7, నవంబర్ 2025, శుక్రవారం

మిథున్ రెడ్డి కోసం ఆగిన అసమ్మతి రాజీ యత్నాలు !

పెద్దిరెడ్డి, భుమనను కలిసిన ఒక వర్గం నేతలు 

సస్పెన్షన్ ఎత్తివేయాలని, పార్టీని పటిష్టం చేయాలని వినతి

నారాయణస్వామితో చర్చించిన కరుణాకర్ రెడ్డి 

మిథున్ రెడ్డి వచ్చేవరకు ఆగుదామన్న నారాయణస్వామి 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

గంగాధర  నెల్లూరు నియోజక వర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతల రాజీ యత్నాలు సఫలం కాలేదు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నిర్ణయం కోసం ఆగినట్టు తెలిసింది. మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి కుమార్తె, వైసిపి నియోజక వర్గం ఇంచార్జి కృపాలక్ష్మి వ్యతిరేక వర్గం నేతలు ఇటీవల పాలసముద్రంలో సమావేశం అయ్యారు. ఆమెను ఇంచార్జి పదవి నుంచి తొలగించేందుకు అధిష్టానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. నారాయణ స్వామి, కృపాలక్ష్మి తీరుపై అసమ్మతి వ్యక్త చేశారు. ఆరు మండలాలకు చెందిన పలువురు నేతలు ఏకమయ్యారు.


విషయం తెలుసుకున్న కృపాలక్ష్మి ఆదిలోనే అసమ్మతికి చెక్ పెట్టాలని భావించారు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలసి వివరించారు. ఆయన సూచన ప్రకారం రాయలసీమ సమన్వయ కర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డితో చర్చించి ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. సస్పెండ్ అయిన పాలసముద్రం శివప్రకాశ్ రాజు, వెదురుకుప్పం ధనంజయ రెడ్డి తన వర్గం నేతలను కూడగట్టుకుని సస్పెన్షన్ రద్దు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అందరు ఏకమై గురువారం రాష్ట్ర కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్ రెడ్డిని కలసి చర్చించారు. సీనియర్ నాయకులను పార్టీ పోగొట్టుకోవడం మంచిది కాదని వివరించారు. దీనితో దయాసాగర్ రెడ్డి అందరిని వెంటబెట్టుకుని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలసి చర్చించారు. ఆయన సలహా మేరకు  అందరూ కలసి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఆయన పార్టీ క్రమశిక్షణ ఉల్లఘించడం మంచిది కాదని అసమ్మతి నేతలకు హితవు పలికినట్టు తెలిసింది. ఇంచార్జి కృపాలక్మి అందుబాటులో లేక పోవడంతో ఆమె తండ్రి నారాయణ స్వామిని పిలిచి రాజీ చేసే ప్రయత్నం చేశారు. అయితే మిథున్ రెడ్డి వచ్చే వరకు వాయిదా వేయమని నారాయణ స్వామి కోరడంతో రాజీ చర్చలు ఆగిపోయాయి. లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం ఏసిబి కోర్టుకు వెళ్లిన మిథున్ రెడ్డి మంగళవారం తిరుపతికి వస్తారని తెలిసింది. ఆయన వచ్చిన తరువాత అసమ్మతి నేతల సస్పెన్షన్ ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు. కాగా పెద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డిని కలసిన వారిలో  అసమ్మతి నేతలు వీల్కూరు బాబూరెడ్డి, బండి కమలాకర్ రెడ్డి,సురేష్ రెడ్డి, భీమశంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

గంగ 3 పెద్దిరెడ్డిని కలిసిన అసమ్మతి నేతలు 

గంగ 4 భూమనకు అసమ్మతి నేతల వినతి

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *