9, నవంబర్ 2025, ఆదివారం

పవన్ కళ్యాణ్‌కు ప్రణమిల్లిన గజరాజులు

మంత్రిని ఆశీర్వదించి కృతజ్ఞతలు తెలిపిన ఏనుగులు 
ఏనుగులకు బెల్లం, అరటిపండు తినిపించిన పవన్
 ఏనుగుల విన్యాసాలకు పులకరించిన పవన్ 
సెల్ ఫోనులో స్వయంగా అద్భుత దృశ్యాల చిత్రీకరణ


చిత్తూరు, నవంబర్ 9 (ఆంధ్రప్రభ బ్యూరో): తమను పలమనేరు సమీపంలోని ముసలి మడుగు కు తీసుకుని వచ్చి ఏనుగు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు అందులోని గజరాజులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రనమిల్లాయి. మందరికాళ్ళను వంచి మోకాళ్ళ మీద కూర్చొని పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కు తమ ఆశీస్సులు అందజేశాయి. ఏనుగుల ప్రదర్శనకు పవన్ కళ్యాణ్ పులకించిపోయారు. స్వయంగా సెల్ ఫోనులో ఏనుగుల విన్యాసాలను చిత్రీకరించారు. సాదరంగా ఏనుగుల ఆశీర్వాదాన్ని స్వీకరించారు. ఏనుగుల అభిమానానికి ప్రతి అభివాదం చేశారు. ఏనుగులకు ఎంతో ఆప్యాయంగా బెల్లం, అరటి పండ్లను ఆహారంగా అందజేశారు. 

పలమనేరు సమీపంలోని ముసలిమడుగు అటవీ ప్రాంతం ఈరోజు ఉత్సవ వాతావరణం సంతరించుకుంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటనతో అక్కడి గజరాజుల శిబిరం సందడిగా మారింది. నూతనంగా ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించగా, గజరాజులు తమదైన శైలిలో మంత్రిని ఆహ్వానించాయి. ఏనుగులు వరుసగా ముందుకు వచ్చి మోకాళ్లపై వంగి, పవన్ కళ్యాణ్ వైపు ఘీంకారంతో అభివాదం చేశాయి. ఆ దృశ్యం చూసిన పవన్ కళ్యాణ్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఏనుగుల విన్యాసాలను స్వయంగా తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఆ క్షణాలను గుర్తుగా నిలిపారు. ఏనుగులు తనకు నమస్కరించగా, ఆయన వాటికి బెల్లం, అరటిపండ్లు అందించి వాటి ఆశీర్వాదం పొందారు. ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్న ప్రజలు, అధికారులు ఉత్సాహంతో చప్పట్లతో మార్మోగించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మానవ–ఏనుగుల ఘర్షణలు అత్యధికంగా నమోదవుతున్న ప్రదేశం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ముసలిమడుగులో ప్రారంభించిన కుంకీ ఏనుగుల శిక్షణా కేంద్రం ఈ దిశగా ఒక పెద్ద అడుగు అని అన్నారు. గత ఐదేళ్లలో జిల్లాలో ఏనుగుల దాడుల వలన 23 మంది ప్రాణాలు కోల్పోయారని, 34 పశువులు మరణించాయని, 4,000 ఎకరాలకు పైగా పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. ముసలిమడుగు, రామకుప్పం, కుప్పం, యాదమరి, చౌడేపల్లి మండలాల్లో ఏనుగుల చొరబాట్లు తరచుగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏనుగులు అడవిలో సురక్షితంగా జీవించే వాతావరణం కల్పించడం మన బాధ్యత. మానవులు మరియు వన్యప్రాణులు పరస్పరం గౌరవించుకుంటూ సహజీవనం చేసే సమాజం ఏర్పడాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

 మంత్రిని ఆకట్టుకున్న విన్యాసాలు

కర్ణాటకలోని మైసూరు దసరా పండుగల్లో పాల్గొనే కృష్ణ, అభిమన్యు, దేవ, రంజన్, జయంత్, వినాయక్ అనే ఆరు కుంకీ ఏనుగులను ఈ ఏడాది మే నెలలో చిత్తూరుకు రప్పించారు. వీటిని ప్రత్యేకంగా ముసలిమడుగు శిబిరంలో శిక్షణ ఇస్తున్నారు. మావటీల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ఏనుగులు వివిధ విన్యాసాలు ప్రదర్శించగా, పవన్ కళ్యాణ్ వాటిని ఆసక్తిగా వీక్షించారు. ఏనుగులు ఒకే లైన్లో నిలబడి, ఘీంకారాలతో మంత్రిని ఆహ్వానించగా, పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో వాటిని పలకరించారు. ఇవి మన సహజ సంపదలు. వీటిని కాపాడటం మన అందరి బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముసలిమడుగులో ఏర్పాటు చేయబడుతున్న గజారామం నగర వనం ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఏనుగుల చొరబాట్లను తగ్గించేందుకు సౌరశక్తితో పనిచేసే నిరోధక కంచె నిర్మాణానికి పునాదిరాయిని వేశారు. మియావకీ తరహా అడవి పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించి, ఉసిరి మొక్కను స్వయంగా నాటారు. మొక్కలను చూసి ఆనందంతో సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకుంటూ ఇలాగే ప్రతి అడవిని సజీవంగా మార్చాలని అటవీ అధికారులకు సూచించారు.

మావటీల అంకితభావానికి బహుమతి

కుంకీలకు శిక్షణ ఇచ్చే మావటీల కృషిని పవన్ కళ్యాణ్ అభినందించారు. మీ ధైర్యం, సహనం, అంకితభావం వల్లే మనం ఈ మహా జంతువులను నియంత్రించి, సంరక్షించగలుగుతున్నాం అంటూ ప్రశంసించారు. ప్రతీ మావటీకి రూ.50 వేల నగదు బహుమతి ప్రకటించి అందరినీ సంతోషపరిచారు. పవన్ కళ్యాణ్ పర్యటనతో ముసలిమడుగు శిబిరం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. స్థానిక ప్రజలు, విద్యార్థులు, అటవీ సిబ్బంది పెద్ద సంఖ్యలో తరలి వచ్చి గజరాజుల ప్రదర్శనను ఆస్వాదించారు. మన ఏనుగులను కాపాడండి – మన అడవులను కాపాడండి అనే నినాదాలతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ దూడి, స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, వన్యప్రాణుల అదనపు సంరక్షణాధికారి శాంతి ప్రియ పాండే, అటవీ అధికారి యశోదభాయి, డీఎఫ్ఓ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా రాష్ట్రంలో అత్యధిక మానవ–ఏనుగుల ఘర్షణలు నమోదయ్యే ప్రాంతం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తుంది. కుంకీ ఏనుగుల శిక్షణా కేంద్రం ఈ దిశగా పెద్ద ముందడుగు అని అన్నారు. గత ఐదేళ్లలో ఏనుగుల దాడుల వల్ల జిల్లాలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని, వందల ఎకరాల పంటలు నాశనమయ్యాయని తెలిపారు. ముసలిమడుగు, రామకుప్పం, కుప్పం, యాదమరి, చౌడేపల్లి మండలాల్లో ఏనుగుల చొరబాట్లు తరచుగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏనుగులు అడవిలో సురక్షితంగా జీవించేందుకు అనువైన వాతావరణం కల్పించడం మన బాధ్యత. మానవులు మరియు వన్యప్రాణులు శాంతిగా సహజీవనం చేసే సమాజం ఏర్పడేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 కుంకీల అద్భుత ప్రదర్శన

కర్ణాటకలోని దసరా పండుగలకు ప్రసిద్ధి చెందిన మైసూరు కుంకీ ఏనుగులను ఈ ఏడాది మే నెలలో చిత్తూరు జిల్లాకు రప్పించారు. వీటిలో కృష్ణ, అభిమన్యు, దేవ, రంజన్, జయంత్, వినాయక్ అనే ఆరు ఏనుగులు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాయి. శిక్షణలో భాగంగా మావటీలు చూపిన విన్యాసాలు ఉప ముఖ్యమంత్రిని ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ ముందు వరుసగా నిలబడి ఏనుగులు ఘీంకారం చేస్తూ నమస్కరించగా, పవన్ కళ్యాణ్ వాటికి బెల్లం, అరటిపండ్లు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి పవన్ కళ్యాణ్ గజారామం నగర వనంకు శంకుస్థాపన చేశారు. సౌరశక్తితో పనిచేసే ఏనుగు నిరోధక కంచె నిర్మాణానికి పునాదిరాయి వేసి, ఏనుగుల చొరబాట్లను తగ్గించేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం మియావకీ తరహా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉసిరి మొక్క నాటారు.


మావటీలకు బహుమతులు

కుంకీలను శిక్షణ ఇచ్చే మావటీల కృషిని పవన్ కళ్యాణ్ అభినందించారు. మీ ధైర్యం, సహనం, అంకితభావం కారణంగానే మనం ఏనుగులను నియంత్రించగలుగుతున్నామని ప్రశంసిస్తూ, ప్రతి మావటీకీ రూ.50 వేల నగదు బహుమతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ దూడి, స్థానిక ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి, పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, వన్యప్రాణుల అదనపు ప్రధాన సంరక్షణాధికారి శాంతి ప్రియ పాండే, చిత్తూరు అటవీ అధికారి ఆర్. యశోదభాయి, డీఎఫ్‌ఓ శివరామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ పర్యటనతో ముసలిమడుగు శిబిరం ఉత్సవ వాతావరణం సంతరించుకుంది. ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి గజరాజుల ప్రదర్శనను ఆస్వాదించారు. మన ఏనుగులను కాపాడండి – మన అడవులను కాపాడండి అనే నినాదాలతో కార్యక్రమం ముగిసింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *