17, జూన్ 2024, సోమవారం

పత్తా లేని ఫైర్ బ్రాండ్ రోజా

!

పదునైన విమర్శలతో తెలుగుదేశం, జనసేన నాయకులను నిత్యం ఇబ్బంది పెట్టే మాజీ మంత్రి రోజా గొంతు ఈ మధ్య వినిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుండి ఆమె ఎక్కడ నోరు విప్పలేదు. పత్రికా విలేఖరులతో మాట్లాడలేదు. చిత్తూరు ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చిన రోజా పూర్తి ఫలితాలు వెలువడకుండానే మధ్యలో వెళ్లిపోయారు.ఆనాటి నుండి మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. తాను అధికారంలో ఉన్నప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే వారు. దీనితో పెద్ద నాయకులు వద్దన్నా ఆమెకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు. స్వంత నియోజక వర్గంలో పలువురు అడ్డు పడినా తిరిగి పార్టీ అభ్యర్థిగా పోటీ పెట్టారు. ఎవరు కాదన్నా తాను మూడవ సారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని సవాలు విసిరారు. అయితే తాజా ఎన్నికల్లో ఆమె టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆమె కేవలం 2708 ఓట్ల మెజారిటీ గాలి భాను ప్రకాష్ పై, 2014 లో గాలి ముద్దు కృష్ణమ నాయుడు పై 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావడంతో  జగన్ ఆమెకు ఏపీఐఐసి చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. రెండున్నర సంవత్సరాల తరువాత పర్యాటక, క్రీడా శాఖ మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆమె కుటుంబ సభ్యులకు అధికారం కట్టబెట్టిన కార్యకర్తలను విస్మరించారన్న ఆరోపణలకు గురయ్యారు. పార్టీలో కీలకమైన నేతలు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కె జె కుమార్, కె జె శాంతి, మురళీ రెడ్డి తదితరులు ప్రత్యక్షంగా ఆమెను వ్యతిరేకించారు. కొందరు ఎన్నికల సమయంలో టిడిపిలో చేరారు. ఆమె ఓటమి పాలైన తరువాత క్రీడా శాఖలో 100 కోట్ల స్క్యాం జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆమె ఇప్పటి వరకు నియోజక వర్గంలో కనిపించడం లేదు. మీడియా ముందుకు రావడం లేదు. ఈ లోపు రోజా మీద నిధుల దుర్వినియోగం కేసు కూడా నమోదు అయ్యింది. అతాడుదాం ఆంధ్ర  పేరుతో నిర్వహించిన ఆటల పోటీల్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని సీఐడీ పోలీసులు కేసును నమోదు చేశారు. విశాఖ రుషికొండ మీద నిర్మించిన అత్యంత విలాసవంతంగా నిర్మించిన భవనాలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రోజా కేసులకు భయపడుతున్నారా లేక వ్యూహాత్మకంగా కొన్నాళ్ళు సైలెంట్ గా ఉంటారా అర్థం కావడం లేదు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *