14, సెప్టెంబర్ 2025, ఆదివారం

ఇంటి వద్దకే కుల ధ్రువీకరణ పత్రం

దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా లేదు 
కులాల నిర్ధారణకు ఇంటింటి సర్వే 
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, యువతకు వరం 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇకపై కుల ధ్రువీకరణ పత్రాలను ఇంటింటికి నేరుగా అందచేయాలని నిర్ణయించింది. ఇక కుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో తిరుగుతూ సమయం వృధా చేయాల్సిన అవసరం ఉండదు. అక్టోబర్ 2 నుంచి ఈ పత్రాలను నేరుగా ప్రతి ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన సర్వేలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ఆధార్, రైస్ కార్డ్, విద్యార్హత వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఈ విధంగా ప్రజలకు పత్రాలను సులభంగా అందించే చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నది. ఈ
కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి, వారు కుల ధ్రువీకరణ పత్రానికి అర్హులా లేదా అనే అంశాలను వీఆర్‌వోలు పరిశీలిస్తున్నారు. సేకరించిన వివరాలు స్థానిక ఆర్‌ఐ, తహసీల్దార్ కార్యాలయాలకు పంపుతారు. ఆ సమాచారం వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి, అవసరమైతే ఆర్డీవో లేదా జేసీ పరిశీలనకు కూడా పంపుతారు. ఈ విధానం ద్వారా పత్రాల ప్రాసెసింగ్ వేగవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ పత్రం విద్య, ఉపకార వేతనాలు, ఉద్యోగాలు  అభివృద్ధి, సంక్షేమ పథకాలలో ఉపయోగపడుతుంది. గతంలో ప్రజలు ఈ పత్రం కోసం సచివాలయం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి పెద్ద కష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇంటికే పత్రం అందించడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వీఆర్‌వోలు ప్రతి ఇంటిలోని వివరాలను సేకరించగా, ఈ సర్వేలో ఆధార్, రైస్ కార్డు, పూర్వపు కుల ధ్రువీకరణ పత్రం, జననం తేది, విద్యార్హత వంటి డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. ఈ విధంగా సర్వే పూర్తైన తర్వాత, అర్హుల జాబితాను రెవెన్యూ వెబ్‌సైట్‌లో ఉంచి, ప్రజలు అవసరమైన వారికి సులభంగా పత్రాలు పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఈ కొత్త పథకం ద్వారా ప్రజలకు పెద్ద సౌలభ్యం లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లే కష్టాన్ని తగ్గించడం, పత్రాల ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, అర్హులైన కుటుంబాలకు నేరుగా పత్రాలు అందించడం వంటి అంశాల్లో ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని తీసుకువస్తోంది.
కొద్దిరోజులుగా చాలామంది మొబైల్స్‌కు.. మీరు ఇంటిగ్రేటెడ్‌ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అది మాకు అందింది. ఈ దరఖాస్తుపై సుమోటో విచారణ జరుగుతోంది. 25 రోజుల్లోపు ప్రాసెస్‌ పూర్తవుతుంది. గవర్నమెంట్‌ ఏపీ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులో అసలు దరఖాస్తు చేయకుండా ధ్రువీకరణ పత్రం ఏంటని కొందరు అవాక్కు అవుతున్నారు. తర్వాత అసలు విషయం తెలుసుకొని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.


వీఆర్వోలు చేపట్టిన ఈ ఇంటింటి సర్వేను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. వీఆర్‌వో లాగిన్ నుంచి ఆర్‌ఐకి, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వివరాలు వెళ్తాయి. అక్కడ వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేస్తారు. కొన్ని దరఖాస్తులు ఆర్డీవో, జేసీల పరిశీలనకు కూడా వెళ్తాయి. అర్హుల జాబితాను రెవెన్యూ వెబ్‌సైట్‌లో పెడతారు. ప్రజలు అవసరమైనప్పుడు సులువుగా అవసరమైన పత్రాలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సర్వేలో ప్రతి ఇంట్లో ఆధార్, రైస్ కార్డు, గతంలో జారీ చేసి కుల ధ్రువీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్, విద్యార్హత వివరాలు పరిశీలిస్తారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *