25, సెప్టెంబర్ 2025, గురువారం

వంద ఎకరాలకు పైగా విలువైన ఆలయ భూములు అన్యాక్రాంతం

రూ. 28 కోట్లకు అధిపతి అయినా నిత్య పూజకు కూడా దిక్కు లేదు 
విలువైన భూములు ఆక్రమించుకున్న నాయకులు, రైతులు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామ నారాయణ రెడ్డికి ఫిర్యాదు 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


వంద ఎకరాల పైగా సుమారు 28 కోట్ల రూపాయల విలువ చేసే దేవుని  మాన్యం ఆక్రమణలకు గురయ్యింది. దీంతో ఆ ఆలయానికి దూప, దీప, నైవేద్యాలు కూడా కరువయ్యాయి. ఆలయం అభివృద్ధి కుంటుపడింది. 28 కోట్ల భూములకు వారసుడైన  కోదండ రాముడు దిక్కులేని వాడయ్యాడు. నిత్య పూజకు కూడా నోచుకోలేదు. కోట్లాది రూపాయల విలువ చేయు అలయ భూములకు రాజకీయనాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు సొంతం చేసుకున్నారు. సొంత భూములు కాకపోవడంతో అడిగే నాదుడే కరవయ్యాడు. ఆలయ భూములను కాపాడల్చిన దేవాదాయ ధర్మదాయ అధికారులు నిమ్మకునిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇటేవల కొందరు ఈ విషయమై రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కొందరు సామాజిక కార్యకర్తలు కూడా ఈ విషయమై ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో  దేవాదాయ ధర్మదాయ అధికారులు స్పందిస్తారని, ఆ భూములను అక్రమార్కుల చేర నుండి విడిపిస్తారని భుక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


మండల కేంద్రమైన పెనుమూరు గ్రామం చివరలో అల్లాల చెరువు కట్టను అనుకుని పూర్వీకులు కోదండరామాలయం నిర్మించారు. ఆలయ పోషణ కోసం వంద ఎకరాలకు పైగా భూములు సమకూర్చారు. ఆ భూములను రైతులకు కౌలుకిచ్చి సంవత్సరానికి కొంత సొమ్ము తీసుకునే వారు. క్రమంగా ఆలయ నిర్వాహకుల అలసత్వం, కౌలు దారుల స్వార్థం వల్ల దేవుని భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఈ భూములు  కొందరు రాజకీయ పలుకుబడి కలిగిన వారి హస్తగతం అయ్యాయి. అమ్మగారి పల్లె సర్వే నెంబర్ 1 నుంచి సర్వే నెంబర్ 19 వరకు 116 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి విలువ ఎకరం రూ 20 లక్షల ప్రకారం రూ 13 కోట్ల 20 లక్షల విలువ ఉంటుంది. ఈ భూములను పూర్తిగా రైతులు స్వంతం చేసుకున్నారు. పెనుమూరు బస్టాండ్ ఎదురుగా సర్వే నెంబర్ 502లో ఒక ఎకరం 20 సెంట్లు విలువైన భూమి ఉంది. ఇందులో 15 సెంట్లు భూమిని ఆక్రమించుకుని షాపులు కట్టుకున్నారు. ఇక్కడ ఒక అడుగు స్థలం రూ 15 వేలు ఉంటుంది. అంటే దాదాపు 15 కోట్ల విలువ ఉంటుంది. మిగిలిన్ ఎకరం ఐదు సెంట్లు భూమిలో టిటిడి కళ్యాణ మండలం కట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రామాలయం ఆలనా పాలన గూర్చి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా పెనుమూరులోని అక్కగార్లు ( అక్క దేవతలు) భూమి అర్ధ ఎకరాన్ని పలుకుబడి కలవారు ఆక్రమించుకున్నారు. అలాగే పెనుమూరు వినాయక స్వామి గుడి మాన్యం ఆరు ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టు తెలిసింది. ఇందులో అట్లవాటి పల్లెలో ఆరున్నర ఎకరాలు, కె సి పల్లె రోడ్డులో రెండు ఎకరాలు ఉంది. స్వామి మాన్యం భూముల పరిరక్షణ కోసం గతంలో సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి, స్థానిక ప్రముఖులు రామకృష్ణ నాయుడు, విశ్వప్రకాష్ నాయుడు అధికారులకు అనేక విజ్ఞప్తులు చేశారు. గత వారం టిడిపి కొందరు టిడిపి నాయకులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామ నారాయణ రెడ్డిని కలసి కోదండ రామాలయ భూములు పరిరక్షించాలని కోరారు. మంత్రిని కలసిన వారిలో పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వహక కార్యదర్శి లోకనాథ నాయుడు, పార్లమెంటు కార్యదర్శి రెడ్డప్ప ఉన్నారు. ఇకనైనా రెవిన్యూ, దేవాదాయ ధర్మదాయ అధికారులు ఆ భూములను ఆలయానికి స్వాదీనం చేయాలని భక్తులు కోరుతున్నారు.

పో రై గంగ 1 పెనుమూరు కోదండరామాలయం

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *