మల్లయ్యకు జాతర చేస్తే... వానలు కురవాల్చిందే !!
చిన్న మల్లప్పకు కొండ మీద జాతర చేస్తే, వర్షాలు సంవృద్దిగా పడుతాయి. పంటలు పుష్కలంగా పండుతాయి. పాడి, పంటలతో, సుఖసంతోషాలతో ఆ గ్రామ ప్రజలు జీవనం సాగిస్తారు. మల్లప్పకు జాతర చేయలేదా? ఆ ఏడాది కరువుకాటకలే. అందుకే ప్రతి సంవత్సరం జూన్ నెలలో భక్తి, శ్రద్దలతో మల్లయ్యకు జాతర చేస్తారు. 500 సంవత్సరాలుగా ఆ ఆచారాన్ని ఆ గ్రామలల్లో కొనసాగిస్తున్నారు. చిన్న మల్లప్ప కొండ జాతర వస్తే, భోజనం వండి ఆ బండ మీద రాశిగా పోస్తారు. ఆ అన్నాన్ని గ్రామస్తులు అన్నదానం చేస్తారు. బండను శుబ్రం చేసి, ఆకులు, కంచాలు లేకుండా, వట్టి బండ మీదనే భుజిస్తారు. ఎవరైనా, అలా వట్టి బండ మీద భోజనం చేయల్చిందే. ఆ గ్రామాలలోని చిన్నా, పెద్దా అందరు జాతరలో పాల్గొంటారు. భోచేసి, ఆడుతారు, పాడుతారు. భక్తి, శ్రద్దలతో మల్లయ్యకు పూజలు చేస్తారు. అలా ఆది, పాడి, పూజలు చేసి, ఇంటికి చేరుతారో, లేదో వానలు కురవడం ప్రారంభం అవుతాయి. ఆ సంవత్సరం పాడి, పంటలతో ఆ గ్రామాలు అలరాలుతాయి.
వివరాల్లోకి వెళ్తే...చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గo, గుడిపల్లి మండలం, బెగ్గేలపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని రెండు గ్రామలైనా బండకొత్తూరు, గోకర్లపల్లి గ్రామ ప్రజలు ఈ జాతరను జూన్ లో నిర్వహిస్తారు. చిన్న మల్లప్ప కొండ జాతర వస్తే చాలు గ్రామాల్లో కుటుంబ సమేతంగా కొండ బాట పట్టి, గ్రామానికి శివారున కొలువు తీరిన మల్లప్పకు ప్రజలు కలసి మెలసి పూజలు, కైకార్యాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్టారు. 500 సంవత్సరాలుగా ఈ జాతర ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. జాతర సమయం వచ్చిందంటే గ్రామంలో పూర్వ సంప్రదాయం ఉట్టిన పడుతుంది. గ్రామంలోని ప్రజలు మల్లప్ప కొండ ఆవరణంలో ఉన్న బండ వద్ద వంటలు చేసి, వారు వండిన వంటలను, స్వామి వారికి నైవేద్యం పెట్టి, దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని గ్రామాల ప్రజలు పరమ పవిత్రంగా భుజిస్తారు.
పురాతన సంప్రదాయం అంటే మాకు చాలా మక్కువ, అదేవిధముగా చాలా విశేషం, మేము దైవంగా భావిస్తాo. పూర్వీకుల నుండి తరతరాలుగా మాకు వస్తున్న సంప్రదాయం. మా పెద్దలు పాటించారు. మేము కూడా పటిస్తున్నాం. గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఆరుగాలం వర్షాలతో సస్యస్యామలంగా ఉండాలంటే మా పెద్దలు మాటే మా బంగారు బాట అంటూ బెగ్గిలపల్లి, గోకర్లపల్లి ప్రజలు వివరించారు. పూర్వ సంప్రదాయానికి ఏ మేర విలువనిస్తారో, ఆ గ్రామం ఎలా కట్టు బడింది, నాటి నుండి నేటి వరకు ఆ జాతర ప్రాముఖ్యతను వివరించారు. ఈ రోజుల్లో సంప్రదాయానికి విలువిచ్చి, గౌరవించే గ్రామాలు ఉండటం ఆశ్చర్యకరం.