28, సెప్టెంబర్ 2026, సోమవారం

నేటి నుండి చిత్తూరు జిల్లాలో పల్లె పండుగ 3 0 ప్రారంభం

నేటి నుండి చిత్తూరు జిల్లాలో పల్లె పండుగ 3 0 ప్రారంభం

రూ.30 కోట్లతో సీసీ రోడ్లకు ప్రతిపాదనలు


ఎమ్మెల్యేల నుంచి పనుల వివరాలు సేకరణ


ఇబ్బందికర ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం


మంగళవారం పూతలపట్టు నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభం


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)


గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలోనూ అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాలను గుర్తించి సీసీ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా అవసరమైన పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని శాసనసభ్యులను అధికారులు కోరారు. మంగళవారం పూతలపట్టు నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లె పండుగ 3.0లో భాగంగా గ్రామాల్లో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రధానంగా రహదారుల నిర్మాణం, గ్రామాల అనుసంధానం, పొలాలకు వెళ్లే మార్గాల అభివృద్ధి తదితర పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి రహదారులు నిర్మించనున్నారు.

గ్రామాల్లో రహదారులు అధ్వానంగా ఉండటం, వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటం, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రధాన రహదారులకు అనుసంధానం లేకపోవడం వంటి సమస్యలను పరిగణనలోకి తీసుకుని పనులను గుర్తించనున్నారు. ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించారు. ప్రజల అవసరాలు, రాకపోకల తీవ్రత, గ్రామాల అనుసంధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ 3.0 కింద రూ.11,085 కోట్లతో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.2,700 కోట్లతో 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మొత్తంగా సుమారు 15,500 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి జరగనుంది. దీంతోపాటు పాడి రైతుల కోసం మినీ గోకులాలు, ఉద్యాన పంటల పెంపకం, మ్యాజిక్‌ డ్రెయిన్లు, బస్‌ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర పనులను చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లాకు పల్లె పండుగ 3.0 కింద ప్రత్యేకంగా భారీ బడ్జెట్‌ కేటాయింపు చేయకపోయినా, రాష్ట్రస్థాయి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అవసరమైన పనులను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలను పరస్పరం అనుసంధానం చేసే రహదారులు, పొలాల వరకు వెళ్లే మార్గాల నిర్మాణంపై దృష్టి సారించనున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు అధికంగా ఉండే ప్రాంతాల్లో పొలాలకు రహదారులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పల్లె పండుగ 1.0, పల్లె పండుగ–2.0 కింద మంజూరైన పనులపైనా అధికారులు దృష్టి పెట్టారు. ప్రారంభం కాని పనులకు భూమిపూజలు నిర్వహించి వెంటనే పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పూర్తయిన పనులను కూడా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీంతో గతంలో మంజూరై వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసే చర్యలు చేపడుతున్నారు..పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని మంగళవారం పూతలపట్టు నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రజలకు అత్యవసరంగా అవసరమైన రహదారులు, ఇతర మౌలిక వసతుల పనులను గుర్తించి దశలవారీగా చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పల్లెల్లో రహదారుల పరిస్థితి, ప్రజల రాకపోకలు, వ్యవసాయ అవసరాలను పరిశీలించి పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చిత్తూరు జిల్లా వ్యవసాయం, ఉద్యాన పంటలపై అధికంగా ఆధారపడిన నేపథ్యంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రైతులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ముఖ్యంగా మామిడి, టమాటా, కూరగాయలు తదితర పంటలను పొలాల నుంచి మార్కెట్లకు తరలించేందుకు రహదారులు కీలకంగా మారనున్నాయి. గ్రామాల నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాలకు రాకపోకలు కూడా సులభతరం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె పండుగ 3.0లో భాగంగా చిత్తూరు జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి, నిధుల లభ్యత మేరకు దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఖరారు చేయనున్నారు. దీంతో జిల్లాలోని పల్లెల్లో రహదారుల అభివృద్ధికి మరోసారి ఊపందుకునే అవకాశం ఏర్పడింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *