28, జూన్ 2024, శుక్రవారం

జడ్పి మాజీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్


పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ

ఫలించిన టిడిపి నేతల మంత్రాంగం 

సస్పెండ్ చేసి విచారణకు ఆదేశాలు 

జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట సిబ్బంది సంబరాలు 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు జిల్లా పరిషత్ సీఈఓ గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయనను సస్పెండ్ చేసి, విచారణను జరిపించనున్నారు. ఈ మేరకు విజయవాడ నుంచి గురువారం రాత్రి ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా పరిషత్ కార్యాలయం ముందు సిబ్బంది టపాసులు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. మిటాయిలు  పంచుకున్నారు.


జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి మీద పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.  టిడిపి మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టిడిపి నేతలు చంద్ర ప్రకాష్, రమేష్ నాయుడు, చంద్రగిరి, తిరుపతి శాసనసభ్యులు,  పలువురు నేతలు ఫిర్యాదులు చేశారు. అలాగే పంచాయతీ రాజ్ అసోసియేషన్ తరపున, పదవీ విరమణ చేసిన జిల్లా పరిషత్ సిబ్బంది కూడా ఫిర్యాదు చేశారు. వీటి మీద విచారణ అధికారిగా జిల్లా ఆడిట్ అధికారిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే జిల్లా పరిషత్ సీఈవో గ్లోరియా కూడా ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గా పని చేసిన షన్మోహన్ కూడా స్వతంత్రంగా విచారణ జరిపి ఒక నివేదికను తెప్పించుకున్నారు. వీటన్నిటిమీద ఆయనను సస్పెండ్ చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చారు. ప్రభాకర్ రెడ్డి మరో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణకు ముందే సస్పెండ్ చేయాలని తెలుగుదేశం నాయకులు గట్టి పట్టుదలతో కృషి చేశారు. తమకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో టిడిపి నాయకులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్ సిబ్బంది జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. 


జిల్లా పరిషత్ కార్యాలయంలో  4.65 లక్షల రూపాయల వ్యయంతో సీసీ కెమెరాలు బిగించారు. ఈ కెమెరాల లింకులను జిల్లా పరిషత్ సీఈఓ గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి, చైర్మన్ సిసిగా పనిచేసిన సురేంద్ర రెడ్డి ఫోన్ లకు కనెక్ట్ చేసుకున్నారు. దీనిని  సిబ్బందిని వేధించడానికి మాత్రమే ఉపయోగించారని విమర్శలు ఉన్నాయి. జిల్లా పరిషత్ క్వార్టర్స్ మరమ్మత్తు చేయడానికి మూడు విడుదలగా 15 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ బిల్లులను పంచాయతీరాజ్ అధికారులకు విడుదల చేసినా, వాస్తవంగా జిల్లా పరిషత్ క్వార్టర్స్ ను మరమ్మతు చేయలేదని జిల్లా పరిషత్ సీఈవో విచారణలో తేలింది.  మరమ్మతులు చేయకండి నిధులను సహా చేసినట్లు సీఈఓ తన నివేదికలో అందజేశారు. అలాగే జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్, స్థాయి సంఘాల సమావేశంలో భారీగా నిధులను పరిమితికి మించి టీ, బిస్కెట్లకు వ్యయం చేసినట్లు బిల్లులు తాయారు చేశారని కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయంలో విచారణ చేయగా పరిమితికి మించి  నిధులను వ్యయం చేశారని తేలింది. జిల్లా పరిషత్ కు సీఈఓ కు రెండు వాహనాలు ఉండగా టయోటా వాహనాన్ని అద్దెకి తీసుకున్నట్లు, దానికి అద్దె చెల్లించినట్లు  బిల్లులను తయారుచేసి నిధులను స్వాహాచేశారు. వాస్తవంగా  జిల్లా పరిషత్ కి సంబంధించిన రెండు కార్లు ఉన్నాయని, కొత్తగా కారు అద్దెకు తిసుకోవల్చిన అవసరం లేదని  జిల్లా పరిషత్ సీఈవో తమ నివేదికలో పాల్గొన్నారు. ప్రభాకర్ రెడ్డి సొంత వాహనమైన టయోటా ఇన్నోవా ను వినియోగించుకుని, దానికి అద్దె చెల్లించినట్లు బిల్లులు తయారు చేసి స్వాహా చేశారని ఆమె పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదుదారులు వేచి ఉండడానికి గది నిర్మానానికి జిల్లా పరిషత్ లో నుంచి 3. 35 లక్షల రూపాయలను మంజూరు చేశారు. వాస్తవంగా జిల్లా పరిషత్ నిధులను గ్రామీణ ప్రాంతాలలో వ్యయం చేయాల్సి ఉంది. చిత్తూరు మున్సిపాలిటీలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన మున్సిపాలిటీ నిధులతో చేయాలి. కావున నిబంధనలకు వ్యతిరేకంగా 3.35 లక్షల రూపాయలను వ్యయం చేశారని తేలింది. జిల్లా పరిషత్ కు నూతనంగా కారు  కొనుగోలు చేయకపోయినా, కొనుగోలు చేసినట్లుగా రికార్డులు సృష్టించి నిధులను స్వాహా చేశారని తేలింది. చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 15 ఆర్థిక సంఘం నిధులను కేవలం పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాలకు మాత్రమే  వ్యయం చేశారు. ఈ నియోజకవర్గాల్లో 1224 పనులకు 78 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ప్రభాకర్ రెడ్డి ప్లానింగ్ టూ సూపర్డెంట్ గా ఉండగా ఆర్థిక సంఘం నిధులను, బిఆర్జిఎఫ్ నిబంధనలు నిబంధనలకు వ్యతిరేకంగా పిడి అకౌంట్ నుండి సేవింగ్ అకౌంట్ కు బదిలీ చేసి, ఆ వచ్చిన వడ్డీని  దుర్వినియోగం చేశారని ఆరోపణల మీద జిల్లా ఆడిట్ అధికారులు నివేదికను తయారు చేశారు. ఈ నివేదికలు నిధుల నిబంధనలకు వ్యతిరేకంగా పిడి అకౌంటు నుంచి సేవింగ్ అకౌంట్ కు మళ్ళించారని, సుమారు 10 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని నివేదిక ఇచ్చినట్లు తేలిసింది. జిల్లా పరిషత్ లో పనిచేసిన పలువురు సిబ్బందిని, అధికారులను వేధించారని, వారికి సెలవలు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం, ఇంక్రిమెంట్లను నిలుపుదల చేయడం,  జీతాలను నిలుపుదల చేయడం, సెలవులు మంజూరు చేయకపోవడం వంటి పను విధాలుగా వేధించారని జిల్లా పరిషత్ సీఈఓ అందజేసిన నివేదికలో తెలిపారు. చిన్న చిన్న విషయాలకి సస్పెన్షన్ను వంటి పనిష్మెంట్లు ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలియజేశారు. జిల్లా పరిషత్ ఉద్యోగస్తులైన గౌస్ బాష, రమేష్ బాబు, చంద్రశేఖర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు మధుసూదన్ కుమార్, పవన్ కుమార్, చంద్రశేఖర్, సతీష్ కుమార్ సిబ్బందిని అనవసరంగా పలు రకాలుగా ఇబ్బంది పెట్టారని, వారిని బదిలీ చేసి జీతాలు నిలుపుదల చేసి వేధించారని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి వేధింపులు తాళలేక జూనియర్ అసిస్టెంట్ వాసుదేవన్, సీనియర్ అసిస్టెంట్ పురుషోత్తం, కెనడి బాబు, సత్యవేడు ఎంపీడీవో బాల గణేష్, గుడిపల్లి ఎంపీడీవో శ్రీనివాస్ మృతి చెందారని, వారిని పలు రకాలుగా వేధించి, పోస్టింగ్ ఇవ్వకుండా, జీతాలను నిలుపుదల చేసి వేధించడం వల్ల వాళ్లు చనిపోయారని తెలియజేశారు. బైరెడ్డిపల్లి ఎంపీడీవో గా పనిచేస్తూ జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి నిబంధనలకు వ్యతిరేకంగా తన పెన్షన్ ప్రతిపాదనలను తానే ప్రభుత్వానికి పంపారని నివేదించారు. అలాగే ముందుగా అనుమతి లేకుండా ప్రభాకర్ రెడ్డి రెండు వారాలపాటు  సెలవులోలో వెళ్లారని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో జిల్లా పరిషత్ సీఈఓ గ్లోరియా పేర్కొన్నారు. ఇవి కాకుండా జిల్లా పరిషత్తులో కాంట్రాక్టు బిల్లులను వైసీపీ పార్టీ వారికి మాత్రమే చెల్లించాలని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించారని ఫిర్యాదు చేశారు. జూనియర్ మోస్ట్ ఎంపీడీవో అయిన ప్రభాకర్ రెడ్డి రాజకీయ అండదండలతో జిల్లా పరిషత్ సీఈవోగా, డిప్యూటీ సీఎంగా, అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహించి సిబ్బందిని పలు రకాలుగా ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి మీద ఇప్పటికే పలు కోర్టులలో, లోకాయుక్తలో, సమాచార హక్కు చట్టం కింద కేసులు  నడుస్తున్నాయి. ఈ ఆరోపణల మీద పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆయన మీద పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *