చిత్తూరు YCP టిక్కెట్టుకు త్రిముఖ పోటి
వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. ప్రస్తుత శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు మరోసారి కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. RTC వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి ఈసారి టిక్కెట్టును ఎలాగైనా దక్కించుకొని ఎమ్మెల్యే కావాలని పావులు కాదుపుతున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ స్వర్గీయ గోపీనాథ్ కుమారుడు భూపేష్ అధిష్టానాన్ని కోరుతున్నారు. మూడు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు చిత్తూరు అసెంబ్లీ టికెట్టు కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు అధిష్టానం ఈ విషయంలో నోరు మెదపలేదు. సిట్టింగ్ కోట కింద తనకే టికెట్ వస్తుందని ప్రస్తుత ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ, అధిష్టానం మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బలమైన అండ ఉండడంతో ఈసారి టికెట్ తనకేనని ధీమాగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో శ్రీనివాసులు మీద వచ్చిన భూకబ్జా ఆరోపణలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రత్యర్థులు సమాయత్తమవుతున్నారు.
ఆరణి శ్రీనివాసులు 15 మే 1952లో యాదమరి మండలం జంగాలపల్లిలో జన్మించారు. BA వరకు చదువుకున్న ఆరణి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘకాలం పార్టీలో పని చేశారు. యాదమరి ZPTC సభ్యుడిగా, ZP విప్ గా పనిచేశారు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి చిత్తూరు నియోజకవర్గం నుండి పి.ఆర్.పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీకే బాబు చేతిలో 1500 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడంతో ఆయన తిరిగి టీడీపీలో చేరి తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఆరణి శ్రీనివాసులు 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినా దక్కలేదు. దీనితో ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేసి, 8 ఏప్రిల్ 2014న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయన 2014లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి డిఏ సత్యప్రభ చేతిలో 6799 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఏఎస్ మనోహర్ పై 39968 ఓట్ల మెక్జారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆర్టీసీ వైస్ చైర్మన్ గా నియమితులైన వ్యాపారవేత్త విజయానంద రెడ్డి తొలినుంచి అసెంబ్లీ టిక్కెట్టు రేసులో ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అమలు చేస్తూ నియోజకవర్గ మీద పట్టు సాధిస్తున్నారు. చిత్తూరు ప్రజల అవసరాలను గుర్తించి నిధులను వ్యయం చేస్తూ, చిత్తూరు ప్రజలకు దగ్గర కావడానికి విజయానంద రెడ్డి పథక రచన చేశారు. ఇందులో భాగంగానే పెద్దిరెడ్డితో సన్నిహితంగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల అమలులో దూసుకుపోతున్నారు. చిత్తూరు మార్కెట్ కు వచ్చే వ్యాపారస్తులు, రైతులు మార్కెట్ చెస్ చెల్లించాల్సి ఉండేది. తోపుడుబండ్ల వర్తకులు, గంపల మీద అమ్ముకునే వాళ్ళు, రోడ్డుమీద అమ్ముకునే వారూ కూడా చెల్లించే వారు. గత మూడు సంవత్సరాలుగా విజయానంద రెడ్డి ఆ పన్నులను గుంపత్తుగా మున్సిపాలిటీకి ఏడాదికి 75 లక్షల రూపాయలు చొప్పున కడుతున్నారు. కావున మున్సిపాలిటీకి పన్ను చెల్లించే అవసరం లేకుండా వ్యాపారస్తులు, రైతులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అలాగే ఎంత జంతువదశాలలకు కూడా పన్ను లేకుండా విజయానంద రెడ్డి చెల్లిస్తున్నారు.
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఇదివరకు ఏ వాహనం వెళ్లినా పది నుండి 50 రూపాయల వరకు పార్కింగ్ ఫీజు వసూలు చేసేవారు. ఆ ఫీజును విజయానంద రెడ్డి చెల్లిస్తూ రోగులు, రోగుల బంధువులు పార్కింగ్ ఫీజు చెల్లించే అవసరం లేకుండా చేశారు. రంజాన్ సమయంలో నియోజకవర్గంలోని ముస్లింలు అందరికీ రెండు కోట్ల రూపాయలతో రంజాన్ తోపాను అందజేశారు. అలాగే గతంలో నీవానదికి వరదలు వచ్చినప్పుడు వరద బాధితులను ఆదుకోవడంలోనూ, కరోనా సమయంలో కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవడంలోనూ విజయానంద రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. కరోనా సమయంలో పేదవారికి నిత్యవసరాలను కూడా సరఫరా చేశారు. ప్రస్తుతం PLR VNR టోర్నమెంట్ ను చిత్తూరులో భారీ స్థాయిలో విజయానంద రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇందులో 155 క్రికెట్ టీములు పాల్గొంటున్నాయి. వీళ్ళందరికీ క్రికెట్ కిట్లను ఉచితంగా అందజేశారు. విజేతకు రెండు లక్షల రూపాయలు బహుమతిని అందచేస్తారు. SR పురం మండలం స్వగ్రామం కొత్తపల్లి మిట్టలో 50కోట్ల రూపాయతో రెండు ఎకరాల స్థలంలో 10 అంతస్తుల భవనం హెలిపాడ్ సౌకర్యంతో స్మార్ట్ DV సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మించారు. 15 వేల మందికి ఉపాథి కల్పించడానికి సిద్దం అయ్యింది. త్వరలో ప్రారంభం కానుంది. మొదటి దశలో చిత్తూరు, గంగాధర నెల్లూరు నియోజక వర్గాలకు చెందిన 3 వేల మందితో ప్రారంభం కానుంది.
చిత్తూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి గుంతల మయం కావడంతో రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండగా 10 లక్షల రూపాయలతో ఓవర్ బ్రిడ్జి మరమ్మత్తు పనులను విజయానంద రెడ్డి చేపట్టారు. అలాగే చిత్తూరు పివికేఎన్ డిగ్రీ కళాశాల సమీపంలో వాకర్ అసోసియేషన్ కోరిక మేరకు 20 లక్షల రూపాయలతో ధ్యాన మందిరాన్ని నిర్మించారు. దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిరమిడ్ ధ్యాన మందిరంగా నామకరణం చేశారు. కార్యకర్తలు మరణించినా, ఆపదలో ఉన్న ఆపన్న హస్తము అందించి విజయానంద రెడ్డి ఆదుకుంటున్నారు. ఇటీవల విజయానంద రెడ్డి జన్మదినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున నిర్వహించారు. చిత్తూరులోనే కాకుండా గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గం విజయానంద రెడ్డి జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఇలా తనదైన శైలిలో పార్టీ నేతల దృష్టిలో పడడానికి విజయానంద రెడ్డి పనిచేస్తూ, పార్టీ ప్రతిస్తాతను ఇముమడింప చేస్తున్నారు.
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గోపీనాథన్ కుమారుడు భూపేష్ గోపీనాథ్ కూడా చిత్తూరు అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్నారు. బీసీ కోటాలో తన పేరును పరిగణించాల్సిందిగా అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. తండ్రి ఆర్ గోపీనాథ్ 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పది సంవత్సరాలు పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు పార్లమెంటుకు పోటీ చేశారు. కుప్పం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు మీద పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసన మండలి సభ్యులుగా గోపీనాథ్ పనిచేశారు. గాండ్ల బిసి సామాజిక వర్గానికి చెందిన గోపీనాథ్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన కుమారుడు గోపీనాథన్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఏటా సంతపేటలో గంగ జాతరను వైభవంగా నిర్వహిస్తున్నారు. పారిశ్రామికవేత్త అయిన భూపేష్ తరసుగా చిత్తూరు ప్రజలను కలుచుకున్తున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ టిక్కెట్లు కోసం ప్రస్తుత ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి మధ్యలోనే ప్రధాన పోటి ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసులకు రాష్ట్రస్థాయిలో ఒక బలమైన వర్గం దన్నుగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సిట్టింగులకే టికెట్ అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడంతో మరోమారు పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు. అందులోనా, చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఏ పార్టీ అయినా బలిజ సామాజిక వర్గానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. విజయానంద రెడ్డి అధిష్టానం దృష్టిలో పడడానికి తన జన్మదిన వేదికగా ఎంచుకున్నారు. జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. తాను చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు తనకు టికెట్ తెప్పిస్తాయని ధీమాగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఆయనకు సపోర్టుగా నిలుస్తోంది. పార్టీలోని ముఖ్యమైన నేతలను ప్రసన్నం చేసుకుని ఈసారి పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. త్రిముఖ పోటీలో ఎవరు టిక్కెట్లు దక్కించుకొని, ప్రజల మనస్సు దోసుకొని విజేతగా నిలుస్తారో వేసి చూడాలి.