధ్రువీకరణ పత్రము, కుట్టుమిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. దుస్తుల కొట్టడంలో శిక్షణ కార్యక్రమము పూర్తయి మూడు నెలలు అవుతుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దుస్తులను కొట్టడంలో శిక్షణ తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయలేదు. అలాగే శిక్షణ పూర్తయిన వెంటనే మహిళలకు స్వయం ఉపాధి కోసం ఉచితంగా కుట్టు మిషన్లను అందచేస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలోని మహిళలు ఎంతో ఆశతో దుస్తులు కుట్టడంలో శిక్షణ పొందారు. శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత తర్వాత వారికి ధ్రువీకరణ పత్రాలు, టైలరింగ్ మిషన్లు ఇవ్వడం ప్రభుత్వం మరిచిపోయింది. దీంతో శిక్షణ పొందిన మహిళలు రోజు గ్రామ సచివాలయాలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. తనకు కుట్టు మిషన్ ఇస్తే స్వయం ఉపాధితో ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎంతో శ్రద్ధతో శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం శిక్షణా కార్యక్రమం పూర్తయిన తర్వాత కుట్టు మిషన్లు ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టైలరింగ్ మిషన్ శిక్షణ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలో భారీగా స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా  ఐదువేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. మండలానికి ఒక శిక్షణా కేంద్రం వంతున  27 మండలాల్లో 27 కుట్టు శిక్షణ  కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాలలో ఉదయం ఒక బ్యాచ్ సాయంకాలం మరో బ్యాచ్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ సమయంలో రెండు పర్యాయాలు హాజరు తీసుకున్నారు. మధ్యలో గ్రూప్ ఫోటో కూడా ప్రభుత్వానికి అప్లోడ్ చేశారు. 75 శాతం హాజరు ఉంటేనే ఉచితంగా కుట్టు మిషన్ ధ్రువీకరణ పత్రం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 2,700 మందికి  90 రోజుల వరకు దుస్తులు కుట్టడంలో శిక్షణ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో అల్లికలు, మగ్గం పనులు కూడా నేర్పించారు. ఇందుకు  గ్రామీణ పట్టణ ప్రాంతంలో బిసి, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ  మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందుకు వయసు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు కుట్టడంలో శిక్షణ నిమిత్తం  ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి శిక్షణలో ప్రాథమికంగా దుస్తులు  కొట్టడం గురించి నేర్పించారు. ఈ కుట్టు శిక్షణ కేంద్రాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ  డైరెక్టర్ పర్యవేక్షణలో జరిగింది. మండలాల్లో, మున్సిపాలిటీలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూ లను నిర్వహించి  మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు లబ్ధిదారులను ఎంపిక చేశారు.  ఈ శిక్షణలో 75 శాతం  హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం ప్రభుత్వం తరపున సర్టిఫికేట్ ను, కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1.02 లక్షల మంది మహిళలకు కుట్టుపై ఉచితంగా శిక్షణతోపాటు మిషన్లను అందించేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  బీసీ, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాలకు చెందిన మహిళల ఉపాధి కల్పనకుగాను ఈ నిర్ణయం తీసుకుకున్నారు. తొలుత  అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ  శిక్షణ ప్రారంభించారు. లబ్దిదారుల వీలుకు అనుగుణంగా 45 రోజుల నుంచి 90 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. తొలి విడతగా 46,044 మంది బీసీలకు, 56,788 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు కుట్టుమిషన్లు అందించాలని భావించారు.  ఇందుకోసం ప్రభుత్వం రూ.255 కోట్లు వ్యయం చేస్తుందని ప్రకటించారు. ఇందుకు మహిళలు ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాసి అయ్యి ఉండాలి. ఆధార్ కార్డు, కుల దృవీకరణ పత్రం ఉండాలి. వయసు 20 సంవత్సరముల నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో 1.5 లక్షలు. పట్టణాల్లో 2 లక్షలకు మించరాదు. వితంతువులు, దివ్యాంగ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో కచ్చితంగా 70 శాతం హాజరు ఉంటే కుట్టు మిషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం బిసి, ఆర్థికంగా ఎనుకబడిన కులాలకు చెందినవారు అర్హులు. కుటుంబ వివరాల ప్రాతిపదికన హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ డేటా ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 అప్లికేషన్లు మాత్రమే తీసుకున్నారు. ఇందులో ఎంపిక చేసిన 500 అందికి శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గ స్థాయిలో 5 నుంచి 6 శిక్షణ కేంద్రాలలో ఈ శిక్షణ ఇచ్చారు. ఒక శిక్షణ కేంద్రం 30 నుండి 50 మహిళలకు 90 రోజుల వరకు శిక్షణ ఇచ్చారు.  ప్రతిరోజు శిక్షణ ఇచ్చే టైములో రోజు హాజరు వేశారు.  కుప్పం నియోజకవర్గంలో మాత్రం పరిమితి లేకుండా ఎందరు దరఖాస్తు చేస్తే, అందరికి శిక్షణ ఇచ్చారు. కుట్టు శిక్షణ కేంద్రాలను ఆయా నియోక వర్గాలలో శాసన సభ్యులు ప్రారంభించారు. చిత్తూరు మున్సిపాలిటిలో మాత్రం మహిళా దినోత్సవం సందర్భంగా కుట్టు శిక్షణ ప్రారంభం అయ్యింది. ఇప్పటికైనా  ప్రభుత్వం తమకు ద్రువికరణ పత్రం, ఉచిత కుట్టు మిషన్ అందచేయాలని కోరుతున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *