నిండ్ర మండల పరిషత్ అధ్యక్షురాలు రాజీనామా
నిండ్ర మండల పరిషత్ అధ్యక్షురాలు డి.దీప తన పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి రవికుమార్ కు సాయంత్రం 4.45 గంటలకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్ర ప్రభుత్వం మాట్లాడుతూ తాను స్వచ్ఛందంగా మండల పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను రాజీనామా చేయడంలో ఎటువంటి రాజకీయ వత్తిళ్ళు కానీ విభేదాలు కాని లేవన్నారు. అనారోగ్య కారణంగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. గత నెల రోజులుగా తాను అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వివరించారు. అనారోగ్యం కారణంగా తన పదవికి న్యాయం చేయలేనని అభిప్రాయపడ్డారు. తన రాజీనామాన్ని ఆమోదిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన పిల్లలు బెంగళూరులో ఉన్నారని, వారి వద్దకు వెళ్లి చికిత్స చేసుకుంటూ, విశ్రాంతి తీసుకుంటానని దీప ఆంధ్రప్రభ కు వివరించారు.

