20, నవంబర్ 2025, గురువారం

నేడు అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులు జమ

రైతులకు శుభవార్త 


చిత్తూరు, నవంబర్ 18 (ఆంధ్రప్రభ బ్యూరో) జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,73,653 మంది రైతులు లబ్ధి పొందుతుండగా, 2,05,753 మంది రైతులు అన్నదాత సుఖీభవ ద్వారా, 1,67,900 మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్నదాత సుఖీభవ పథకం, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాల ద్వారా లబ్ధి పొందనున్న రైతుల సంఖ్య వివరాలు నియోజకవర్గాల వారీగా కింద వివరించబడ్డాయి. ఈ రెండు పథకాల కింద ఒక్కొక్క రైతు ఖాతాలోకి బుధవారం నాడు మొత్తం ఏడు వేల రూపాయలు  జమ కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,73,653 మంది రైతులు లబ్ధి పొందుతుండగా, 2,05,753 మంది రైతులు అన్నదాత సుఖీభవ ద్వారా, 1,67,900 మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఈ వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరు నియోజకవర్గంలో అత్యధికంగా మొత్తం 70,223 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందులో అన్నదాత సుఖీభవ ద్వారా 38,368 మందికి, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 31,855 మందికి సొమ్ము జమ అవుతుంది. పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 69,006. ఈ సంఖ్యలో అన్నదాత సుఖీభవ ద్వారా 37,191 మంది, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 31,815 మంది రైతులు ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 67,317 మంది రైతులు ప్రయోజనం పొందుతుండగా, వీరిలో అన్నదాత సుఖీభవ ద్వారా 36,473 మంది, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 30,844 మంది ఉన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మొత్తం 66,218 మంది రైతులు ఉన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా 36,047 మంది, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 30,171 మంది లబ్ధిదారులు ఈ జాబితాలో ఉన్నారు. నగరి నియోజకవర్గంలో మొత్తం 22,860 మంది రైతులకు సొమ్ము జమ అవుతుంది. వీరిలో అన్నదాత సుఖీభవ ద్వారా 12,472 మంది, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 10,388 మంది రైతులు ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో మొత్తం 20,326 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందులో అన్నదాత సుఖీభవ ద్వారా 11,321 మందికి, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 9,005 మందికి సొమ్ము అందుతుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *