13, జూన్ 2024, గురువారం

రింగ్ రోగంతో భారీగా నష్టపోతున్న మామిడి రైతులు


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మామిడి రైతులు రింగురోగం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు.  ఈ రోగం కారణంగా మామిడికాయల తొడిమ వద్ద  రింగుగా ఏర్పడుతుంది. అల ఏర్పడి కయ కుల్లడం ప్రారంభం అవుతుంది.  రింగురాగా ఉబ్బెత్తుగా వచ్చి కాయ పక్వానికి రాకముందే రాలిపోతుంది. ఇలా పెద్ద సైజు అంటే, కిలో, ముప్పావు కిలో బరువు ఉన్న మామిడికాయలు రింగురోగంతో నేలపాలవుతున్నాయి. ఈ కాయలు పక్వానికి రాకముందే ఇలా రింగ్ రోగంతో మామిడి నేలపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నేలపాలైన ఈ మామిడిని వ్యాపారస్తులు, మామిడి ఫ్యాక్టరీలు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. రింగ్ రోగ నివారణకు మందులు కూడా లేకపోవడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 


జిల్లాలో సుమారుగా లక్షా, 5వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇందులో 20వేల ఎకరాలు లేత తోటలు కాగా  లక్ష యాభై వేల ఎకరాల్లో కాపు వస్తుంది. జిల్లాలో సగటున 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్చిఉంది. అయితే పూత రాకపోవడంతో 10 శాతం పంట వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  సగటున జిల్లాలో సంవత్సరానికి 5 లక్షల టన్నుల మామిడి దిగిబడి రావల్చి ఉండగా, ఈ సంవత్సరం ఒకటి లేక రెండు లక్షల తన్నులు దిగుబడి రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటేవల కురిచిన అకాల వర్షం, ఎదురు గాలుల కారణంగా, పంట చాలా వరకు వేలరాలింది. ఈ సారి మామిడి పంట అంతంతమాత్రమే. అందులో గాలి, వనాల కారణంగా సగం పంట పక్యానికి రక ముందే నేలపయ్యింది. ఈ కాయలు కిలో నాలుగు నుండి అయిదు వరకు వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మామిడి కాయలకు కారణంగా రైతులు భారీగా నష్టపోతున్నారు.  ఈ విషయమై ఉద్యానవన శాఖ అధికారులు మాట్లాడుతూ మామిడి కాయ తొడిమ దగ్గర రింగు లాగా ఏర్పడి, కాయ రాలిపోవడాన్ని రింగ్ అని పిలుస్తున్నామన్నారు. ఈ రింగ్ రోగం వాతావరణంలో మార్పులు, అధిక నీరు కారణంగా వస్తుందని తెలిపారు. దీని నివారణకు ఎటువంటి మందులు లేవన్నారు. ఇది రోగం లేక వైరస్  కాదన్నారు. ఈ పర్యాయం మామిడి దిగుబడి బాగా తగ్గిందని, చెట్టుకు తక్కువ కాయలు మాత్రమే ఉన్నాయన్నారు. ఉన్న కాయలు బాగా లావు కావడంతో ఈ కాయలలో రింగ్ రోగం వస్తుందన్నారు. మచ్చలా వచ్చి, రింగులా ఏర్పడి కాయ నేలపాలవుతుందని వివరించారు. నీళ్లు అధికంగా కట్టడం కారణంగా కూడా కాయ పరిమాణం పెరిగి, రింగు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇందుకు ఇలాంటి మందులు లేవని, కావున రైతులు కాయలు పక్వానికి రాగానే, వెంటనే కోసి అమ్ముకోవాల్సిందిగా సలహా ఇచ్చారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *