అనాధ పిల్లలకు నెలకు రూ. 4 వేల సహాయం
అంగన్‌వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులు, సిడిపిఓల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేసేందుకు పిల్లల జనన, ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్, రేషన్‌కార్డు కాపీలు, బ్యాంక్ పాస్ బుక్, మిగిలిన పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును ధ్రువీకరిస్తూ గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు మీద సంతకం చేయాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72 వేల లోపు ఉండాలి. పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ. 96 వేల లోపు ఉండే వారు అర్హులు. పిల్లల చదువుకు, వారి పోషణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు సహాయం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అనాథ పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది.

