కుప్పంలో 48 వేల ఓట్ల మెజారిటీతో చంద్రబాబు విజయం
నగరిలో 45 వేల ఓట్ల తేడాతో ఓడిన రోజా
పుంగనురులో 6 వేల ఓట్లతో గట్టెక్కిన పెద్దిరెడ్డి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 48,006 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు తర్వాత నగిరి నుంచి గాలి భాను ప్రకాష్ 45,006 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.. జిల్లాలో సర్వం తానై చక్రం తిప్పిన మంత్రి పెద్దిరెడ్డి 6,095 ఓట్లతో గట్టున పడ్డారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీని పదునైన విమర్శలతో ఇరుకున పెడుతున్న మరో మంత్రి ఆర్కే రోజా 45 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పుంగనూరు నుండి పోటి చేసిన బిసివై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రా యాదవ్ 4,559 ఓట్లు సాధించారు. పూతలపట్టు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసిన ఎం ఎల్ ఏ ఎం ఎస్ బాబు 2,820 ఓట్లతో సరిపెట్టుకున్నారు. చిత్తూరు జిల్లాలో గెలుపొందిన అభ్యర్థుల పొందిన ఓట్ల వివరాలు మెజారిటీ కింది విధంగా ఉన్నాయి
కుప్పం
నారా చంద్రబాబు నాయుడు టిడిపి 1,21,929
కే ఆర్ జే భరత్ వైసిపి 73,923
మెజారిటి 48,006
పలమనేరు
నూతనకాల్వ అమర్ నాధ రెడ్డి టిడిపి 1,23,232
వెంకటే గౌడ వైసిపి 1,03,110
మెజారిటి 20,122
చిత్తూరు
గురుజాల జగన్మోహన్ నాయుడు టిడిపి 88,066
విజయానంద రెడ్డి వైసిపి 73,462
మెజారిటి 14,604
గంగాధర నెల్లూరు
డాక్టర్ ఎం వి థామస్ టిడిపి 1,01,176
క్రుపాలక్ష్మి వైసిపి 75,165
మెజారిటి 26,011
పూతలపట్టు
కే మురళి మోహన్ టిడిపి 1,02,137
సునీల్ కుమార్ వైసిపి 86,503
మెజారిటి 15,634
నగరి
గాలి భానుప్రకాష్ టిడిపి 1,07,797
ఆర్ కే రోజా వైసిపి 62,793
మెజారిటీ 45,004
పుంగనూరు
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వైసిపి 1,00,793
చల్లా రామచంద్రా రెడ్డి టిడిపి 94,698
మెజారిటి 6,095