3, సెప్టెంబర్ 2025, బుధవారం

చిత్తూరు వైసిపి నేత విజయానంద రెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు

మద్యం కుంభకోణానికి సంబంధించి పలు ఆధారాల స్వాధీనం 

విజయానంద రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా మద్యం సరఫరా చేసినట్లు సమాచారం 

చిత్తూరులో సంచలనం సృష్టించిన సీట్ తనిఖీలు


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో బుధవారం మద్యం స్కా మ్ దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. చిత్తూరు నగరానికి చెందిన వైసిపి నేత విజయానంద రెడ్డికి చెందిన ఇల్లు కార్యాలయాల్లో బుధవారం సిట్ అధికార బృందం తనిఖీలు నిర్వహించింది. నగరంలోని బీవీ రెడ్డి కాలనీలోని నలంద అపార్ట్మెంట్ లోని విజయానంద రెడ్డి ఇల్లు అతని కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. మద్యం కేసు దర్యాప్తు లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. 2024 ఎన్నికల్లో విజయానంద రెడ్డి వైసీపీ తరఫున చిత్తూరు అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీట్ అధికారులు అతన్ని విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారించారు. గతంలో మద్యాన్ని విజయానంద రెడ్డి మద్యాన్ని దుకాణాలకు సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. చిత్తూర్ నగరంలో సిట్ అధికారులు తనిఖీలు కలకలం సృష్టించాయి.
చిత్తూరు సీఎంఆర్ కంపెనీ వద్దకు తనిఖీలకు వెళ్లే అక్కడ వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పేరుతో బోర్డు ఉందని అధికారులు తెలిపారు. వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్‌ కంపెనీ వైసీపీ నేత విజయానంద్ రెడ్డి సంస్థగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇదే కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో మోహిత్ రెడ్డి , విజయానంద్ రెడ్డి కంపెనీ వివరాలు బయటపడ్డాయని సమాచారం. అలాగే.. హైదరాబాద్‌‌ ప్రశాంతి హిల్స్‌‌లోని భీమ్ స్పేస్ కార్యాలయానికి వెళితే అక్కడ ఇషా ఇన్‌‌ఫ్రా పేరుతో బోర్డు ఉందని వివరించారు. ఆ కంపెనీ డైరెక్టర్లుగా సజ్జల భార్గవ రెడ్డి, మాజీ సీఎం జగన్ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో రూ.8 కోట్లు పెట్టుబడగా అవి నావే అని ప్రద్యుమ్న క్లెయిమ్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ నేత విజయానందరెడ్డి ఇళ్లు, కంపెనీల్లో సిట్ తనిఖీలు నిర్వహించింది. చిత్తూరు బీవీరెడ్డి కాలనీలో సిట్ బృందం తనిఖీలు చేశారు. చిత్తూరు నలందా నగర్‌లోని నిఖిలానంద అపార్టుమెంట్‌లో తనిఖీలు చేశారు. 2024లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన విజయానందరెడ్డిని రెండ్రోజుల క్రితం విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపినట్లు సమాచారం. విజయానందరెడ్డి ఇంటి అడ్రస్సుతో సీబీఆర్ ఇన్‌‌ఫ్రా కంపెనీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. విజయానందరెడ్డి ఇంటి అడ్రస్సులో సీబీఆర్ ఇన్‌‌ఫ్రా ఉండటంపై సిట్ విచారణకు చిత్తూరుకు వచ్చింది. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో చెవిరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. తిరుపతిలోని చెవిరెడ్డి కార్యాలయంలోనూ సిట్ అధికారుల తనిఖీలు చేసినట్లుు సమాచారం. ఇటీవల మాజీ మంత్రి నారాయణస్వామి ఇంట్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి నారాయణస్వామి ఇచ్చిన సమాచారం మేరకు సిట్ చిత్తూరులో దాడులు నిర్వహించినట్లు తెలిసింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *