శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామికి గురుదేవర పూజ ఆదివారం పలమనేరు మండలం గడ్డురు సమీపంలోని మర్రిచెట్టు వద్ద అత్యంత వైభవంగా జరిగింది. బోడిరెడ్డి పల్లి, గడ్డురు జంగం కులస్తులు గురుదేవర పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోడిరెడ్డి పల్లి నుండి గంప ఎత్తుకోని ప్రభాకర్ ముందు నడవగా, బోదిరెడ్డిపల్లి, గడ్డురు జంగం కులస్తులు వారిని అనుసరించారు. మంగళ వాయిద్యాలు, పిళ్ళంగట్లు, చెక్కభజనతో భారీగా ఊరేగింపు సాగింది. దారి పొడవునా వీరభద్రస్వామి గంపకు నీరాజనాలు పట్టారు. వీరద్రభద్ర ఖడ్గాలు ధరించిన గురువులు ముందు నడవగా, వీరభద్రస్వామి దండకాలతో ప్రతిధ్వనించింది. ఘనంగా స్వాగతం పలికారు. బోడిరెడ్డి పల్లి నుండి ప్రారంభం అయిన ఊరేగింపు గడ్డురులో జంగం కులస్తులను కలుపుకొని మర్రిచెట్టు వద్దకు చేరింది.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi3WB110BiqC7t4grLAWEkfNC_c_VQR4gGJ6N_dNiRc7Ik8I7oLAMVLzg_LZoP7FULb2GwM0D32IyPuPTLGuHRjh4uoiYykPFCymB5McBOh_-EUfaY1V1hNf9vUxOch7LBeLh__Jm6ZebT685RGkQvL2A_iaFXhhzuP1VIAxt_DznT2R9Zh56qG2DAh1ks/s320/WhatsApp%20Image%202023-07-09%20at%207.13.05%20PM.jpeg)
వీరభద్రస్వామి గంపకు జంగమ గురువులు వేద మంత్రాలతో, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలుత రాయచోటి వీరభద్రస్వామి స్వామి ఆలయం నుండి 200 సంవత్సరాల కిందట తీసుకువచ్చిన శిలలకు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆది దంపతులు శివపార్వతులకు పూజలు చేశారు. అనంతరం అక్కడే మట్టితో తీర్చిదిద్దిన వీరభద్రస్వామి స్వామికి మంత్ర బద్దంగా పూజలు చేశారు. వీరభద్రస్వామి దండకాలతో ఆ ప్రాంతం మారుమోగింది. భక్తులు అందరూ స్వామివారికి టెంకాయ, పూలు, పూజా ద్రవ్యాలు సమర్పించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు ఆల్కడే అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేశారు. వీరభద్రస్వామి పూజ అనంతరం వీరభద్రస్వామి హోమాన్ని చేశారు. హోమం వేద శాస్త్ర ప్రకారం నిర్వహించారు. అనంతరం హోమ తిలకాన్ని భక్తులకు దిద్ది, పండితులు ఆశీర్వదించారు.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg73fjFYpC3NS5vrFe4XJEGyv4rP_Xo-b5hkZ6JpzV8OTKxTvxaakb6Ipc-0pku2Imj6uz8E0MXn9nVaLfuojUo5S6w0Gu2xp_klstZ54N7kNf4ICY_j5wvXFNODl3q3vx-jekxfhag8ccRTKOAQInYeKsJ72OIwmqT7kLnbs7WDNgDf-74Yud_yyDY9DM/s320/WhatsApp%20Image%202023-07-10%20at%207.18.13%20AM.jpeg)
పలమనేరు జంగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంటన్నగారి ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పూజా ద్రవ్యాలను జంగం సంక్షేమ సంఘం పలమనేరు డివిజన్ అధ్యక్షుడు సోమారపు లక్ష్మీనారాయణ, గంగవరం మండల అధ్యక్షుడు బెంగళూరు జయరాం, ఎలెట్రికల్ షాపు యజమాని కరేటి కృష్ణ సమకూర్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాటి గంగాధర్, జిల్లా అధ్యక్షుడు సంకు బాలయ్య, ప్రధాన కార్యదర్శి బండారు సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు బొజ్జ వెంకటేష్ సతీసమేతంగా పాల్గొన్నారు.
మునిసిపల్ చైర్ పర్సన్ పవిత్రా మురళీకృష్ణ, అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసల రవి, మండల డిప్యూటీ తహసీల్దార్ సూర్యప్రకాష్, ఏరియా హాస్పిటల్ చైర్మన్ చెంగా రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ మండి సుధ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. వారిని కార్యనిర్వాహకులు ఘనంగా సన్మానించి, ఆశీర్వదించారు. పూజాది కార్యక్రమాలను గురువులు దేవప్ప, వెంకటేష్, సోమప్ప, రామచంద్ర, అప్పన్న, రామయ్య నిర్వహించారు. వీరికి పాదపూజ చేసి, సన్మానించారు.