24, జూన్ 2024, సోమవారం

తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నలుగురు ఎమ్మెల్యేలు

9వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

ఏడవ సారి ప్రాణ స్వీకారం చేసిన పెద్దిరెడ్డి 

అయిదో సారి ప్రమాణ స్వీకారం చేసిన అమరనాధ రెడ్డి 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు శాసనసభ్యులు శుక్రవారం అమరావతి అసెంబ్లీలో మొట్టమొదటి సరిగా అడుగుపెట్టారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబునాయుడు తొమ్మిదవ పర్యాయం ప్రమాణస్వీకారం చేశారు. మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడవ పర్యాయం ప్రమాణ స్వీకారం చేయగా, మరో మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యుడు అమరనాధ రెడ్డి ఐదవ పర్యాయం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, నగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు శాసనసభ్యులకు ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా, మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం విశేషం. నగిరి శాసనసభ్యులు రెండవ పర్యాయం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు.


నారా  చంద్రబాబు నాయుడు 9వ పర్యాయం శాసనసభ్యుడిగా శుక్రవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా నాలుగో పర్యాయం పదవి బాధ్యతలను చేపట్టారు. 1975లో యువజన కాంగ్రెస్ లో చేరిన నారా చంద్రబాబు నాయుడు 1978 ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి, అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, టెక్నికల్ ఎడ్యుకేషన్, మైనర్ ఇరిగేషన్ శాఖల మంత్రిగా పనిచేశారు. 28 సంవత్సరాల చిన్న వయసులో మంత్రిగా పనిచేసే రికార్డు సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి వెంకటరమణ నాయుడు చేతుల్లో ఓడిపోయారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి, తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా పనిచేశారు. 1984లో నాదేండ్ల భాస్కరరావు రామారావుకి వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎన్టీ రామారావు అండ దండగా ఉండి ఆయన ప్రభుత్వాన్ని తిరిగి నెలకొల్పటంలో విశేషమైన కృషి చేశారు. 1989 ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన రెండవ గా ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి వరుసగా 8 పర్యాయాలు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. చంద్రబాబు నాయుడు 1995,1999, 2014 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా పనిచేసే, మళ్లీ ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ప్రతి బాధ్యతలు స్వీకరించారు.

పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి  ఏడవ సారి  ఎమ్మెల్యేగా ప్రమాణస్వికారం చేశారు,  ఆయన పీలేరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు, పుంగనూరు నుంచి మరో నాలుగు పర్యాయాలు గెలిచారు. 1999 నుంచి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గాలలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2013లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలలో పుంగనూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది,  జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గనులు,, భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల శాఖ బాధ్యతలు కూడా జగన్ రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన 1974లో  తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో చదువుతూ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 1985,1994 ఎన్నికల్లో  కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 1999 తరువాత వరస విజయాలతో విజయకేతనం ఎగురవేస్తున్నారు.పుంగనూరు నుండి నాలుగో పర్యాయం పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

పలమనేరు ఎమ్మెల్యే అమర్నధరేద్ది ఐదవ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయన   పలమనేరు నియోజకవర్గం నుండి మూడు సార్లు, పుంగనూరు నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో జరిగిన పుంగనూరు ఉప ఎన్నికలలో టిడిపి తరఫున అమరనాధ రెడ్డి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి చేతిలో  ఓటమిపాలైనా,  2004లో తిరిగి పుంగనూరు నియోజకవర్గం నుండి టిడిపి ఎం ఎల్ ఏ గా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత 2009లో పలమనేరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా సాధించారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అమర్నాథరెడ్డి 2014 ఎన్నికలలో పలమనేరు నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా  విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినా 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరి  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికలలో వీచిన వైసిపి గాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటే గౌడ చేతిలో అమర్నాథ్ రెడ్డి ఓడిపోయినా, ఈ ఎన్నికలలో విజయం సాధించారు. 

శుక్రవారం శాసనసభలో ప్రమాణస్వీకారం చేసిన చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు శాసనసభ్యులకు ఎలాంటి అపూర్వ రాజకీయ అనుభవం లేదు. రాజకీయ వారసత్వం కూడా లేకాదు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధించి రికార్డు సృష్టించారు. గుడిపాల మండలానికి చెందిన జగన్మోహన్ నాయుడు బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం చేస్తూ, ఎన్నికలకు ఆరు నెలల ముందుగా చిత్తూరులో అడుగుపెట్టి తనదైన శైలిలో సేవ, అభివృద్ధి కార్యక్రమాలతో  పార్టీ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించి అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ను ఇచ్చింది. మొట్టమొదటిసారిగాని ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడిగి పెట్టారు. అలాగే పూతలపట్టుకు చెందిన మురళీమోహన్ పాత్రికేయుడిగా పనిచేస్తూ రాజకీయ రంగంలో అడుగు పెట్టారు. ఏడాది కిందట ఆయనను పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జిగా ప్రకటించారు. ఆనాటి నుంచి ప్రజలతో మమేకమై, ప్రజలలో కలిసి పోయారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల ఆదారాభిమానులను చురకొన్నారు. పోటీ చేసిన మొట్టమొదటిసారే నెగ్గి,  అసెంబ్లీలో అడుగు పెట్టారు. 

గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుండి డాక్టర్ థామస్ కూడా మొట్టమొదటిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన చెన్నైలో సంతాన సఫల్య కేంద్రాన్ని నడుపుతున్నారు. ఆయనను ఏడాది కిందట నారా చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. ఆనాటి నుంచి నిత్య ప్రజలతో మమేకమై అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయన కూడా శుక్రవారం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. గాలి భాను ప్రకాష్కు మతమే రాజకీయ నేపథ్యం ఉన్నది. ఆయన గతంలో కూడా నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రోజా మీద స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడైన గాలి భాను ప్రకాష్ ఆయన మరణానంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మొదటి పర్యాయం ఎమ్మెల్యేగా పరాజయం పాలైన పట్టుదలతో రెండవ పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *