20, జూన్ 2024, గురువారం

ఎన్నికల రెమ్యూనరేషన్ కోసం ఎదురు చూపులు



ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయి నెలరోజులు పైగా అవుతున్న ఎన్నికలలో విధులను నిర్వహించిన అధికారులు, సిబ్బంది ఎన్నికల రెమ్యూనరేషన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రెమ్యూనికేషన్ జిల్లా అధికారులు విడుదల చేయాల్సి ఉంది. కావున జిల్లా అధికారిని అడిగే సాహసం ఎవరూ చేయడం లేదు. ఎన్నికల విధులలో పాల్గొన్న తమకు రావలసిన రెమ్యూనరేషన్ వస్తుందో రాదో అన్న ఆందోళనలో ఎన్నికల విధులను నిర్వహించిన అధికారులు, సిబ్బంది సతమతం అవుతున్నారు. 


జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ నుండి గెజిటెడ్ ఆఫీసర్లు ఎన్నికల డ్యూటీలను అప్పగించారు. చెక్ పోస్ట్ డ్యూటీలు. ఇతర డ్యూటీలు వేశారు. 20 మంది గెజిటెడ్ ఆఫీసర్లు ఒక బ్యాచ్  చొప్పున మూడు సిప్తులలో  అధికారులను నియమించారు.  సుమారు 60 మంది గెజిటెడ్  అధికారులు రెండు నెలల పాటు ఎన్నికల విధులను నిర్వహించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ విధులను విద్యాశాఖ సిబ్బంది నిర్వహించారు. సర్వ శిక్షా అభియాన్ కు చెందిన కాంట్రాక్ట్ ఆపరేటర్లు నెల రోజులు జిల్లా కేంద్రానికి వచ్చి, ఇక్కడ విధులను నిర్వహించారు. వారు డ్యూటీ నిర్వహించినందుకు మధ్యాహ్నం భోజనాన్ని మాత్రం అధికారులు ఏర్పాటు చేశారు. ఇలా 31 మండలాల నుంచి 62 మంది ఆపరేటర్లు పోస్టల్ బ్యాలెట్ విధులను నిర్వహించారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలోని ఎనిమిది మంది కాంటాక్ట్ సిబ్బంది కూడా పోస్టల్ బ్యాలెట్ విధులలో పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ వరకు వీరి సేవలను ఎన్నికల అధికారులు వినియోగించుకున్నారు. సర్వ శిక్ష అభియాన్ లోని కాంట్రాక్ట్ ఆపరేటర్లు జిల్లా నలుమూలల నుంచి తమ సొంత ఖర్చులతో జిల్లా కేంద్రానికి వచ్చి, ఇక్కడ వారికి అప్పగించిన విధులను నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి నెల రోజుల పైగా అవుతుంది. ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియలో అంటే,  పోలింగ్ సిబ్బందికి, కౌంటింగ్ సిబ్బందికి అందరికి అప్పుడే రెమ్యూనరేషన్ చెల్లించారు. జిల్లాలోని గెజిటెడ్ ఆఫీసర్లకు, సర్వ శిక్ష అభియాన్ లోని కాంట్రాక్ట్ ఆపరేటర్లకు, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని కాంటాక్ట్ ఆపరేటర్లకు ఇప్పటివరకు రెమ్యూనరేషన్ అందలేదు. నెలరోజులు పైబడుతున్న ఇంతవరకు వారి రెమ్యూనరేషన్ అందక పోవడంతో, తాము పడిన కష్టానికి ఫలితం దక్కుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని జిల్లా అధికారులను అడిగే ధైర్యం లేకుండా అటు గెజిటెడ్ అధికారులు, ఇటు విద్యాశాఖ కాంటాక్ట్ సిబ్బంది లోలోన ఆవేదనకు గురవుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *