25, సెప్టెంబర్ 2025, గురువారం

నాలుగు వరుసల రోడ్డుగా కర్నూలు- పీలేరు- చిత్తూరు రహదారి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ప్రతిపాదన ఇచ్చిన మంత్రి రాం ప్రసాద్ 

సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి: త్వరలో పనులు ప్రారంభం 

వాహనాల రద్దీని తగ్గించి ప్రమాదాలు నివారించడమే ధ్యేయం 

కడప - రాయచోటి మధ్య ఆరు కిలోమీటర్ల సొరంగం మార్గం 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

కర్నూలు- పీలేరు- చిత్తూరు మార్గంలోని కడప నుండి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్ వరకు ఎన్ హెచ్ 40ని 148 కిలోమీటర్లు నాలుగు వరుసల రహదారిగా విస్తరిస్తున్నారు, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. కడప-పీలేరు మార్గంలో కొన్ని చోట్ల ఇప్పటికే నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయబడ్డాయి లేదా అభివృద్ధి ప్రక్రియలో ఉన్నాయి జాతీయ రహదారి 40లో భాగంగా, కర్నూలు నుండి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్ వరకు మొత్తం 148 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలోని అనేక అంశాలపై ఆయనతో చర్చించారు.  కడప- రాయచోటి రహదారిని నాలుగు వరుసలకు విస్తరించే పనులను ఆమోదం తెలిపాలని, నిధులు విడుదల చేయాలని కోరారు. మండిపల్లి వినతిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విస్తరణ ప్రాజెక్టు పూర్తి అయితే, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక మధ్య పోర్టు కనెక్టివిటీ పెరుగుతుంది.


ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల నిర్మాణం, కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభిస్తోంది. ముఖ్యంగా రహదారుల విస్తరణ, కొత్త రహదారుల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి అద్భుత సహకారం అందుతోంది. ఈ క్రమంలోనే కర్నూలు-పీలేరు-చిత్తూరు నాలుగు వరసల రహదారి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కర్నూలు నుంచి రాణిపేట వరకు ఉన్న ఎన్ హెచ్ -40లో కడప నుంచి రంగంపేట క్రాస్ వరకు 148 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. వాహనాల రద్దీ తగ్గించి ప్రమాదాలు నివారించడమే లక్ష్యం. ఈ హైవే చెన్నై, వేలూరు, కోయంబత్తూరు, పాండిచ్చేరి వరకు విస్తరించి ఉండటంతో రవాణా మరింత సులభతరం కానుంది. త్వరలోనే ఈ మార్గం నాలుగు లైన్లుగా మారనుంది. కేంద్రం దేశంలో 10 జాతీయ రహదారులను అభివృద్ధి చేయనుంది. అందులో ఈ హైవే కూడా ఉంది. కర్నూలు నుంచి తమిళనాడులోని రాణిపేట వరకు ఉన్న నేషనల్ హైవే-40లో కడప నుంచి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్ వరకు 148 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. వాహనాల రద్దీని తగ్గించి ప్రమాదాలు నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో చిత్తూరు ఎంపీగా జ్ఞానేంద్రరెడ్డి ఉన్నప్పుడు చిత్తూరు- కడప రోడ్డును ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి నేషనల్ హైవేగా మార్చారు. ఆ తర్వాత 15 ఏళ్ల క్రితం రెండు వరుసల రోడ్డును అభివృద్ధి చేశారు.. ఇప్పుడు నాలుగు వరుసలుగా మార్చనున్నారు. ఈ హైవే విషయానికి వస్తే  కడప-చిత్తూరు హైవే రాణిపేట మీదుగా చెన్నై, వేలూరు, కోయంబత్తూరు, పాండిచ్చేరి వరకు వెళ్తుంది. ఈ ప్రాంతాలన్నీ వ్యాపారపరంగా చాలా అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలోనే ఈ హైవేపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ రోడ్డులో పగలు బస్సులు, కార్లు తిరుగుతుంటాయి. రాత్రి సమయాల్లో లారీలు, కంటెయినర్లు సరుకు రవాణా ఎక్కువగా ఉంటుంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే కేంద్రం ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం మదనపల్లె నుంచి తిరుపతి వరకు నాలుగు లైన్ల హైవే పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే కడప-చిత్తూరు మార్గం కూడా నాలుగు లైన్లుగా మారుతుంది. ఈ హైవే పనులు పూర్తి చేసిన తర్వాత అందుబాటులోకి వస్తే కడప వైపు నుంచి తమిళనాడుకు త్వరగా వెళ్లొచ్చు. ఈ హైవే అందుబాటులోకి వస్తే రాయలసీమ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. అలాగే రోడ్డు ప్రమాదాలకు కూడా చెక్ పెట్టొచ్చంటున్నారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే డీపీఆర్ రెడీ చేసే పనిలో ఉన్నారు. కడప - రాయచోటి ఘాట్ రోడ్డులో టన్నెల్ నిర్మాణం, నాలుగు లేన్ల రహదారికి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. గువ్వల చెరువు ఘాట్‌‌లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కొండకు సొరంగం తవ్వి, 4 లేన్ల రహదారి నిర్మించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిలో భాగంగా కడప - రాయచోటి మధ్య సొరంగం నిర్మించనున్నారు. ఆరు కిలోమీటర్ల మేరకు సొరంగం నిర్మించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టనుండటంతో పెద్ద సొరంగాన్ని ఒక్కటే చోట నిర్మించాలా లేదా.. రెండేసి వరుసల రోడ్లకు రెండు సొరంగాలు నిర్మించాలా అనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం కన్సల్టెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *