1, జులై 2023, శనివారం

కుక్కల పరుగు పందాలు !... బహుమతులు !!

 * జల్లికట్టును తలపిస్తున్న కుక్కల కట్టు..

 * చూపరులను ఆకట్టుకున్న కుక్కల పరుగు పందెం..

* పోటికి  ఆసక్తి చూపుతున్న కుక్కల  యజమానులు

* భారీగా తరలి వచ్చిన ప్రేక్షకులు 



                       మనం ఇప్పటి వరకు కోడి  పందాలు, ఎడ్ల పందాలు, పశువుల పోటీలు విన్నాం... చూస్తున్నాం.  ఆసక్తికరంగా తిలకించి ఎంజాయ్ చేశాం. కానీ కుక్కల పోటీలు గురించి విన్నారా?  ఇతరదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, జిల్లాల్లో కాదు. మన జిల్లాలోనే జరిగింది అంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. జరిగింది ఎక్కడో కాదు.. మన కుప్పం నియోజకవర్గంలో.... శాంతిపురం మండలంలో. విదేశాల్లో  కనిపించే కల్చర్ ఒక్కసారిగా చిత్తూరు జిల్లాకు పాకడంతో ఈ పోటీలను చూడ్డానికి ప్రజలు మన రాష్ట్రం నుండే కాదు.. కర్ణాటక.. తమిళనాడు నుండి కూడా తలలివచ్చారు. హౌరా! అనుకున్నారు. ముక్కున వేలేసుకున్నారు.



                   వివరాల్లోకి వెళ్ళితే...  కుప్పం నియోజకవర్గo, శాంతిపురం మండలం, చిన్నారిదొడ్డి గ్రామంలో  కుక్కల పందాలు నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా కుక్కలకు పోటీలు నిర్వహిస్తున్న విషియం  తెలుసుకొన్న  చుట్టుపక్కల గ్రామస్థులు  సంఘటన స్థలంలో పరుగు పంధాలను తిలకించడానికి  పెద్ద ఎత్తున గుమికుడారు. పరుగు పందెంలో ఉరకెలేస్తున్న కుక్కలను చూసి ప్రజలు ఆశ్చర్య పోయారు. పోటీల్లో గెలుపొందిన కుక్కలకు బహుమతులు కూడా ప్రధానం చేశారు. గెలుపొందిన 20 కుక్కలకు బహుమతులు ప్రధానం చేసి, కుక్కల యజమానులను అభినందించారు. 



               ఇలా కుక్కల పరుగు పందేలను నిర్వహించారు. పాడి ఆవుల కారణంగా, ట్రాక్టర్ల కారణంగా కోడె దూడలు క్రమంగా అదృశ్యం అవుతున్నాయి. కావున కోడెల పందాలను నిర్వహించడం ఇక కుదరదు. కుక్కలు అయితే ఇంటికి ఒక్కటి, రెండు ఉంటాయి. కావున కుక్కల పందాలు నిర్వహించారు. భవిషత్తులో పిల్లులు, ఎలుకల పందాలను కూడా నిర్వహిస్తారేమో చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *