13, జూన్ 2024, గురువారం

బదిలీలతో నిర్వీర్యం అయిన చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయం

అయిదు సూపరిండెంట్ పోస్టులు ఖాళీ

20 మంది సిబ్బంది సస్పెండ్ ఏఓ, 

డిప్యూటీ సి ఇ ఓ పోస్టులు కూడా ఖాళీ 

సర్వం తానై వ్యవహరించిన ప్రభాకర్ రెడ్డి 



ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 


చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఇదివరకు సిఇఓగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి నిర్వీర్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి సీఈవోగా ఉన్న సమయంలో జిల్లా పరిషత్ లోని సగం మంది సిబ్బందిని బదిలీల మీద జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వెలుపలికి పంపించారు. ఆ ఖాళీ స్థానాలను భర్తీ చేయలేదు. సుమారు 20 మంది సిబ్బందిని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని, వారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినవారు తిరిగి కోర్టుకు వెళ్లి నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని తిరిగి పోస్టింగ్ ఇచ్చుకున్నారు. ఇలా జిల్లా పరిషత్ ప్రధాన కార్యాలయం నిర్వీర్యం అయిందని పలువురు ఆవేదన చెందుతున్నారు.


 చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో పదిమంది సూపరిండెంట్లు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం అయిదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. అయిదు సూపర్డెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్టాబ్లిష్మెంట్ ప్లానింగ్ అకౌంట్స్ విభాగాలకు ముగ్గురు సూపరిండెంట్లు ఉండాల్సి ఉండగా, ఒకరు మాత్రమే విధులను నిర్వహిస్తున్నారు. ఎస్టాబ్లిష్మెంట్లో ఇద్దరు సూపరిండెంట్లు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. ఎడ్యుకేషన్ విభాగం సూపరిండెంట్ పోస్టు ఖాళీగా ఉంది. ఫెయిల్ కాపీ విభాగంలో మాత్రం సూపరిండెంట్ ఉన్నారు. పిఎఫ్ విభాగంలో ఇద్దరు సూపరిండెంట్లు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే ఉన్నారు. అలాగే జిల్లా పరిషత్తులో అకౌంట్ ఆఫీసర్, డిప్యూటీ సీఇఓ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. వాస్తవంగా బైరెడ్డిపల్లి ఎంపీడీవో గా పని చేస్తున్న ప్రభాకర్ రెడ్డి అప్పట్లో జిల్లా మంత్రి ప్రాపకంతో సీనియార్టీ లేకపోయినా సీఈవో పోస్టును అధిష్టించారు. ఆయన తన కింద కూడా ఒకటి రెండు స్థానాలలో అధికారులు ఎవరూ లేకుండా జాగ్రత్త పడ్డారు. జిల్లా పరిషత్ అకౌంట్స్ ఆఫీసర్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో పోస్టులను కూడా తానే నిర్వహించారు. ఒక మాటలో చెప్పాలంటే జిల్లా పరిషత్ మొత్తాన్ని మీద ఏక చక్రాధిపత్యంగా పరిపాలన చేశారు. ఆయన మాటకు అడ్డు చెప్పిన, ఆయనకు గిట్టని సూపరిండెంట్లులను తమిళనాడు, కర్ణాటక, అనంతపురం జిల్లాల సరిహద్దులకు బదిలీ చేశారు. చిన్న చిన్న పొరబాట్లుకు కూడా సిబ్బందిని సస్పెండ్ చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే జిల్లా పరిషత్తులు ఆటవిక పాలన కొనసాగింది. ప్రశ్నించేవారు లేకపోవడంతో జిల్లా పరిషత్ నిర్విర్యంగా మారింది. అవినీతి, అక్రమాలకు నిలయంగా తయారయింది. అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులు ఒత్తుతూ, నియమ నిబంధనలను తుంగలో తొక్కి,  నిధుల మళ్లింపు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ జరిగితే పలు ఆసక్తికర విషయాలు తెలుగులోకి వస్తాయని ప్రభాకర్ రెడ్డి భాదితులు భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *