అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకు
ఇందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
అక్రమ రిజిస్ట్రేషన్ పాల్పడిన సబ్-రిజిస్ట్రార్లకు జైలు శిక్ష
ప్రభుత్వ భూములను కాపాడటమే ధ్యేయం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగితే వాటిని రద్దుచేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి దాఖలు పరుస్తూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. 2023 మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో జారీచేసిన ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఇందులో ఫిర్యాదుదారులకు వెంటనే న్యాయం జరిగే అవకాశం ఉంది. గతంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగితే సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ సంవత్సరాల తరబడి కేసులు నడిచేవి. పైగా కోర్టు ఫీజులు న్యాయవాదులు ఫీజులు భారీగా చెల్లించాల్సిన అవసరం ఉండేది. అయినా ఫిర్యాదుదారులకు వెంటనే న్యాయం జరిగేది కాదు. ఈ విషయాలను పరిశీలించిన ప్రభుత్వం అక్రమ రిజిస్ట్రేషన్ ను
వెంటనే రద్దు చేయడానికి ప్రత్యేక బిల్లులు తీసుకుని వచ్చింది. ఇందువల్ల ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు, చెరువులు, కుంటలు, మేత భూములకు సంబంధించిన భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇందువల్ల ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా కాపాడే అవకాశం ఉంది.
అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దుచేసే అధికారం ప్రస్తుతం సివిల్ కోర్టులకు మినహా ఎవరికీ లేదు. దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర అక్రమ పద్ధతుల్లో అక్రమ పద్ధతుల్లో ఆసుల విక్రయాలరిజిస్ట్రేషన్లకు అడ్డుపడడం లేదు. దీని కారణంగా జిల్లాలో అక్రమార్కులు చెలరేగిపోయారు. ప్రభుత్వ భూములనే కాకుండా ప్రైవేటు భూములను కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమ పేరున, బినామీల పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిని తిరిగి పొందడానికి ప్రభుత్వ అధికారులు కూడా సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వ అధికారులు బదిలీలు కావడం ఒత్తిళ్లకు లొంగడంతో జిల్లాల్లో చాలావరకు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. అక్రమార్కులు డీకేటి భూములను అడవులు చెరువులు కుంటలు మేత భూములను కూడా ఆక్రమించుకుని తర్వాత రిజిస్టర్ కార్యాలయాల్లో మేనేజ్ చేసుకుని తమ పేరున
రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటనలు జిల్లాలో చాలా ఉన్నాయి. సివిల్ కోర్టుకు వెళ్లడం కారణంగా సమయము, ధనము వ్యయం కావడంతో సామాన్యులు కోర్టుకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఈ విషయాలను గమనించిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, కొందరు గుండాలు రౌడీలు ప్రభుత్వ ప్రైవేటు స్థలాలను భారీగా కబ్జాలు చేశారు. జిల్లాలో క్రమంగా ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు కూడా భూములను లభించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిరో ధానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908ను సవరించిన ఏపీ యాక్ట్ ఎమెండ్ మెంట్-2023 బిల్లుకు 2023 మార్చి 20న శాసనసభ ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీని అమలు ఉత్తర్వులు ఇప్పుడు వెలువడ్డాయి. ఈ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు అక్రమ పద్ధతుల్లో జరిగినట్లు ఫిర్యాదులు అందగానే జిల్లా రిజిస్ట్రార్ వాటిని పరిశీలిస్తారు. ఆధారాల ప్రాతిపదికన కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే కమిటీకి సిఫార్సు చేస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా రిజిస్ట్రార్, ఇతర అధికారులు ఉంటారు. జిల్లాలోని భూములను నిషిద్ధ జాబితా నుంచి భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఆక్రమాలు భారీగా జరిగాయని మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో దగ్ధమైన ఫైళ్ళు చెప్తున్నాయి. తాజా ఉత్తర్వులతో ఇలాంటి రిజిస్ట్రేషన్లను రద్దుచేయడం సులువవుతుంది. నూతన ఆదేశాల మేరకు నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసినా, ఒకే ఆస్తికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేసినా, కోర్టు ఎటాచ్మెంట్లో ఉన్నవాటికి రిజిస్ట్రే షన్లు చేసినా అలాంటి సబ్-రిజిస్ట్రార్లకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. ఈ మేరకు సవరించిన చట్టంలో పేర్కొన్నారు. విధినిర్వహణలో సబ్-రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు వల్ల క్రయ, విక్రయదారులకు నష్టం వాటిల్లినట్లు రుజువైతే ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చని ఇప్పటికే అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో పేర్కొన్నారు. బ్రాండెడ్ కంపెనీలతో వ్యాపారం చేసేందుకు కంపెనీలు లేదా వ్యక్తులు చేసు కునే ఒప్పందాల ప్రాంఛైజ్ విలువ అనుసరించి స్టాంపుడ్యూటీ వసూలు అమలు నోటిఫికేషన్ ను రెవెన్యూ శాఖ జారీచేసింది. ఈ నోటిఫికే షన్ అనుసరించి తీసుకునే చర్యలు వెంటనే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో రెవెన్యూశాఖ పేర్కొంది. ఒప్పంద కాలపరిమితి ఏడాది వరకు ఉంటే రూ.1,000, పదేళ్లలోపు ఉంటే ఏడాదికి రూ.1,000 చొప్పున స్టాంపుడ్యూటీ చెల్లించాలి. పదేళ్లు దాటితే రూ.25,000 వరకు స్టాంపుడ్యూటీ వసూలుచేస్తారు.
గంగ 1 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం

