జీఎస్టీ తగ్గినా, తగ్గని నిత్యావసర వస్తువుల ధరలు
కొత్త స్టాక్ వచ్చిన తరువాత తగ్గనున్న నిత్యావసర వస్తువులు
15 నుండి నెల రోజులు పట్టే అవకాశం
దుకాణాల ముందు కనిపించని తగ్గింపు బోర్డులు
పట్టించుకోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు
నిరాశకు గురవుతున్న వినియోగదారులు
ఆంధ్రప్రభ, చిత్తూరు బ్యూరో.
దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. దీంతో పలు రకాల వస్తువులు ధరలు తగ్గుతాయని వినియోగదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ధరలు తగ్గుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడంతో దుకాణాలకు వినియోగదారుల రాక పెరిగింది. పలువురు వినియోగదారులు నిత్యావసర వస్తువుల ధరలు ఎంత తగ్గాయని ఆరా తీస్తున్నారు. అయితే నిత్యవసర ధరల వస్తువులు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని దుకాణం దారులు చెబుతున్నారు. ధరలు తగ్గడానికి 15 నుండి నెల రోజుల సమయం పడుతుందని చెపుతున్నారు. ప్రస్తుతం పాత స్టాక్ ఉందని, ఈ స్టాక్ అయిపోయిన తర్వాత కొత్త స్టాకు వస్తుందని అంటున్నారు. పాత స్టాక్ ఉన్న కారణంగా పాత ధరల ప్రకారమే నిత్యావసర వస్తువులను విక్రయించాల్సి వస్తుందని దుకాణం దారులు చెబుతున్నారు. కొత్త స్టాకు కొత్త ధరలతో వస్తుందని అప్పుడు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని దుకాణం దారులు వివరిస్తున్నారు. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గాయని ఆ మేరకు కొనుగోలు చేద్దామని వెళ్లిన వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు.
దేశవ్యాప్తంగా జిఎస్టిని తగ్గించిన ప్రభుత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా పాత, కొత్త ధరల బోర్డులను దుకాణాల ముందు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ ఇలాంటి ఏర్పాట్లు ఎక్కడ కనిపించడం లేదు. కార్లు, బైక్ షోరూంల ముందు మాత్రం జిఎస్టి మార్పులతో ఎంత అదా అవువుతుందనేది అంకెలతో సహా ప్రదర్శిస్తున్నారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై జిఎస్టి తొలగించారని పాలసీదారులకు భీమా కంపెనీ సందేశాలు పంపుతున్నాయి. ప్రజల అధికంగా వినియోగించే నిత్యవసర వస్తువులపై జిఎస్టి 12 నుంచి ఐదు శాతానికి ప్రభుత్వం తగ్గించింది. కానీ ఈ తగ్గింపు వివరాలు కిరాణా దుకాణాల ముందు కనిపించడం లేదు. నెయ్యి, వెన్న, పనీర్ వంటి ఉత్పత్తులపై తగ్గిన జిఎస్టి రేట్లు తాజాగా విజయ డెయిరీ విడుదల చేసింది. పన్నీరు పై గతంలో జీఎస్టీ 5 శాతం అండగా సోమవారం నుండి దాన్ని పూర్తిగా తొలగించారు. పాత దర పన్నీరు కిలో 480 రూపాయలు ఉండగా జీఎస్టీ రద్దుతూ 465 కు విక్రయించారని విజయ డెయిరీ అన్ని విక్రయ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పనీర్ ఇంతకుముందు 690 రూపాయలు ఉండగా ఇప్పుడు 650 రూపాయలకు తగ్గింది. జీఎస్టీ తగ్గింపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు చాలా వరకు ఇంకా తగ్గలేదు.తగ్గింపు ప్రయోజనం పూర్తిగా ప్రజలకు అందట్లేదు. చాలా చోట్ల పాత స్టాక్ కారణంగా పాత ధరలకే విక్రయాలు జరుగుతున్నాయి. వ్యాపారులు పాత జి ఎస్ టి రేటుతో కొనుగోలు చేసిన సరుకులను అమ్మడంతో తగ్గింపులు త్వరగా ప్రజలకు అందడం లేదు. సూపర్ మార్కెట్లలో అప్పుడు కొత్త రేట్లు అమలులో ఉన్నా, చిన్న రిటైల్ దుకాణాల్లో పాత ధరలే కొనసాగుతున్నాయి. మందుల ధరల్లో పెద్దగా మార్పు లేదు. వీటిలో తగ్గింపులు ప్రాథమికంగా కనిపించలేదు. దుకాణాల్లో, ఈ-కామర్స్ సైట్లలో తగ్గిన జిఎస్టి ప్రయోజనం పూర్తిగా వినియోగదారులకు అందడం లేదని పలువురు ఫిర్యాదులు చేశారు. జిఎస్టి రేటు తగ్గింపుతో దేశవ్యాప్తంగా 99 శాతం నిత్యావసర వస్తువుల ధరలు తక్కువ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తిస్థాయిలో ధరలు తగ్గడానికి మరికొంత కాలం పడవచ్చు. పాత స్టాక్ అయిపోయి, నూతన దరఖాస్తులు వచ్చినప్పుడు ప్రజలకు తగ్గిన ధరలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సామాన్య ప్రజలకి ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం జిఎస్టి రేట్లను తగ్గించింది. అలాగే తగ్గించిన జిఎస్టి రేట్లను సెప్టెంబర్ 22 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వంటగది నుండి కారు, టీవీ-ఫ్రిడ్జ్, హోమ్ అప్లియన్సెస్, పాలు-నెయ్యి-వెన్న, జున్ను, బట్టలు-బూట్లు వరకు ప్రతిదాని ధర మారుతుందని తెలిపింది. జిఎస్టి రేట్ల తగ్గింపు ప్రయోజనాలను అందించడానికి ఇప్పటికే మదర్ డైరీ, అమూల్, ఐటిసి వంటి కొన్ని కంపెనీలు ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. సెప్టెంబర్ 22 నుండి, జిఎస్టి కేవలం రెండు శ్లాబ్‌లలో 5 శాతం లేదా 18 శాతం మాత్రమే ఉంటుందని తెలిపింది. పనీర్, నెయ్యి, సబ్బు-షాంపూ వంటి సాధారణ నిత్య వస్తువులతో పాటు ఏసి, కారు 0 శాతం లేదా 5 శాతం జిఎస్టి శ్లాబ్‌లో ఉంచింది. జిఎస్టి రేట్లను మార్చడం ద్వారా పిండి, బియ్యం, పప్పులు, పాలు, నెయ్యి, వెన్న వంటివి కూడా చౌకగా మారతాయి. మొత్తంగా సెప్టెంబర్ 22 నుండి దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రకటించింది. జిఎస్టి తగ్గింపుతో పాశ్చురైజెడ్ పాలు, వెన్న, నెయ్యి, వెన్న నూనె, పాల స్ప్రెడ్‌లు, పనీర్ (చీజ్), పనీర్, రోటీ, చపాతీ, పాపడ్, పాస్తా, నూడుల్స్, కౌస్కాస్, పేస్ట్రీలు, కేకులు, బిస్కెట్లు, కార్న్ ఫ్లెక్స్, స్టీల్ గిన్నెలు, నమ్కీన్, భుజియా, మీక్షర్ (ప్యాకేజ్ చేసినవి), సాస్‌లు, మసాలాలు, మసాలా పొడి, టీ, కాఫీ పౌడర్, షికోరి కాఫీ గింజలు, జామ్, జెల్లీ, మార్మాలాడే, కొబ్బరి నీళ్లు (ప్యాక్ చేసినవి), కండెన్సడ్ పాలు, టూత్ బ్రష్, డెంటల్-ప్లేట్ బ్రష్, టూత్‌పేస్ట్, పళ్ళ పొడి, టాయిలెట్ సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, షేవింగ్ లోషన్, ఆఫ్టర్ షేవ్, నేప్కిన్లు, పిజ్జా బ్రెడ్, పరాఠా, పరోటా బ్రెడ్, మట్టి గిన్నెలు, సిరామిక్ టేబుల్‌వేర్, కిచెన్‌వేర్, డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు, అంజూర పండ్లు, పైనాపిల్, అవకాడో, మామిడి (ఎండినవి), సిట్రస్ పండ్లు (నారింజ, మాండరిన్లు, ద్రాక్షపండు, నిమ్మకాయలు) , ఇతర డ్రై ఫ్రూట్స్, గింజల మిశ్రమాలు (చింతపండు తప్ప), బ్రెజిల్ గింజలు, చక్కెర స్వీట్స్, చాక్లెట్, ఇతర బేకర్ల ఉత్పత్తులు, ఐస్ క్రీం, సూప్‌లు, రసం, టమోటా, పుట్టగొడుగుల నిల్వలు, వెనిగర్లో నానపెట్టిన కూరగాయలు, ఈస్ట్, బేకింగ్ పౌడర్, టెక్స్చరైజ్డ్ వెజిటబుల్ ప్రోటీన్, ఎక్స్‌ట్రూడెడ్ నమ్‌కీన్, కొబ్బరి వెన్న, కొబ్బరి నూనె,కొబ్బరి పొడి, మాల్ట్-బార్లీ, కూరగాయల రసాలు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, టెలివిజన్ సెట్లు (అన్ని సైజులు) , ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ ఓవెన్, ఇండక్షన్ కుక్కర్, రైస్ కుక్కర్, హీటర్, గ్రైండర్, మిక్సర్, జ్యూసర్, కుట్టు మెషిన్, వాక్యూమ్ క్లీనర్, ఇస్త్రీ పెట్టె, హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రెయిట్నర్, ఎలక్ట్రిక్ షేవర్, రూ.2500లోపు ఉన్న చెప్పుల ధర, కార్పెట్, వెదురు, మెటల్ ఫర్నిచర్, చెక్క ఫర్నిచర్, ప్లాస్టిక్ మోల్డెడ్ ఫర్నిచర్, గ్లాస్ గాజులు, కొవ్వొత్తులు, గొడుగులు, హ్యాండ్‌క్రాఫ్ట్ హ్యాండ్‌బ్యాగులు, పౌచ్‌లు, పర్సులు, హ్యాండ్‌బ్యాగులు, షాపింగ్ బ్యాగులు, చేతితో తయారు చేసిన శాలువాలు, టోపీలు, పెన్సిళ్లు, క్రేయాన్లు, పాస్టెల్లు, సుద్ద, రబ్బరు బ్యాండ్లు, ట్రైసైకిళ్లు, స్కూటర్లు, పెడల్ కార్లు, బొమ్మలు, ప్లేయింగ్ కార్డ్స్, చెస్ బోర్డు, క్యారమ్ బోర్డు, ఎడ్యుకేషనల్ టాయ్స్, పేపర్‌బోర్డ్, వ్యక్తిగత ఉపయోగం కోసం అన్ని మందులు, డయాగ్నస్టిక్ కిట్లు, రియాజెంట్లు, ఫీడింగ్ బాటిళ్లు, సర్జికల్ చేతి గ్లవుజులు, కాంటాక్ట్ లెన్సులు, టాల్కమ్ పౌడర్, ఫేస్ పౌడర్, సిమెంట్, జనపనార, వరి పొట్టు, జిప్సం, సిసల్, బాగస్సే, పత్తి కాండాలు, సిరామిక్ బిల్డింగ్ బ్రిక్స్, బ్లాక్స్, టైల్స్, తబలా, మృదంగం, వీణ, సితార్, ఫ్లూట్, షెహనాయ్, ఢోలక్, సైకిల్, డిష్ వాషర్, బైక్స్ (350సిసి వరకు), స్కూటర్లు, మోపెడ్‌లు, ఆటో, ఈ-రిక్షా, కార్లు (చిన్న ఇంకా మధ్య), విద్యుత్ వాహనాలు, అంబులెన్స్, బస్సులు, ట్రక్కులు, టైర్లు, ట్రాక్టర్ విడి భాగాలు, అగ్గిపుల్లలు ఇంకా కొన్ని ఇతర ఉన్నాయి. ఈ వస్తువుల ధరలు తగ్గకపోవడం, దుకాణాల ముందు కొత్త, పాత ధరల బోర్డులను ఏర్పాటు చేయకపోవడంపై వాణిజ్య పన్నుల అధికారులు స్పందిస్తూ.. పాత కొత్త ధరల బోర్డులను దుకాణాల ముందు ఏర్పాటు చేయాలని వ్యాపారులకు ఆదేశాలు ఇచ్చామని, అలా ఏర్పాటు చేశారా అనేది తనిఖీలు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించామని అంటున్నారు. అయితే, ఎక్కడ అమలు జరగడం లేదు.

