ఆడపిల్ల పుట్టిందని భార్యను గదిలో నిర్భంధించి, చిత్ర హింసలు పెట్టిన హోం గార్డ్
నెల రోజులుగా నరకయాతనను భరించిన భార్య
కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వని శాడిజం
బాత్రూంలో నుండి వచ్చే ట్యాంకు నీళ్లను తాగి బతికిన భార్య
తీవ్రంగా కొట్టడంతో చేతి వేళ్ళు విరిగిపోయిన దారుణం
భార్య ముందరే వేరే అమ్మాయిలతో చిందులు
ఆడపిల్లలకు జన్మ ఇచ్చిందని భార్యను నెల రోజులుగా గదిలో నిర్భంధించి, చిత్ర హింసలు పెట్టిన అమానవీయ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగులోకి వచ్చింది. భార్యను చిత్ర హింసలకు గురిచేసింది RTCలో పనిచేసే హోం గార్డ్ కావడం గమనార్హం. నెల రోజుల పాటు భార్యకు తిండి, తిప్పలు కాదు కదా, తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వని దారుణం వెలుగులోకి వచ్చింది. తాగి, రోజు భార్యను చిత్ర హింసలకు గురిచేయడంతో ఎముకలు కూడా విరిగాయి. భార్య ముందరే పరాయి మహిళలను తీసుకువచ్చి, వారితో శృంగారం చేస్తున్నా, వారించలేని దుస్థితి. ఈ విషయాలు విన్న పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు.
పలమనేరు పట్టణంలోని రంగాపురం వీధిలో నివాసం ఉంటున్న, పలమనేరు ఆర్టీసీ డిపోలో హోoగార్డుగా విధులు నిర్వహిస్తున్న చాను కు పలమనేరు పట్టణంలోని కాకతోపు కాలనీకి చెందిన అబ్దుల్, నాజా మునిషా దంపతులకు కుమార్తె సబీహా (28) కు ఆరు సంవత్సరాలు మునువు పెళ్లి జరిగింది. పెళ్లి చేసుకున్న కొద్దీ నెలలకు సబీహా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుండి పచ్చటి కాపురంలో మంటలు రేగాయి. పాప పుట్టిందని రోజు గొడవ పెట్టడం, ఈ పాపను తీసుకెళ్లి తిరుమల మెట్ల మీద వదిలేస్తానని భార్యను బెదిరించడం నిత్యకృత్యంగా మారింది. రోజు చిత్ర హింసలు పెట్టేవాడని సబీహా వాళ్ళ అన్న కంట తడి పెట్టుకున్నాడు. భర్త పెట్టే హింసలు తట్టుకోలేక ఎన్నో సార్లు పుట్టింటికి వెళ్ళిపోయింది.
గ్రామస్తులతో పంచాయతీలు పెట్టి, సర్ది చెప్పి కుటుంబాన్ని చక్కదిద్దిటానికి తల్లిదండ్రులు ప్రయత్నాలు చేశారు. కొద్దీ రోజులు బాగా చూసుకోవడం, మళ్ళీ హింసలు పెట్టడం పెట్టడం ఆనవాయితీగా మారింది. ఈ దశలో గతంలో పలమనేరు రక్షణ శాఖలో సి.ఐ గా పనిన ఇదుర్ బాషా దగ్గర పంచాయతీ పెట్టి సర్ది చెప్పడం జరిగింది. రెండవ సారి కూడ పాప పుట్టడంతో రోజు రోజుకి అతని వికృత చేష్టలు పరాకాష్టకు చేరుకున్నాయి. వేరే అమ్మాయిలను ఇంటికి పిలిపించుకొని, కట్టుకున్న భార్య ముందరే, చిందులు వేయడం, శృంగారం చేయడం ప్రారంభించాడు. వారితో చనువుగా ఉన్న భర్తను చూసినందుకు, ఆమె తల పగలకొట్టి, చేతులు విరిచాడు. సబీహా ఆస్పత్రికి వెళ్లి కట్లు కట్టించుకొని, చికిత్స తీసుకుంది. ఈ విషయాలు పుట్టింటి వారికి చెప్పకూడదని పలు మార్లు ప్రయత్నించిన తప్పలేని పరిస్థితిలో చెప్పడం జరిగింది. నిజాలు బయటకు రావడంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులకు జరిగిన ఘటనను తల్లిదండ్రులు గురించి ఫిర్యాదు చేశారు. పోలిసుల విచారణలో ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యే సన్నివేశాలు వెలుగులోకి వచ్చాయి. నెల రోజులుగా భార్యను గదిలో పెట్టి తాళం వేసి బంధించి, తిండి కూడా పెట్టలేదు. బాత్రూమ్ లో వచ్చిన నీరును తాగి ప్రాణాలను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చేతులను, తలను గాయపరిచి చిత్ర హింసలు పెట్టారని పోలీసుల విచారణలో తేలింది. ఒకరికి బుద్ధి చెప్పాల్సిన పోలీస్ గా ఉండి, తానే కీచకుడైతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసింది. కీచక పోలీసును కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.