14, జూన్ 2024, శుక్రవారం

మైనారిటీ కార్పొరేషన్ ఇడిగా అవతారం ఎత్తిన జడ్పి మాజీ సీఇఓ


జిల్లా పరిషత్ లోనే కొనసాగడానికి విఫల ప్రయత్నం 

లిఖిత పూర్వకంగా ఆదేశాలు కావాలన్నా నుతన సీఇఓ

మాజీ మంత్రి అండతో మైనారిటీ కార్పొరేషన్ ఇడిగా భాధ్యతలు

ఇడిగా ఉండిన హరినాధ రెడ్డిని సెలవులో పంపిన కలెక్టర్  

తక్షణం కలెక్టరేట్ నుండి సగానంపాలన్న టిడిపి నేతలు 

ఎట్టికేలకు ప్రభాకర్ రెడ్డిని సాగనంపిన కలెక్టర్ 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

ఆరోపణలు ఎదురుకుంటున్న జిల్లా పరిషత్తు మాజీ సీ ఇ ఓ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల నియమావళి మేరకు జిల్లా పరిషత్ సీఈఓ గా వైతోలగవలసి వచ్చింది. దీంతో లాయన తన పలుకుబడిని మరో మారు ఉపయోగించి జిల్లా మైనార్టీ కార్పొరేషన్ గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జిల్లా కలెక్టరేట్ లో   పోస్టింగ్ వేపించుకున్నారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి ద్వారా జిల్లా కలెక్టర్ కు చెప్పించి మైనార్టీ కార్పొరేషన్ ఈడిగా ఉండిన హరినాథ్ రెడ్డిని సెలవు మీద పంపి, ప్రభాకర్ రెడ్డి ఆయన స్థానంలో కూర్చున్నారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారినా, ప్రభాకర్ రెడ్డి మైనార్టీ కార్పొరేషన్ పదవి నుండి వైదొలగడానికి సుముకత వ్యక్తం చేయలేదు. దీంతో ఆయన ఇప్పటివరకు మైనార్టీ కార్పొరేషన్ ఇది గానే కొనసాగుతున్నారు. ఈ విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ ను సంప్రదించారు. ప్రభాకర్ రెడ్డిని వెంటనే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వెలుపలికి పంపవలసిందిగా కోరారు. లేకుంటే తాము నేరుగా వచ్చి జోక్యం చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం మైనార్టీ కార్పొరేషన్ ఈడీగా ఉన్న ప్రభాకర్ రెడ్డిని రిలివ్ కావాల్సిందిగా ఆదేశించారు. ఇదివరకు ఇ డిగా పని చేస్తూ, సెలవులో వెళ్ళిన హరినాథ్ రెడ్డికి తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తన బాధ్యతలను స్వీకరించారు. 


ఎన్నికల నియమావళి మేరకు ఐదు సంవత్సరాలుగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులందరికీ స్థానాచలనం కలిగింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పరిషత్ కు సీఈవోగా గ్లోరియాను నియమించారు. ఆమె చిత్తూరు జిల్లా పరిషత్ సీఈవోగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆమె సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభాకర్ రెడ్డి డిప్యూటీ సీఇఓగా ఇక్కడే కొనసాగడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆయనను డిప్యూటీ సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం మంచిగానీ, జిల్లా కలెక్టర్ నుంచి గాని ఆదేశాలు లిఖిత పూర్వకంగా లేవు. దీంతో ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్తులో కొనసాగడానికి వీలులేదని నూతన సీఈవో స్పష్టం చేశారు. మళ్లీ మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో జిల్లా కలెక్టర్ ను సంప్రదించారు. ఆయన మైనార్టీ కార్పొరేషన్ ఈడీగా ఉండిన హరినాధ రెడ్డిని సెలవు మీద పంపి, ప్రభాకర్ రెడ్డిని ఆస్థానంలో నియమించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభాకర్ రెడ్డిని తిరిగి బైరెడ్డిపల్లి ఎంపీడీవో గా పంపుతారని భావించారు. అయితే ప్రభాకర్ రెడ్డి ఈనెలాఖరులో పదవి విరమణ చేయనున్నారు. అప్పటివరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ కార్పొరేషన్ ఈడీగా కొనసాగించడానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు, నేతలు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ను ప్రశించారు.  ప్రభాకర్ రెడ్డిని పూర్వ స్థానానికి పంపాల్సిందిగా కోరారు. లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం వచ్చి, జోక్యం చేసుకోవాల్సి   ఉంటుందని అన్నట్లు సమాచారం.. దీంతో వెంటనే ప్రభాకర్ రెడ్డి మైనార్టీ కార్పొరేషన్ ఈడీగా రిలివ్ కావాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇదివరకు ఇడిగా పని చేసిన హరినాథ్ రెడ్డిని తిరిగి భాధ్యతలు స్వీకరించవలసిందిగా ఆదేశించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం  జిల్లా మైనార్టీ కార్పొరేషన్ ఇడిగా తిరిగి హరినాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *