4, జూన్ 2024, మంగళవారం

చంద్రబాబుకు జై కొట్టిన చిత్తూరు జిల్లా

 6 శాసన సభా స్థానాలను కైవసం చేస్తున్న టిడిపి 

భారీ మెజారిటీతో ఎంపి అభ్యర్థి దగ్గుమల్ల విజయం 

8వ సారి కుప్పం నుండి చంద్రబాబు విజయకేతనం 

మూడవ సారి పలమనేరు నుండి అమరనాధ రెడ్డి విజయం 

చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు అభ్యర్థుల తొలి విజయం 

పుంగనూరులో పెద్ది రెడ్డి నాలుగో సారి గెలుపు 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు 


సార్వత్రిక ఎన్నికలలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జై కొట్టింది మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో చిత్తూరు జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలను, ఒక పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. పుంగనూరు అసెంబ్లీ స్థానంలో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరసగా నాలుగో పర్యాయం విజయం సాధించారు. మిగిలిన కుప్పం, పలమనేరు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, నగరి, పూతలపట్టు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించింది. ఈ పర్యాయం నలుగురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేల హోదాలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. అలాగే చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు కూడా మొట్టమొదటిసారిగా విజయం సాధించి, పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు


కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు  8వ సారి విజయం సాధించారు. అయన 9వ తేదిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వికరం చేయనున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు ఓడించడానికి శత  విధాల ప్రయత్నం చేశారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గ బాధ్యతలను తీసుకొని, అక్కడే ఉంటూ చంద్రబాబు నాయుడును విజయపథంలో నడిపించడానికి సహకరించారు. లక్ష ఓట్ల మెజారిటీ ధ్యేయంగా పార్టీ శ్రేణులు పనిచేశారు. యువగళం పాదయాత్రను కుప్పం నుండి ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ పాల్గొని బలప్రదర్శన చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ప్రచారంలో పాల్గొన్నారు, మొట్టమొదటి సరిగా చంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.


 పలమనేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి రెండవ పర్యాయం విజయం సాధించారు. అమరనాధ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే వెంకటే గౌడ తలపడ్డారు. వెంకటే గౌడ మీద పలు అవినీతి ఆరోపణలు ఉండడం కారణంగా తెలుగుదేశం పార్టీకి విజయం సులభమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వైసిపిలో వర్గ పోరు కారణంగా కొంతమంది నాయకులు సహాయనీరాకరణ చేయడం తెలుగుదేశం పార్టీకి లాబించినట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి గత రెండు మూడు సంవత్సరాలుగా పల్లె పల్లె తిరుగుతూ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. స్వయంకృషితో ఆయన విజయం సాధించారు. మరో మరు అమరనాధ రెడ్డి మంత్రి కావడం తధ్యమని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. 


చిత్తూరు నియోజకవర్గంలో నుంచి టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు మొట్టమదటి సరిగా విజయం సాధించారు. గురుజాల  వైసిపి అభ్యర్థి విజయానందరెడ్డితో తలపడ్డారు. ఇరువులు సర్వశక్తులు వడ్డీ విజయం సాధించడానికి ప్రయత్నం చేశారు. విజయానంద రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా పగడ్బందీగా పథకం ప్రకారం గెలుపునకు పావులు కలుపుతూ వచ్చారు. దానధర్మాలు చేయడంలో అందివేసిన చేయి అనిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కొత్తగా రంగప్రవేశం చేసిన గురిజాల జగన్మోహన్ నాయుడు ఆర్థికంగా పరిపుష్టి కలగడంతో విజయానంద రెడ్డికి దిటుగా దానధర్మాలతో ఢీకొనే ప్రయత్నం చేశారు. ఆయనకు తోడుగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మరో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ, మున్సిపల్ మాజీ మేయర్ కటారి హేమలత పూర్తిస్థాయిలో సహకరించారు. తానే అభ్యర్థి అన్న విధంగా వారు ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.అలాగే బిజెపి, జనసేన నాయకులు కూడా పూర్తిస్థాయిలో సహకరించారు. దీంతో చిత్తూరులో గురుజాల  విజయకేతనం ఎగురవేశారు. 


 నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మారుడు గాలి భాను ప్రకాష్ ఓడించి, మొదటి సరిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఇరువురూ హోరాహోరీగా మరో మారు తలబడ్డారు. గత ఎన్నికల్లో భాను ప్రకాష్ స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఓటమిని విజయానికి సోపానంగా మలుచుకొని ఈ పర్యాయం టిడిపి జెండాను నగరిలో ఎగురవేయడానికి ప్రయత్నం చేశారు. ఆయనకు తోడుగా రోజాకు అసమ్మతి  నేతలు కలిశారు.  శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఆయన అనుచరులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. రోజా మీద ఉన్న ఆరోపణలు వ్యక్తిగతంగా ఆమె మీద ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదం పడింది.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఏర్పడిన నాటినండి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు. మొట్టమొదటిసారిగా చెన్నైకి చెందిన సంతాన సాఫల్య వైద్యుడు డాక్టర్ ఎం వి థామస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నుంచి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించి, మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆయనను తెలుగుదేశం పార్టీ అధినేత సరిగ్గా ఏడాది కిందట గంగాధర నెల్లూరు టిడిపి ఇన్చార్జిగా నియమించారు. ఆయన ఆనాటి నుంచి నేటి వరకు విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఆయనకు మరొక టిడిపి నేత చిట్టిబాబు పూర్తి సహాయ సహకారాలను అందించారు. అలాగే జనసేన పార్టీకి చెందిన పొన్న యుగంధర్ కూడా పూర్తిస్థాయిలో సహకరించారు. కొత్త వ్యక్తిని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంతో నియోజకవర్గానికి చెందిన పలువురు మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు సహాయ నిరాకరణ చేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో థామస్ నియోజకవర్గ మొత్తం తిరుగుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. తనదైన శైలిలో నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకొని మొట్టమొదటిసారిగా గంగాధర నెల్లూరు నుంచి విజయం సాధించి రికార్డు సృష్టించారు.


పాత్రికేయుడుగా జీవితాన్ని ప్రారంభించిన మురళీమోహన్ ప్రజాప్రతినిధిగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆయన పూతలపట్టు నియిజకవర్గం తరపున  ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించనున్నారు. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత వరుసగా మూడుసార్లు తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైంది. దీంతో చంద్రబాబు నాయుడు పాత్రికేయుడుగా తిరుపతిలో పనిచేస్తున్న డాక్టర్ కే మురళీమోహన్ ను పూతలపట్టు నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జిగా ఏడాది కిందట నియమించారు. ఆనాటి నుంచి ఆయన నిరంతరంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరి మన్ననలను చూరగొన్నారు. అందరి నాయకులను కలుపుకొని తన విజయానికి సోపానాలు వేసుకున్నారు. అందుకు తోడు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కూడా పూతలపట్టు నియోజకవర్గం లో పర్యటించి మురళీమోహన్ విజయానికి దోహదం చేశారు. పాత్రికేయుడుగా ఉండి రాజకీయాల్లో ప్రవేశించి మొట్టమొదటిసారిగా మురళి మోహన్ విజయం సాధించడం విశేశం.


 పుంగనూరునుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగవ పర్యాయం విజయం సాధించారు. తొలుత సగం ఓట్ల లెక్కింపు వరకు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెనుకబడ్డారు. అనంతరం అయన లీడింగ్ లోకి వచ్చారు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరో  ఆయన విజయానికి దోహదం చేశాయి. గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరదలు అనీషా రెడ్డి వైసీపీలో చేరడం కూడా కలిసి వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టారని, ఎన్నికల్లో సరైన విధంగా డబ్బులను కూడా పంపిణీ చేయలేదన్న విమర్శలు ఉన్నా, తొలుత చల్ల బాబు విజయపధంలో దూసుకుపోయారు. సగం ఓట్ల లెక్కింపు నుండి వెనుకపడ్డారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *